Bharti Airtel Q2 results: క్యూ2లో 89శాతం పెరిగిన ఎయిర్​టెల్​ లాభాలు!-bharti airtel q2 results profit up 89 percent arpu rises to rs 190 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Bharti Airtel Q2 Results: Profit Up 89 Percent Arpu Rises To <Span Class='webrupee'>₹</span>190

Bharti Airtel Q2 results: క్యూ2లో 89శాతం పెరిగిన ఎయిర్​టెల్​ లాభాలు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Oct 31, 2022 04:52 PM IST

Bharti Airtel Q2 results: భారతీ ఎయిర్​టెల్​ కాన్సాలిడేటెడ్​ నెట్​ ప్రాఫిట్​ 89శాతం వృద్ధిచెందింది. ఈ మేరకు క్యూ2 ఫలితాలను సంస్థ సోమవారం ప్రకటించింది.

క్యూ2లో 89శాతం పెరిగిన ఎయిర్​టెల్​ లాభాలు!
క్యూ2లో 89శాతం పెరిగిన ఎయిర్​టెల్​ లాభాలు! (Bloomberg)

Bharti Airtel Q2 results : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్​టెల్​.. ఈ ఆర్థిక ఏడాది క్యూ2 ఫలితాలను సోమవారం వెల్లడించింది. సంస్థ కన్సాలిడేటెడ్​ నెట్​ ప్రాఫిట్​ 89శాతం వృద్ధి చెంది.. రూ. 2,145కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో దీని విలువ రూ. 1,134కోట్లుగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

ఆపరేషన్స్​ నుంచి ఎయిర్​టెల్​ సాధించిన ఆదాయం 21.9శాతం పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయం రూ. 28,326కోట్లుగా ఉండగా.. ఈసారి రూ. 34,527గా నమోదైంది.

ఇయర్​ ఆన్​ ఇయర్​లో ఎయిర్​టెల్​ నెట్​ ప్రాఫిట్​ 75-110శాతం మధ్యలో వృద్ధిచెందుతుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. ఆదాయం 20శాతం పెరుగుతుందని నిపుణులు అంచనా వేశారు.

Airtel q2 results 2022 : ఇక ఎయిర్​టెల్​ ఆర్పూ(యావరేజ్​ రెవెన్యూ పర్​ యూజర్​) రూ. 190కి పెరిగింది. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో ఆర్పూ వాల్యూ రూ. 183గా ఉండేది. టెలికాం సంస్థలకు ఆర్పూ చాలా కీలకం. ఈ విషయంలో ఎప్పటికప్పుడు వృద్ధి సాధిస్తుండటం.. ఎయిర్​టెల్​కు సానుకూలం అని విశ్లేషకులు అంటున్నారు.

ఎయిర్​టెల్​ కన్సాలిడేటెడ్​ ఎబిట్​.. 6.7శాతం వృద్ధిచెంది రూ. 17,721కోట్లకు చేరింది. గత త్రైమాసికంతో పోల్చుకుంటే.. ఆపరేటింగ్​ మార్జిన్​ 50.6శాతం నుంచి​ 51.3శాతానికి పెరిగింది.

"మరో త్రైమాసికంలో మా ఆదాయాన్ని పెంచుకున్నాము. మార్జిన్లను మెరుగుపరుచుకున్నాము. గత త్రైమాసికంతో పోల్చుకుంటే.. ఈసారి కన్సాలిడేటెడ్​ రెవెన్యూ 5.3శాతం పెరిగంది. ఎబిట్​డా మార్జిన్​ 51.3శాతానికి చేరింది. మా పోర్ట్​ఫోలియో శక్తివంతంగా ఉండటంతోనే ఇలాంటి ఫలితాలను డెలివరీ చేస్తున్నాము," అని ఎయిర్​టెల్​ ఇండియా, సౌతేషియా సీఈఓ గోపాల్​ విట్టల్​ తెలిపారు.

Airtel share price : సోమవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సమయానికి బీఎస్​ఈ సెన్సెక్స్​లో ఎయిర్​టెల్​ షేర్​ ప్రైజ్​ రూ. 832 వద్ద స్థిరపడింది. సోమవారం ఈ స్టాక్​ 1.85శాతం పెరిగింది. గత ఐదు ట్రేడింగ్​ సెషన్స్​లో ఎయిర్​ షేరు ధర 3.26శాతం మేర వృద్ధి చెందింది. ఇక ఈ ఏడాదిలో ఎయిర్​టెల్​ షేరు విలువ ఇప్పటివరకు 20.35శాతం పెరిగింది.

ఎయిర్​టెల్​ 5జీ..

టెలికాం కంపెనీల మధ్య ఇప్పుడు 5జీ వార్​ మొదలైంది. ఇందుకు ఎయిర్​టెల్​ పూర్తిగా సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే.. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్​, సిలిగురి, నాగ్​పూర్​, వారణాసి ప్రాంతాల్లో 5జీని లాంచ్​ చేసింది. 4జీ ప్లాన్​లకు తగ్గట్టుగానే 5జీ సేవలను పొందవచ్చు అని ఎయిర్​టెల్​ చెప్పింది. ఎయిర్​టెల్​ 5జీ ప్లస్​ సేవలు.. ప్రస్తుతానికి యాపిల్​, శాంసంగ్​, షావోమీ, వివో, ఒప్పో, రియల్​మీ, వన్​ప్లెస్​ ఫోన్​లలో అందుబాటులో ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం