Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి 5 స్టాక్స్​ లిస్ట్​..-day trading guide for today 5 stocks to buy on tuesday 1st november ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Day Trading Guide For Today: 5 Stocks To Buy On Tuesday 1st November

Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి 5 స్టాక్స్​ లిస్ట్​..

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 01, 2022 07:14 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన 5 స్టాక్స్​ లిస్ట్​ని నిపుణులు సూచించారు. ఆ వివరాలు..

ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​..
ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​.. (REUTERS)

Stocks to buy today : అంతర్జాతీయ సానుకూలతలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు వరుసగా మూడు సెషన్స్​లో లాభపడ్డాయి. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో బీఎస్​ఈ సెన్సెక్స్​ 786 పాయింట్లు పెరిగి 60,746 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ50.. 225 పాయింట్లు వృద్ధిచెంది 18,012 వద్ద ముగిసింది. బ్యాంక్​ నిఫ్టీ సూచీ 317 పాయింట్ల లాభంతో 41,307 మార్క్​కు చేరింది. మిడ్​ క్యాప్​ సూచీ లాభలు చూడగా.. స్మాల్​ క్యాప్​ సూచీ మాత్రం నష్టాల్లో ముగిసింది.

ట్రెండింగ్ వార్తలు

స్టాక్​ మార్కెట్​ నిపుణులు ప్రకారం.. నిఫ్టీ షార్ట్​ టర్మ్​ ట్రెండ్​ బుల్లిష్​గా ఉంది. అయితే నిఫ్టీకి 18,096 వద్ద రెసిస్టెన్స్​ ఉంది. ఆ లెవల్​ దాటితే.. 18,350 వరకు కూడా నిఫ్టీ పెరగొచ్చు. అయితే.. సమీప భవిష్యత్తులో ప్రాఫిట్​ బుకింగ్​తో సూచీలు కాస్త నష్టాలను కూడా చూసే అవకాశం ఉంది. నిఫ్టీకి 17,899- 17,723 లెవల్స్​ వద్ద సపోర్టు ఉంది. ఇది హోల్డ్​ చేయడం ఎంతో కీలకం.

భారతీ ఎయిర్​టెల్​ క్యూ2 త్రైమాసిక ఫలితాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఈ నెల 2న అమెరికా ఫెడ్​ సమావేశం, 3న ఆర్​బీఐ భేటీ ఉంది. వీటిపై మదుపర్లు దృష్టి సారించారు. ఈ ఈవెంట్స్​ అయ్యేంతవరకు మదుపర్లు కాస్త అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంది.

Nifty short term trend : "టెక్నికల్స్​ పరంగా నిఫ్టీ అప్​ట్రెండ్​లోనే కనిపిస్తోంది. ఏదైనా రివర్సల్​ కనిపించే వరకు.. ట్రేడర్లు ఈ అప్​ట్రెండ్​తో లబ్ధిపొందవచ్చు," అని 5పైసా.కామ్​ లీడ్​ రీసెర్చ్​ రుచిత్​ జైన్​ వెల్లడించారు.

ఎస్​జీఎక్స్​ నిఫ్టీ..

దేశీయ సూచీలు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాలతో మొదలుపెట్టే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ.. దాదాపు 100 పాయింట్ల లాభంలో ఉండటమే ఇందుకు కారణం.

టాటా స్టీల్​ క్యూ2 త్రైమాసిక ఫలితాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

స్టాక్స్​ టు బై..

Stocks to buy : అశోక్​ లేల్యాండ్​:- బై రూ. 153, స్టాప్​ లాస్​ రూ. 148, టార్గెట్​ రూ. 160

రిలయన్స్​ ఇండస్ట్రీస్​:- బై రూ. 2550, స్టాప్​ లాస్​ రూ. 2500, టార్గెట్​ రూ. 2625

దీపక్​ నైట్రేట్​:- బై రూ. 2314, స్టాప్​ లాస్​ రూ. 2250, టార్గెట్​ రూ. 2430

టాటా కమ్యూనికేషన్స్​:- బై రూ. 1259, స్టాప్​ లాస్​ రూ. 1238, టార్గెట్​ రూ. 1300

జేకే టైర్:- బై రూ. 174, స్టాప్​ లాస్​ రూ. 171, టార్గెట్​ రూ. 185

(గమనిక:- ఇవి కేవలం నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం