Multibagger stock: రూ. 1 లక్ష పెట్టుబడిని రూ. 2 కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్
22 September 2022, 14:26 IST
- Multibagger stock: ఐదేళ్ల క్రితం ఈ కెమికల్ కంపెనీ షేర్లలో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే.. ఇప్పుడది రూ. 2 కోట్లుగా మారి ఉండేది..
Multibagger stock: రూ. లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే ఈ కంపెనీలో అదిప్పుడు రూ. 2 కోట్లయ్యేది..
భారతీయ స్టాక్ మార్కెట్ పరిధిలోని మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో జ్యోతి రెసిన్స్, అదెసివ్స్ ఒకటి అని చెప్పుకోవాలి. ఈ మల్టీబ్యాగర్ కెమికల్ స్టాక్ ఇటీవలే ఎక్స్-బోనస్‌గా ట్రేడయ్యింది. ఈ కెమికల్ స్టాక్ 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇవ్వడం ఇదే మొదటి సారి. అంటే దాని వాటాదారులు ప్రతి షేర్‌కు రెండు బోనస్ షేర్లు పొందుతారు. గత ఐదేళ్లలో ఈ కెమికల్ స్టాక్ రూ. 25 నుండి రూ. 1,656 వరకు పెరిగింది. ఈ కాలంలో 6,500 శాతానికి పైగా పెరిగింది.
ఆగస్టు 2022లో ఈ కెమికల్ కంపెనీ భారతీయ స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజీలకు సవరించిన బోనస్ షేర్ల రికార్డ్ డేట్ గురించి తెలియజేసింది. ‘మేం గతంలో సమర్పించిన సమాచారంలో కొంత క్లరికల్ లోపం కారణంగా బోనస్ షేర్ల రికార్డ్ తేదీ సవరణ సమాచారాన్ని సమర్పిస్తున్నాం. కంపెనీ బోనస్ ఈక్విటీ షేర్లను జారీ చేయడానికి అర్హులైన షేర్‌హోల్డర్ల అర్హతను నిర్ధారించే ఉద్దేశ్యంతో కంపెనీ సెప్టెంబర్ 09ని రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది..’ అని వివరించింది.
దీర్ఘకాలిక పెట్టుబడిదారులపై బోనస్ షేర్ల ప్రభావం
ఒక ఇన్వెస్టర్ ఐదేళ్ల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో రూ. లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ఒక్కో షేరు రూ. 25కి అందుబాటులో ఉండడంతో దానికి 4,000 కంపెనీ షేర్లు వచ్చేవి. 2:1 బోనస్ షేర్ ఇష్యూ తర్వాత ఈ 4,000 స్టాక్‌లు అదనంగా 8,000 స్టాక్స్ ఆర్జించాయి. షేర్‌హోల్డర్‌లు ఒక్కో షేర్‌కి రెండు స్టాక్స్ బోనస్ షేర్‌లుగా పొందుతారు. అందువల్ల పెట్టుబడిదారుని నికర వాటా 12,000 (4,000 + 8,000)కి చేరుకుంది.
రూ. లక్ష రూ.2 కోట్లకు మారుతుంది..
బుధవారం ఎన్‌ఎస్‌ఇలో జ్యోతి రెసిన్స్ షేరు ధర రూ. 1,656.05 వద్ద ముగియడంతో, షేర్ హోల్డర్ రూ. 1 లక్ష నికర విలువ రూ. 1.98 కోట్లు (రూ. 1,656.05 X 12,000)గా ఉంటుంది. అయితే గత ఐదేళ్లలో కూడా స్టాక్ తన వాటాదారులకు డివిడెండ్ ఇచ్చింది. ఈ డివిడెండ్‌లను ఈ రూ. 1.98 కోట్లకు జోడిస్తే దాదాపు రూ. 2 కోట్లు అవుతాయి. బుధవారం ఈ మల్టీబ్యాగర్ స్టాక్ రూ.1,987 కోట్ల మార్కెట్ క్యాప్‌తో ముగిసింది. బీఎస్ఈ లిస్టెడ్ స్టాక్ బుధవారం 28,367 ట్రేడ్ వాల్యూమ్‌తో ముగిసింది. ఇది గత 20 రోజుల సగటు ట్రేడ్ వాల్యూమ్ 36,955 కంటే తక్కువగా ఉంది.