Tata Steel Q2 results : అంచనాలు తప్పిన టాటా స్టీల్​ క్యూ2 ఫలితాలు!-tata steel q2 results consolidated pat dips 87 percent misses estimate ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Steel Q2 Results : అంచనాలు తప్పిన టాటా స్టీల్​ క్యూ2 ఫలితాలు!

Tata Steel Q2 results : అంచనాలు తప్పిన టాటా స్టీల్​ క్యూ2 ఫలితాలు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Oct 31, 2022 06:01 PM IST

Tata Steel Q2 results 2022: టాటా స్టీల్​ క్యూ2 ఫలితాలు అంచనాలు తప్పాయి! సంస్థ కన్సాలిడేటెడ్​ ప్యాట్​ 87శాతం తగ్గింది.

అంచనాలు తప్పిన టాటా స్టీల్​ క్యూ2 ఫలితాలు!
అంచనాలు తప్పిన టాటా స్టీల్​ క్యూ2 ఫలితాలు!

Tata Steel Q2 results 2022 : దేశీయ దిగ్గజ స్టీల్​ కంపెనీ టాటా స్టీల్​.. క్యూ2 త్రైమాసిక ఫలితాలను సోమవారం ప్రకటించింది. సెప్టెంబర్​తో ముగిసిన త్రైమాసికానికి సంస్థ కన్సాలిడేటెట్​ ప్యాట్​(ప్రాఫిట్​ ఆఫ్టర్​ ట్యాక్స్​).. రూ. 1,514కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంతో(రూ. 11,918కోట్లు) పోల్చుకుంటే ఇది 87శాతం తక్కువ.

ఇక గత త్రైమాసికంలో టాటా స్టీల్​ ప్యాట్​ రూ. 7,764.96కోట్లుగా ఉంది. అంటే ఈసారి 80శాతం తగ్గినట్టు!

జులై- సెప్టెంబర్​ త్రైమాసికంలో టాటా స్టీల్​ రెవెన్యూ 0.8శాతం తగ్గి రూ. 59,877.52కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఆపరేషన్స్​ రెవెన్యూ రూ. 60,387.13కోట్లుగా ఉండేది. ఇక సంస్థ అడ్జస్టెడ్​ ఎబిట్​డా రూ. 6,271కోట్లుగా నమోదైంది.

Tata steel Q2 results : టాటా స్టీల్​ కన్సాలిడేటెడ్​ ప్యాట్​ రూ. 3000కోట్లుగాను, రెవెన్యూ రూ. 56,900కోట్లుగాను ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. తాజా ఫలితాలు ఈ అంచనాలను తప్పాయి.

"అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం, భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావంతో కార్యకలాపాలు తీవ్ర ఒడిదొడుకులకు గురయ్యాయి. ఎన్ని కష్టాలొచ్చినా.. టాటా స్టీల్​ డొమెస్టిక్​ సేల్స్​ మెరుగ్గా నమోదయ్యాయి. ప్రాడక్ట్​ పోర్ట్​ఫోలియో బలంగా ఉండటమే ఇందుకు కారణం," అని టాటా స్టీల్​ సీఈఓ, ఎండీ టీవీ నరేంద్రన్​ తెలిపారు.

సోమవారం సమావేశమైన టాటా స్టీల్​ బోర్డు.. 7 లిస్టెడ్​, అన్​లిస్టెడ్​ కంపెనీలను సంస్థలో విలీనం చేసే ప్రతిపాదనను ఆమోదించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

టాటా స్టీల్​ షేరు ధర..

Tata Steel share price : సోమవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సమయానికి టాటా స్టీల్​ షేర్​ ప్రైజ్​ రూ. 101.10 వద్ద స్థిరపడింది. ఈ రోజు 0.49శాతం నష్టపోయింది. గత ఐదు ట్రేడింగ్​ సెషన్స్​లో టాటా స్టీల్​ షేరు ధర రూ. 0.15శాతం పడిపోయింది. ఇక నెల రోజుల్లో 2.8శాతం వృద్ధిచెందింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు టాటా స్టీల్​ షేర్​ ప్రైజ్​ ఏకంగా 11.51శాతం పతనమైంది.

సంబంధిత కథనం