Aadi Sai Kumar Birthday: జియో సైంటిస్ట్‌గా ఆది సాయి కుమార్.. తెలుగులో సరికొత్త పాయింట్‌తో హారర్ థ్రిల్లర్-aadi sai kumar horror thriller movie shambhala first look poster released on his birthday special ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aadi Sai Kumar Birthday: జియో సైంటిస్ట్‌గా ఆది సాయి కుమార్.. తెలుగులో సరికొత్త పాయింట్‌తో హారర్ థ్రిల్లర్

Aadi Sai Kumar Birthday: జియో సైంటిస్ట్‌గా ఆది సాయి కుమార్.. తెలుగులో సరికొత్త పాయింట్‌తో హారర్ థ్రిల్లర్

Sanjiv Kumar HT Telugu
Dec 24, 2024 11:11 AM IST

Aadi Sai Kumar Birthday Shambhala First Look Release: సరికొత్త పాయింట్‌తో తెలుగులో వస్తున్న సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ శంభాల. ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పోస్టర్‌ను ఆయన పుట్టినరోజు (డిసెంబర్ 23) సందర్భంగా విడుదల చేశారు. ఈ పోస్టర్ ఆసక్తిరేకెత్తించేలా ఉంది.

జియో సైంటిస్ట్‌గా ఆది సాయి కుమార్.. తెలుగులో సరికొత్త పాయింట్‌తో హారర్ థ్రిల్లర్
జియో సైంటిస్ట్‌గా ఆది సాయి కుమార్.. తెలుగులో సరికొత్త పాయింట్‌తో హారర్ థ్రిల్లర్

Shambhala First Look Release On Aadi Sai Kumar Birthday: వర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ ప్రస్తుతం డిఫరెంట్ కథా చిత్రాలను చేస్తున్నారు. ప్రస్తుతం మేకర్లు అంతా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఆ నూతన ప్రపంచంలోకి ఆడియెన్స్‌ను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

yearly horoscope entry point

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి

కాల్పనిక ప్రపంచంలో జరిగే అద్భుతమైన ఘట్టాల్ని చూసి ఆడియెన్స్ థ్రిల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ‘శంభాల’ చిత్రాన్ని యంగ్ హీరో ఆది సాయి కుమార్ చేస్తున్నారు. 'ఏ' యాడ్ ఇన్‌ఫినిటిమ్ ఫేమ్ డైరెక్టర్ యుగంధర్ ముని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో

షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి ఖర్చులకు ఎక్కడా రాజీ పడకుండా భారీ ఎత్తున శంభాల చిత్రాన్ని నిర్మించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 23న ఆది సాయి కుమార్ పుట్టినరోజు సందర్భంగా శంభాల ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

భారీ యాక్షన్ ఎపిసోడ్

శంభాల పోస్టర్‌లో ఆది సాయి కుమార్ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నట్టుగా కనిపిస్తోంది. సైకిల్ మీద హీరో మంటల్లోంచి రావడం, ఆకాశం ఎరుపెక్కి కనిపించడం చూస్తుంటే.. ఏదో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేసినట్టుగా అనిపిస్తుంది. దీంతో ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

హీరోయిన్‌గా అర్చన అయ్యర్

శంభాల చిత్రంలో ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటించనున్నారు. సూర్య 45వ చిత్రంలో భాగమైన శ్వాసిక కీలక పాత్ర పోషిస్తుండగా.. రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఎవరు టచ్ చేయని పాయింట్‌తో

ఇండియన్ స్క్రీన్ మీద ఇదివరకెన్నడూ టచ్ చేయని పాయింట్, కథతో ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్‌లో శిక్షణ పొందిన యుగంధర్ ముని హాలీవుడ్ స్థాయి నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకుని హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో శంభాల చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట.

హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్‌తో

ముఖ్యంగా విజువల్స్, సాంకేతికత అత్యున్నత స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రానికి భారతీయ సంగీత విద్వాంసుడు శ్రీరామ్ మద్దూరి సంగీతాన్ని అందించనున్నారు. డ్యూన్, ఇన్‌సెప్షన్, బ్యాట్ మాన్, డంకిర్క్ వంటి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన హన్స్ జిమ్మర్ వంటి ప్రముఖ హాలీవుడ్ స్వరకర్తలతో శ్రీరామ్ మద్దూరి కలిసి పని చేశారు.

సరికొత్త మార్క్ క్రియేట్ చేసేలా

దాంతో నేపథ్య సంగీతంలోనూ శ్రీరామ్ మద్దూరి కొత్త మార్క్ క్రియేట్ చేసే అవకాశం ఉందని మేకర్స్ ఆశిస్తున్నారు. త్వరలో శంభాల సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్‌ను చిత్రయూనిట్ వెల్లడించనుంది.

Whats_app_banner