తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Small Cap Multibagger Stock : 30నెలల్లో.. మదుపర్ల సంపదను 5రెట్లు పెంచిన స్టాక్​!

Small cap multibagger stock : 30నెలల్లో.. మదుపర్ల సంపదను 5రెట్లు పెంచిన స్టాక్​!

Sharath Chitturi HT Telugu

02 October 2022, 14:43 IST

google News
    • Small cap multibagger stock : మల్టీబ్యాగర్​ స్టాక్​ కోసం మదుపర్లు వెతుకుతూ ఉంటారు. అలాంటి మల్టీబ్యాగర్​ స్టాక్​ ఒకటి.. 30నెలల్లో ఏకంగా 5రెట్లు పెరిగింది.
30నెలల్లో 5రెట్లు పెరిగిన మదుపర్ల సంపద..!
30నెలల్లో 5రెట్లు పెరిగిన మదుపర్ల సంపద..!

30నెలల్లో 5రెట్లు పెరిగిన మదుపర్ల సంపద..!

Multibagger small cap stock : త్రివేణి టర్బైన్​​ అనే స్మాల్​ క్యాప్​ స్టాక్​.. మల్టీబ్యాగర్​ రిటర్నులతో మదుపర్లను సంతోషపరిచింది. 30 నెలల కన్నా తక్కువ సమయంలో ఈ మల్టీబ్యాగర్​ త్రివేణి టర్బైన్​ మల్టీబ్యాగర్​ స్టాక్​ ఏకంగా 368శాతం రిటర్నులను తెచ్చిపెట్టింది. కొవిడ్​ తొలి లాక్​డౌన్​ సమయం నుంచి ఈ స్టాక్​ రూ. 185 పెరిగింది. మరి ఈ స్టాక్​ను ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా?

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సమయానికి త్రివేణి టర్బైన్​ స్టాక్​ రూ. 234.80 వద్ద ముగిసింది. క్రితం ట్రేడింగ్​ సెషన్​తో పోల్చుకుంటే అది 1.19శాతం ఎక్కువ. ఫలితంగా బీఎస్​ఈలో ఈ మల్టీబ్యాగర్​ స్టాక్​ మార్కెట్​ క్యాపిటల్​ రూ. 7,591.21కోట్లకు చేరింది.

Triveni Turbine share price : ఈ త్రివేణి టర్బైన్​ 52వీక్​ హై రూ. 248.20గా ఉంది. అంటే ఇంకో 11 రూపాయలు పెరిగితే.. ఈ మల్టీబ్యాగర్​ స్టాక్​ 52 వీక్​ హైని తాకుతుంది.

2023 ఆర్థిక ఏడాదిలో ఈ స్టాక్​ 50.5శాతం పెరిగింది. ఏడాది కాలంలో త్రివేణి టర్బైన్​ షేరు ధర రూ. 46.5శాతం వృద్ధి చెందింది.

కొవిడ్​ మొదటి లాక్​డౌన్​కి ఒక రోజు ముందు.. అంటే 2020 మార్చ్​ 24న ఈ స్టాక్​ ధర రూ. 50.2 వద్ద క్లోజ్​ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్​ మార్కెట్లు పతనం కావడంతో ఈ స్టాక్​ కూడా పడింది. కానీ.. ఆ తర్వాత క్రమంగా కోలుకుంటూ.. త్రివేణి టర్పైన్​ ఒక మల్టీబ్యాగర్​ స్టాక్​గా నిలిచింది.

ఇక మొదటి లాక్​డౌన్​ నుంచి రెండున్నర ఏళ్లల్లో ఈ మల్టీబ్యాగర్​ స్మాల్​ క్యాప్​ స్టాక్​ ధర 367.73శాతం పెరగడం విశేషం. అంటే.. 30నెలల వ్యవధిలో మదుపర్ల సంపద ఏకంగా 5రెట్లు పెరిగిందని అర్థం.

త్రివేణి టర్పైన్​ స్టాక్​ని ఇప్పుడు కొనొచ్చా?

Triveni Turbine multibaggar stock news : ఈ త్రివేణి టర్బైన్​ కంపెనీ.. ఇండస్ట్రియల్​ స్టీమ్​ టర్బైన్​ను మేన్యుఫ్యాక్చర్​ చేస్తుంది. 5-30 మెగా వాట్ల రేంజ్​లో ఈ టర్బైన్​ల సామర్థ్యం ఉంటుంది. కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా కూడా డెలివరీలు చేస్తోంది ఈ సంస్థ.

అయితే.. ఈ త్రివేణి టర్బైన్​ ఆర్డర్​ బుకింగ్​ బలంగా ఉందని చెబుతోంది ఆనంద్​ రతి అనే స్టాక్​ బ్రోకరేజ్​ సంస్థ. ఫలితంగా బై కాల్​ ఇస్తోంది. భవిష్యత్తులో ఈ మల్టీబ్యాగర్​ స్మాల్​ క్యాప్​ స్టాక్​ రూ. 285కి చేరే అవకాశం ఉందని చెబుతోంది.

2023ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో ఈ సంస్థ.. రూ. 28.33కోట్ల లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 27.75కోట్లుగా ఉంది. ఇక రెవెన్యూ కూడా పెరిగింది. గతేడాది రూ. 184.06కోట్లుగా ఉండగా.. ఇప్పుడది రూ. 259.04కోట్లకు పెరిగింది.

(గమనిక : ఇది కేవలం నిపుణులు సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎళాంటి సంబంధం లేదు. ఏదైనా పెట్టుబడులు చేసే ముందు.. మీ ఫైనాన్షియల్​ ఎడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం