Multibaggar stock alert : 6 నెలల్లో.. రూ. 1లక్షను రూ. 5.89లక్షలుగా మార్చిన స్టాక్!
09 October 2022, 19:14 IST
- ఇండియా స్టాక్ మార్కెట్లోని మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో.. ఏబీసీ గ్యాస్ ఇంటర్నేషనల్ స్టాక్ ఒకటి. ఈ స్టాక్ 6 నెలల్లో రూ. 1లక్షను ఏకంగా రూ. 5.89లక్షలుగా మార్చింది!
6 నెలల్లో రూ. 1లక్షను రూ. 5.89లక్షలుగా మార్చిన స్టాక్
ABC Gas International share price : మనం కొనుగోలు చేసిన స్టాక్ వరుసగా అప్పర్ సర్క్యూట్లు కొడుతుంటే.. ఆ ఫీలే వేరు! ఇక మనం కొన్న స్టాక్ మల్టీబ్యాగర్ రిటర్నులు ఇస్తే.. పండుగే. అలాంటిది.. రూ. 1లక్ష పెట్టి కొన్న స్టాక్.. కేవలం 6 నెలల్లో దాదాపు రూ. 6లక్షలుగా మారితే? ఏబీసీ గ్యాస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ స్టాక్‌లో పెట్టుబడి పెట్టిన మదుపర్ల పరిస్థితి ఇదే.
ఏబీసీ గ్యాస్ ఇంటర్నేషనల్ షేరు..
ఈ స్మాల్ క్యాప్ స్టాక్.. మల్టీబ్యాగర్ రిటర్నులు తెచ్చిపెట్టింది. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి ఏబీసీ గ్యాస్ ఇంటర్నేషనల్ స్టాక్ అప్పర్ సర్క్యూట్లో రూ. 74.30 వద్ద స్థిరపడింది. దీని వాల్యూమ్‌లు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.
ABC Gas International shares : 2007 ఫిబ్రవరిలో ఈ స్టాక్ ధర రూ. 1.65గా ఉండేది. అంటే.. ఏబీసీ గ్యాస్ ఇంటర్నేషనల్ స్టాక్.. 15ఏళ్లల్లో 4,403.03శాతం రిటర్నులు తెచ్చిపెట్టినట్టు. అప్పటి రూ. 1లక్ష పెట్టుబడి కాస్త.. ఇప్పుడు రూ. 45లక్షలు అయ్యుండేది.
2017 డిసెంబర్ 11న రూ. 25 వద్ద ఉంది ఈ మల్టీబ్యాగర్ ఏబీసీ గ్యాస్ ఇంటర్నేషనల్ స్టాక్. అంటే ఐదేళ్లల్లో 24.24శాతం సీఏజీఆర్‌తో వృద్ధి చెందతూ.. ఏకంగా 197.20శాతం రిటర్నులు ఇచ్చినట్టు. ఐదేళ్ల ముందు రూ. 1లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, దాని విలువ ప్రస్తుతం రూ. 2.97లక్షలుగా ఉంటుంది.
ABC Gas International share price multibaggar : 2019 అక్టోబర్ 11న రూ. 8.65గా ఉంది ఈ స్టాక్. అంటే మూడేళ్ల ముందు రూ. 1లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే.. ఇప్పుడు దాని విలువ రూ. 8.74లక్షలుగా మారేది.
2021 అక్టోబర్ 11న రూ. 12.58గా ఉంది ఏబీసీ గ్యాస్ ఇంటర్నేషనల్ స్టాక్ ధర. అంటే ఏడాది కాలంలో 516.67శాతం సీఏజీఆర్‌తో వృద్ధి చెందింది. ఫలితంగా ఏడాది కాలంలో రూ. 1లక్ష కాస్త.. రూ. 5.90లక్షలుగా మారేది. ఇక ఈ ఏడాది జనవరి 14న రూ. 13 దగ్గర ఉన్న ఈ స్టాక్ ప్రస్తుతం రూ. 74.30 వద్ద స్థిరపడింది. అంటే.. ఈ ఒక్క ఏడాదిలోనే 471.54శాతం రిటర్నులు తెచచిపెట్టినట్టు. అంటే రూ. 1లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే.. దాని విలువ రూ. 5.71లక్షలుగా మారుండేది.
Multibaggar stock news : చివరిగా.. ఆరు నెలల క్రితం.. అంటే 2022 మే 16న ఈ స్టాక్ ధర రూ. 12.60గe ఉన్నప్పుడు రూ. 1లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే.. దీని ధర ఇప్పుడు రూ. 5.89లక్షలుగా ఉండేది.
వాస్తవానికి ఈ ఏబీసీ గ్యాస్ ఇంటర్నేషనల్ స్టాక్ ఆల్ టైమ్ హై రూ. 153.50 వద్ద ఉంది. సెప్టెంబర్ నుంచి మార్కెట్ కరెక్ట్ అవుతుండటంతో ఈ స్టాక్ భారీగా పతనమైంది. అయినప్పటికీ.. ఆరు నెలల్లో 489.68శాతం రిటర్నులు తెచ్చిపెట్టింది.
టాపిక్