Egg curry: కొబ్బరిపాలతో కోడిగుడ్డు కూర, బిర్యానీకి జతగా అదిరిపోతుంది, రెసిపీ తెలుసుకోండి-egg curry with coconut milk is a great accompaniment to biryani know the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Egg Curry: కొబ్బరిపాలతో కోడిగుడ్డు కూర, బిర్యానీకి జతగా అదిరిపోతుంది, రెసిపీ తెలుసుకోండి

Egg curry: కొబ్బరిపాలతో కోడిగుడ్డు కూర, బిర్యానీకి జతగా అదిరిపోతుంది, రెసిపీ తెలుసుకోండి

Haritha Chappa HT Telugu
Sep 12, 2024 05:30 PM IST

Egg curry: కోడిగుడ్డు వంటకాలకు అభిమానులు ఎక్కువ. ఇక్కడ మేము కొబ్బరిపాలతో కోడిగుడ్డు కూర ఎలా వండాలో ఇచ్చాము. దీని రుచి అదిరిపోతుంది. బిర్యానీ రైస్ కు జతగా తింటే టేస్ట్ మరిచిపోలేరు. ఎలా వండాలో తెలుసుకోండి.

కొబ్బరిపాలతో కోడిగుడ్డు కూర
కొబ్బరిపాలతో కోడిగుడ్డు కూర (Foodandwine.com)

Egg curry: కోడిగుడ్డుతో చేసే వంటకాలు అంటే మీకు ఇష్టమా? మీకోసమే ఇక్కడ కొబ్బరిపాలతో గుడ్డు కూర ఎలా వండాలో ఇచ్చాము. ఇది చాలా రుచిగా ఉంటుంది. బిర్యానీ రైస్ వండుకొని ఈ కొబ్బరి పాలతో వండిన కోడిగుడ్డు కూర జతగా చేసుకుని తినండి. ఇది నోరూరి పోయేలా ఉంటుంది. చేయడం కూడా చాలా సులువు. రెసిపీ ఇక్కడ ఇచ్చాము. దీన్ని ఫాలో అయిపోండి

కొబ్బరిపాలతో కోడిగుడ్డు కూర రెసిపీకి కావలసిన పదార్థాలు

ఉడకబెట్టిన గుడ్లు - నాలుగు

కొబ్బరి పాలు - అరకప్పు

నూనె - ఒక స్పూను

ఆవాలు - అర స్పూన్

చింతపండు - నిమ్మకాయ సైజులో

ఉల్లిపాయలు - రెండు

పచ్చిమిర్చి - రెండు

అల్లం వెల్లుల్లి పేస్టు - అర స్పూను

టమాటోలు - రెండు

పసుపు - అర స్పూను

కారం - ఒక స్పూను

మిరియాల పొడి - అర స్పూను

ధనియాల పొడి - అర స్పూను

గరం మసాలా - అరస్పూను

పసుపు - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

కొబ్బరి పాలతో కోడి గుడ్డు కూర రెసిపీ

1. కోడిగుడ్లను ముందుగానే ఉడికించి రెండు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు చింతపండును నీటిలో వేసి నానబెట్టుకోవాలి.

3. తాజా కొబ్బరి ముక్కలను బ్లెండర్లో వేసి నీళ్లు పోసి పాలు తీసి పెట్టుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

5. ఆ నూనెలో ఆవాలు వేసి వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయించుకోవాలి.

6. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా వేయించాలి.

7. తర్వాత టమోటాలను సన్నగా తరిగి అవి కూడా వేసి ఉడికించుకోవాలి.

8. టమాటాలు మెత్తగా అయ్యాక పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

9. తర్వాత కారం, మిరియాల పొడి, ధనియాలపొడి వేసి బాగా కలుపుకోవాలి.

10. ముందుగా నానబెట్టుకున్న చింతపండును పిండి ఆ రసాన్ని కూడా వేసి ఉడికించుకోవాలి.

11. ఇదంతా చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి.

12. ఆ తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను వేసి ఉడికించుకోవాలి.

13. చివర్లో గుప్పెడు కరివేపాకులను, గరం మసాలాను వేసి మూత పెట్టి చిన్న మంట మీద పది నిమిషాలు ఉడికించాలి.

14. తర్వాత స్టవ్ కట్టేయాలి. అంతే టేస్టీ కొబ్బరి పాలతో కోడి గుడ్డు కూర రెడీ అయినట్టే. ఇది వండుతున్నప్పుడే నోరూరిపోతుంది.

ఇంట్లో బిర్యానీ రైస్ వండుకున్నప్పుడు దానికి జతగా కొబ్బరి పాలతో కోడిగుడ్డు కూర వండుకొని చూడండి. ఆ బిర్యానీ రైస్ లో ఇగురును కలిపి తింటే రుచి అదిరిపోతుంది. కొబ్బరి పాలు మంచి క్రీమీ టేస్ట్ ను ఇస్తాయి. పైగా దీనిలో పోషకాలు కూడా ఎక్కువ. కొబ్బరిపాలు, కోడిగుడ్డు రెండిట్లోనూ మన శరీరానికి అవసరమైన న్యూట్రియంట్స్ ఉంటాయి. కాబట్టి ఈ రెసిపీని ఒకసారి వండుకొని చూడండి. ఆరోగ్యపరంగా, రుచి పరంగా కూడా ఇది బెస్ట్ కర్రీ అని చెప్పుకోవచ్చు.