Multibagger EV battery stocks : నేటి ఈ 'ఈవీ బ్యాటరీ' స్టాక్స్.. రేపటి మల్టీబ్యాగర్స్!
Multibagger EV battery stocks : దేశంలో ఈవీ సెగ్మెంట్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈవీ బ్యాటరీ సంస్థలు ఫోకస్‌లోకి వచ్చాయి. కింద చెప్పిన 5 ఈవీ బ్యాటరీ స్టాక్స్.. భవిష్యత్తులో మల్టీబ్యాగర్స్‌గా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Multibagger EV battery stocks : భారత్‌లో ఇప్పుడిప్పుడే ఈవీ రంగానికి డిమాండ్ పెరుగుతోంది. దిగ్గజ ఆటో సంస్థలన్నీ ఈవీ కార్లను తయారు చేసేందుకు పోటీపడుతున్నాయి. ఇండియాలో ఈవీ సెక్టార్‌కు మంచి అవకాశాలు ఉంటాయని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. ఇక స్టాక్ మార్కెట్ మదుపర్లు కూడా ఈవీ థీమ్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈవీ కార్లు తయారు చేస్తున్న ఆటో సంస్థలపై దృష్టిసారిస్తున్నారు. అయితే.. ఈ వాహనాల్లో 'ఈవీ బ్యాటరీలు' చాలా కీలకంగా ఉంటాయి. మరి ఈవీ కార్లకు డిమాండ్ పెరుగుతుంటే.. ఈ బ్యాటరీలకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కదా! ఈ నేపథ్యంలోనే.. ఈవీ బ్యాటరీలను ఉత్పత్తు చేస్తూ, భవిష్యత్తులో మల్టీబ్యాగర్ రిటర్నులు ఇచ్చే అవకాశాలు ఉన్న కొన్ని సంస్థల గురించి ఇప్పుడు తెలుసుకుందాము..
ఎక్సైడ్ ఇండస్ట్రీస్..
బ్యాటరీ రంగంలో 75ఏళ్లుగా మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది ఈ సంస్థ. దేశంలో అతిపెద్ద లెడ్ బ్యాటరీ మేన్యుఫ్యాక్చరర్గా గుర్తింపు తెచ్చుకుంది. పరిశ్రమలు, ఆటో రంగానికి వివిధ ఉత్పత్తులను అందిస్తుంది.
Exide stock price : టాటా మోటార్స్, మారుతీ, బజాజ్ ఆటో వంటి దిగ్గజ ఆటో సంస్థలు ఎక్సైడ్కు కస్టమర్లుగా ఉండటం విశేషం. ఫలితంగా ఆటోమోటివ్ వాల్యూ చెయిన్ ఈ సంస్థకు బలంగా ఉంది.
ఎగుమతుల్లో కూడా ఎక్సైడ్ దూసుకెళుతోంది. జీసీసీ దేశాలు, అమెరికా, కెనడాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది ఈ సంస్థ. 2022 మార్చ్‌తో ముగిసిన ఆర్థిక ఏడాద గణాంకల ప్రకారం.. ఈ సంస్థ ఆదాయంలో 9శాతం వాటా ఎగుమతులదే.
ఇక ఇప్పుడు ఈవీ రంగంలోనూ ఎక్సైడ్ దూసుకెళుతోంది. హై క్వాలిటీ ఎనర్జీ స్టోరేజ్ సెల్యూషన్స్ ఇచ్చే అంతర్జాతీయ దిగ్గజ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకుంది. లిథియం- ఐఏయాన్ బ్యాటరీలు ఉత్పత్తి చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇక దిగ్గజ ఆటో సంస్థలన్నీ కస్టమర్లుగా ఉండటంతో ఈవీ సెగ్మెంట్లో ఎక్సైడ్కు కలిసి వస్తుంది.
అయితే.. ఈ సంస్థ సేల్స్, నెట్ ప్రాఫిట్ పెద్దగా వృద్ధిచెందలేదు. 4ఏళ్ల సీఏజీఆర్ 0.5, 0.1శాతంగా ఉన్నాయి.
అమర రాజా బ్యాటరీస్..
దేశంలో లెడ్ బ్యాటరీ ఉత్పత్తులు చేస్తున్న రెండో అతిపెద్ద సంస్థ అమర రాజా బ్యాటరీస్. ఆటోమోటివ్ నుంచి పరిశ్రమల వరకు.. అమరాన్ బ్రాండ్‌తో లెడ్ బ్యాటరీలను సప్లై చేస్తుంది ఈ సంస్థ.
