Egg Pickle: కోడిగుడ్డు నిల్వ పచ్చడి ఇలా చేశారంటే నెల రోజులు తాజాగా ఉంటుంది, రుచి అద్భుతంగా ఉండడం ఖాయం-egg pickle recipe in telugu know how to make this kodiguddu nilva pachadi ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Egg Pickle: కోడిగుడ్డు నిల్వ పచ్చడి ఇలా చేశారంటే నెల రోజులు తాజాగా ఉంటుంది, రుచి అద్భుతంగా ఉండడం ఖాయం

Egg Pickle: కోడిగుడ్డు నిల్వ పచ్చడి ఇలా చేశారంటే నెల రోజులు తాజాగా ఉంటుంది, రుచి అద్భుతంగా ఉండడం ఖాయం

Haritha Chappa HT Telugu
Dec 24, 2024 11:30 AM IST

Egg Pickle: చికెన్, మటన్, చేప నిల్వ పచ్చళ్ల గురించి వినే ఉంటారు. ఓసారి ఎగ్ పచ్చడి కూడా చేసేయండి. కోడి గుడ్డు నిల్వ పచ్చడి రెసిపీ చాలా సులువు.

ఎగ్ పికెల్
ఎగ్ పికెల్ ( CrazySpicy Food/Youtube)

కోడిగుడ్డుతో చేసే ఏ వంటలైనా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తెలుగువారికి నిల్వ పచ్చళ్ళు అంటే ఎంతో ఇష్టం. అలాంటివారు కోడి గుడ్డుతో కూడా నిల్వ పచ్చడి చేసేందుకు ప్రయత్నించండి. చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి ఎంత రుచిగా ఉంటాయో కోడి గుడ్డు నిల్వ పచ్చడి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. పైగా దీన్ని ఒక్కసారి చేసుకుంటే నెల రోజులకు పైగా నిల్వ ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు.

yearly horoscope entry point

కోడిగుడ్డు నిల్వ పచ్చడికి కావలసిన పదార్థాలు

కోడిగుడ్లు - ఏడు

మిరియాల పొడి - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నీళ్లు - సరిపడినన్ని

నూనె - ఒక కప్పు

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

మెంతి పొడి - పావు స్పూను

ఆవాల పొడి - రెండు స్పూన్లు

గరం మసాలా - ఒక స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

పసుపు - అర స్పూను

కారం - మూడు స్పూన్లు

కరివేపాకులు - గుప్పెడు

నిమ్మరసం - అరకప్పు

కోడిగుడ్డు నిల్వ పచ్చడి రెసిపీ

1. స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నీళ్లు పోయాలి.

2. ఒక గిన్నెలో కోడిగుడ్లను పగలగొట్టి అందులోనే మిరియాల పొడి, ఒక స్పూను ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి.

3. కుక్కర్లో చిన్న స్టాండ్ పెట్టి దాని మీద ఆ గిన్నె పెట్టాలి.

4. పైన మూత పెట్టి పావుగంటసేపు ఉడికించాలి.

5. కుక్కర్ ఆవిరి పోయాక మూత తీసి గట్టిపడిన ఎగ్ మిశ్రమాన్ని మీకు కావాల్సిన సైజులో ముక్కలుగా కోసుకోవాలి. వాటిని ఒక పక్కన పెట్టుకోవాలి.

6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ఒక కప్పు ఆయిల్ వేయాలి.

7. ఆ వేడెక్కిన నూనెలో అల్లం వెల్లుల్లి పేస్టు, మెంతిపొడి, ఆవపొడి గరం మసాలా, ధనియాల పొడి, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి.

8. అందులోనే గుప్పెడు కరివేపాకులు, కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి.

9. ఇప్పుడు మరొక కళాయిని స్టవ్ మీద పెట్టి మూడు స్పూన్ల నూనె వేయాలి.

10. ఆ నూనెలో కోడిగుడ్డు ముక్కలను వేసి చిన్న మంట మీద వేయించాలి.

11. అవి రంగు మారేవరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.

12. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం మిశ్రమంలో ఈ కోడి గుడ్డు ముక్కలను వేసి బాగా కలపాలి.

13. వేడి బాగా తగ్గాక నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకోవాలి.

14. ఇది చల్లగా అయ్యాక గాలి చొరబడని కంటైనర్ లో వేసి ఈ కోడి గుడ్డు నిల్వ పచ్చడి ఉంచుకోవాలి.

15. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకుని చూడండి మీకు కచ్చితంగా నచ్చుతుంది.

16. చికెన్, మటన్ పచ్చడి ఇష్టపడేవారు ఈ కోడిగుడ్డు పచ్చడిని కూడా బాగా ఇష్టపడతారు. పైగా దీన్ని మనం ఉడికించి చేసాం కాబట్టి త్వరగా పాడవదు. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ ఈ వంటివి పుష్కలంగా ఉంటాయి. అలాగే ప్రోటీన్ కూడా నిండుగా ఉంటుంది. అప్పుడప్పుడు వేడివేడి అన్నంలో ఈ కోడి గుడ్డు నిల్వ పచ్చడిని వేసుకొని కలుపుకొని తిని చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది. స్పైసీగా కావాలనుకుంటే కారాన్ని పెంచుకోవచ్చు. పిల్లలకు పెట్టాలనుకుంటే కారం తగ్గించండి. నిమ్మరసం వేసాం కాబట్టి నెల రోజులు పాటు ఇది పాడవకుండా తాజాగా ఉంటుంది. ఒక్కసారి మీరు దీన్ని చేసుకొని తింటే కచ్చితంగా అభిమానులు అయిపోతారు. అంత రుచిగా ఉంటుంది ఈ కోడిగుడ్డు నిల్వ పచ్చడి రెసిపీ.

Whats_app_banner

సంబంధిత కథనం