తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Multibagger Stock : రూ. 1 లక్షను రూ. 1కోటిగా మార్చిన మల్టీబ్యాగర్​ స్టాక్​..!

Multibagger stock : రూ. 1 లక్షను రూ. 1కోటిగా మార్చిన మల్టీబ్యాగర్​ స్టాక్​..!

Sharath Chitturi HT Telugu

18 September 2022, 17:05 IST

    • Multibagger stock : మల్టీబ్యాగర్​ స్టాక్​ 3ఎం ఇండియా.. రూ. 1 లక్షను రూ. కోటిగా మార్చేసింది. ఆ వివరాలు..
రూ. 1 లక్షను రూ. 1కోటిగా మార్చిన మల్టీబ్యాగర్​ స్టాక్​..!
రూ. 1 లక్షను రూ. 1కోటిగా మార్చిన మల్టీబ్యాగర్​ స్టాక్​..! (istockphoto)

రూ. 1 లక్షను రూ. 1కోటిగా మార్చిన మల్టీబ్యాగర్​ స్టాక్​..!

3M India stock : రూ. 26,945.65కోట్లు విలువ చేసే మార్కెట్​ క్యాపిటల్​ ఉన్న లార్జ్​క్యాప్​ కంపెనీ 3M India.. మల్టీబ్యాగర్​ రిటర్నులు తెచ్చిపెట్టి, మదుపర్లకు సంతోషాన్నిచ్చింది. అబ్రెసివ్​, అథేసివ్స్​, సీల్​యాంట్స్​, ఫిల్లర్​, అడ్వాన్స్​డ్​ మెటీరియల్స్​, ఆటోమోటివ్​ పార్ట్స్​, హార్డ్​వేర్​, బిల్డింగ్​ సప్లై, క్వీనింగ్​ సప్లై, కోటింగ్​ కౌంపౌండ్స్​, పాలిషింగ్​, డెంటల్​, ఆర్థోడాంటిక్స్​, ల్యాబ్​ శాంపిల్స్​, టెస్టింట్​, లూబ్రికెంట్స్​, పర్సనల్​ ప్రొటెక్టివ్​ ఎక్విప్​మెంట్, ఆఫీస్​ సప్లై, టేప్స్​, మేన్యుఫ్యాక్చరింగ్​ టూల్స్​తో పాటు ఇతర ఉత్పత్తులను తయారు చేస్తుంది ఈ 3M India సంస్థ. ఇదొక డెట్​ ఫ్రీ సంస్థ కావడం మరో విశేషం. ఈ స్టాక్​.. దీర్ఘకాలంలో రూ. లక్ష పెట్టుబడి పెట్టిన మదుపర్లను కోటీశ్వరులుగా మార్చింది!

3M India share price :

శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్​ సెషన్​తో 3M India share price బీఎస్​ఈలో రూ. 23,919.65గా ఉంది. గురువారం (రూ. 22,890.10)తో పోల్చుకుంటే ఇది 4.50శాతం ఎక్కువ. అయితే.. 1997 జులై 11న రూ. 220గా ఉన్న ఈ స్టాక్​ ధర.. ఇప్పుడు రూ. 23,919కి చేరడం విశేషం. ఫలితంగా 3M India సంస్థ మల్టీబ్యాగర్​ రిటర్నులను డెలివరీ చేసింది.

25ఏళ్ల క్రితం ఈ 3M India stock లో రూ. 1లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే.. ఇప్పుడు దాని విలువ రూ. 1కోటిగా ఉండేది.

ఐదేళ్లల్లో ఈ 3M India షేరు 64.12శాతం వృద్ధిచెందింది. కాగా గతేడాది మాత్రం 4.72శాతం పతనమైంది. ఇక 2022 నుంచి ఇప్పటి వరకు ఈ 3M India share price 7.30శాతం పడిపోయింది. దీని ఆల్​ టైమ్​ హై వాల్యూ(2021 నవంబర్​ 8) రూ. 27,800గా ఉంది. దీని 52 వీక్​ లో(2022 మే 27) రూ. 17,300గా ఉంది. అంటే.. ఆల్​ టైమ్​ హై నుంచి ఈ 3M India షేరు ధర 13.96శాతం దిగువన ట్రేడ్​ అవుతోంది.

3M India shares ని ఇప్పుడు కొనొచ్చా?

ఈ 3M India షేర్లు 10డే, 20డే, 50డే, 100డే, 200డే ఈఎంఐ (ఎక్స్​పోనెన్షియల్​ మూవింగ్​ యావరేజ్​) ఎగువనే ఈ 3M India షేరు ఉంది. ఆర్​ఎస్​ఐ వాల్యూ 66.61గా ఉంది. అంటే ఇది ఓవర్​బాట్​ లేదా ఓవర్​సోల్డ్​లో లేదని అర్థం.

ఈ 3M India సంస్థ షేర్లపై ఐసీఐసీఐ సెక్యూరిటీస్​.. గురువారం ఓ నివేదికను విడుదల చేసింది.

"లోకల్​ మేన్యుఫ్యాక్చరింగ్​ కెపాసిటీని కంపెనీ విస్తరిస్తోంది. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆటోమోటివ్​, కన్జ్యూమర్​ సెగ్మెంట్​లో కొత్తగా నాలుగు ప్రాడక్టులను ప్రవేశపెట్టింది," అని పాజిటివ్​ పాయింట్లను హైలైట్​ చేసింది నివేదిక. అయితే సంస్థ ఆర్థిక వ్యవహారాల్లో బలహీనత కనిపిస్తోందని నివేదిక పేర్కొంది.

మల్టీబ్యాగర్​ స్టాక్స్​ను ముందే గుర్తించి .. భారీ లాభాలు పొందడం ఎలా? అన్ని విషయాన్ని తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

(గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం రాసింది మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో పెట్టుబడి పెట్టే ముందు.. మీ ఫైనాన్షియల్​ ఎడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం