తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Multibagger Stock| ‘‘లక్ష రూపాయలు రూ. 50 కోట్లు అయ్యాయి’’

Multibagger stock| ‘‘లక్ష రూపాయలు రూ. 50 కోట్లు అయ్యాయి’’

HT Telugu Desk HT Telugu

16 September 2022, 22:43 IST

    • 1 lakh jumps to 50 Cr: ఒక లక్ష రూపాయలు కొన్నేళ్లలో రూ. 50 కోట్లు అయ్యాయి. ఇందులో మాయలు, మంత్రాలు, స్కామ్ లు ఏమీ లేవు. ఒక కంపెనీ షేర్లను 23 ఏళ్ల క్రితం 1 లక్ష రూపాయలు పెట్టి కొంటే.. ఇప్పుడు వాటి విలువ రూ. 50 కోట్లు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (istockphoto)

ప్రతీకాత్మక చిత్రం

1999లో రూ 1 లక్ష పెట్టి ఈ సంస్థ షేర్లు కొన్నవారు.. ఇప్పుడు రూ. 50 కోట్లకు అధిపతి. అంటే 23 ఏళ్లలో ఈ సంస్థ షేరు విలువ వేల రెట్లు పెరిగింది. ఇంతకూ మదుపర్లకు ఆ స్థాయిలో లాభాలనిచ్చిన సంస్థ ఏదో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

1 lakh jumps to 50 Cr: బీఈఎల్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(Bharat Electronics Ltd |#+|BEL|#+|). రక్షణ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ. నవరత్నాల్లో ఒకటి. భారత త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ల కోసం ఆధునిక ఎలక్ట్రానిక్ ఎక్వీప్ మెంట్ ను తయారు చేస్తుంది. ఈ సంస్థకు అప్పులేవీ లేవు. ప్రస్తుతం ఈ సంస్థ మార్కెట్ విలువ రూ. 81,284.74 కోట్లు. ఇందులో 23 ఏళ్ల క్రితం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారు ఇప్పుడు 50 కోట్ల రూపాయలకు అధిపతి. సెప్టెంబర్ 16, 2022 శుక్రవారం రోజు ఈ సంస్థ షేరు విలువ రూ. 111.75 గా ముగిసింది. జనవరి 1, 1999 న ఈ షేరు విలువ రూ. 0.22 మాత్రమే. అంటే, 23 ఏళ్ల క్రితం 22 పైసలుగా ఉన్న ఒక షేరు విలువ ఇప్పుడు రూ. 111.75 కి చేరింది.

1 lakh jumps to 50 Cr: బోనస్ షేర్లు

ఇప్పటివరకు ఈ సంస్థ మూడు సార్లు మదుపర్లకు బోనస్ షేర్లను ప్రకటించింది. 1999లో రూ. 1 లక్ష పెడితే ఈ సంస్థకు చెందిన 4,54,545 షేర్లు వచ్చేవి. ఆ తరువాత వరుసగా 2015, 2017, 2022లో బీఈఎల్ బోసన్ షేర్లను ప్రకటించింది. 2015లో 2:1 రేషియోలో, 2017లో 1:10 రేషియోలో, 2022లో మళ్లీ 2:1 రేషియోలో బోనస్ షేర్లను ప్రకటించింది. ఈ మొత్తం బోనస్ షేర్లతో కలిపి ఆ 4,54,545 షేర్ల సంఖ్య 44,99, 996 కి చేరుతుంది. అంటే దాదాపు 45 లక్షల షేర్లు. వీటి విలువను సెప్టెంబర్ 16, 2022 నాటి షేరు విలువ రూ. 111.75 తో లెక్క కట్టండి. మల్టీబ్యాగర్ కు సిసలైన అర్థంగా కనిపిస్తోంది కదా ఈ షేరు. కాకపోతే, 1999 లో కొన్న షేర్లను ఇప్పటివరకు అమ్మకుండా ఉన్నవారికే ఈ జాక్ పాట్.

తదుపరి వ్యాసం