Amara Raja stock price : ఈవీ సెగ్మెంట్‌తో లబ్ధిపొందేందుకు అమర రాజా కూడా ప్రణాళికలు రచించింది. లిథియం- ఐయాన్ బ్యాటరీలను అభివృద్ధి చేసేందుకు.. ఓ టెక్నాలజీ హబ్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసింది.
సంస్థ సేల్స్ 4ఏళ్ల సీఏజీఆర్ 10.3శాతం పెరిగింది. నెట్ ప్రాఫిట్.. 4ఏళ్ల సీఏజీఆర్ 1.2శాతం వృద్ధి చెందింది.
కాబ్రా ఎక్స్ట్రూషియాన్టెక్నిక్..
ప్లాస్టిక్ ఎక్స్‌ట్రూషన్ మెషినరీని తయారు చేయడంలో ఈ సంస్థ మార్కెట్ లీడర్‌గా కొనసాగుతంద. ఆస్ట్రాల్ పాలిటెక్నిక్, సుప్రీం ఇండస్ట్రీస్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు కస్టమర్లుగా ఉన్నాయి.
Kabra Extrusiontechnik : బాట్రిక్స్ బ్రాండ్ పేరుతో ఈ సంస్థకు ఈవీ బ్యాటరీ బిజినెస్ కూడా ఉంది. అడ్వాన్స్డ్ లిథియం- ఐయాన్ బ్యాటరీని ఈ సంస్థ తయారు చేస్తుంది. అయితే.. ఇది కొత్త విభాగం, ఇంకా లాభాల్లోకి రాలేదు.
కంపెనీ ఆదాయం 4ఏళ్ల సీఏజీఆర్ 11.5శాతంగా ఉంది. నెట్ ప్రాఫిట్.. 4ఏళ్ల సీఏజీఆర్10.8శాతం వృద్ధిచెందింది.
మారుతీ..
మారుతీ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. కాగా.. ఈ ఆటో సంస్థ ఇప్పుడు ఈవీ బ్యాటరీల ఉత్పత్తి రంగంలోకి కూడా ప్రవేశిస్తోంది. గుజరాత్లో 73బిలియన్లతో ఓ ప్లాంట్‌ను నిర్మిస్తోంది.
మారుతీ మాతృసంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్.. గుజరాత్ ప్రభుత్వంతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలోన గుజరాత్లో ఈవీలు, ఈవీ బ్యాటరీలను ఉత్పత్తి చేసేందుకు సన్నద్ధమవుతోంది.
మారుతీ సేల్స్ 4ఏళ్ల సీఏజీఆర్ 3.3శాతంగా ఉంది. నెట్ ప్రాఫిట్ మాత్రం 16.7శాతం తగ్గింది.
భారత్ ఎలక్ట్రానిక్స్..
BEL stock price : ప్రభుత్వ ఆధారిత భారత్ ఎలక్ట్రానిక్స్ సంస్థ.. రక్షణశాఖ కింద పనిచేస్తుంది. ఎయిరోస్పెస్, డిఫెన్స్ పరికరాలను ఇది తయారు చేస్తుంది. అయితే.. ఈవీ బ్యాటరీ ఉత్పత్తి రంగంలోకి అడుగుపెట్టనున్నట్టు ఇటీవలే ప్రకటించిది భారత్ ఎలక్ట్రానిక్స్.
అమెరికాలోని ట్రిటాన్ ఎలక్ట్రిక్ వెహికిల్ నుంచి భారత్ ఎలక్ట్రానిక్స్‌కు లెటర్ ఆఫ్ ఇంటెంట్ అందింది. 80బిలియన్ వాల్యూ ఉన్న ఈవీ బ్యాటరీల సప్లై గురించి ఇందులో ఉంది. పుణెలోని పరిశ్రమలో తయారు చేస్తారు.
ఈ ఒక్క ఆర్డర్‌తో.. సంస్థ ఆదాయం 30-40శాతం పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి.
భారత్ ఎలక్ట్రానిక్స్ ఆదాయం 4ఏళ్ల సీఏజీఆర్ 10.5శాతం వృద్ధిచెందింది. లాఫాలు 13.7శాతం పెరిగాయి.
ప్రస్తుతం.. ఈవీ సెగ్మెంట్లో ఇండియా ప్రారంభ దశలోనే ఉంది. అందువల్ల ఈవీ సెగ్మెంట్, ఈవీ బ్యాటరీలో మంచి అవకాశాలు ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
(గమనిక: ఇవి కేవలం నిపుణులు అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్‌లో పెట్టుబడి పెట్టే ముందు మీ ఫైనాన్షియల్ ఎడ్వైజర్‌ను సంప్రదించడం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం