Milk and Joint pains: కీళ్ల నొప్పులు ఉన్నవారు ప్రతిరోజు పాలు తాగవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి
Milk and Joint pains: కీళ్ల నొప్పులతో బాధపడేవారు పాలు తాగడం విషయంలో సందేహిస్తారు. పాలు తాగవచ్చా లేదా అనే అనుమానం వారిలో తలెత్తుతుంది. ఆర్థరైటిస్ ఉన్నవారు పాలు తాగవచ్చో లేదో వైద్యులకు వివరిస్తున్నారు.
Milk and Joint pains: ఆర్థరైటిస్‌తో బాధపడే వారిలో ఎక్కువగా కనిపించే లక్షణం కీళ్ల నొప్పులు. వీరు నిలుచున్నా, కూర్చున్నా కూడా కీళ్ల నొప్పులు విపరీతంగా భావిస్తాయి. కీళ్ల నొప్పులు అనేవి తీవ్రమైన వ్యాధి కిందకే చెప్పుకోవాలి. ఈ వ్యాధి రోజువారీ పనులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుంది. కీళ్లలో మంట, నొప్పి అధికంగా వస్తాయి.
ఆర్ధరైటిస్ ఏ వయసులోనైనా రావచ్చు. ఇది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి. జన్యుపరమైన కారణాల వల్ల ఇది కలుగుతుంది. ఈ ఆర్థరైటిస్ రోగులు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థరైటిస్ రోగుల్లో విపరీతంగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు పాలు తాగవచ్చా? లేదా? అనే సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు. దీనికి డైటీషియన్లు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.
నిల్వ చేసిన ఆహారం వద్దు
కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలి. వారు తాజాగా వండిన ఆహారాన్ని తినాలి. నిల్వ చేసిన ఆహారాన్ని తినడం మంచిది కాదు. అలాగే కొంతమంది పాలు తాగడం మంచిది కాదని భావిస్తారు, మరి కొందరు తాగవచ్చని చెబుతారు. అయితే ఈ అంశంపై ఇంతవరకూ ఎలాంటి పరిశోధనా జరగలేదు. పాలను తాగకూడదు అని చెప్పేవారు... అది యూరిక్ యాసిడ్‌ను పెంచడానికి సహకరిస్తుందని, అందుకే తాగకూడదని అంటారు. ఇక కొంతమంది పాలల్లో కాల్షియం ఉంటుందని ఇది ఎముకలను బలపరుస్తుందని అందుకే తాగాలని చెబుతారు.
ఆర్థరైటిస్ ఉంటే పాలు తాగవచ్చా?
అర్థరైటిస్‌లో రెండు రకాలు ఉన్నాయి. అవి ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థటైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడే వారిలో ఎముకల మధ్య ఉండే మృదులాస్తి క్రమంగా తగ్గిపోతుంది. దీనివల్ల తీవ్రంగా నొప్పి వస్తుంది. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడే వారిలో రోగనిరోధక వ్యవస్థ ఎముకలపై దాడి చేస్తుంది. దీనివల్ల నొప్పి విపరీతంగా కలుగుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్ రోగులు పాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉండే క్యాల్షియం, విటమిన్ డి ఎముకలను బలోపేతం చేస్తాయి. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడే రోగులు మాత్రం పాలు తీసుకోకపోవడమే మంచిది. వారిలో ఇన్ఫ్లమేషన్ పెరిగే అవకాశం ఉంది.
పాలకు ప్రత్యామ్నాయం
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడేవారు సాధారణ పాలకు బదులుగా సోయా పాలు, బాదంపాలు, కొబ్బరిపాలు వంటివి తాగడం ఉత్తమం. ఈ పాలల్లో కూడా కాల్షియం, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా మారుస్తాయి.
సాధారణ వ్యక్తులకు మాత్రం పాలు తాగడం ఎంతో మేలు చేస్తుంది. పాలల్లో క్యాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి, రిబోఫ్లావిన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా మార్చడానికి ఎంతో అవసరం. ఆర్థరైటిస్ రోగులకు ఎముక ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎముకల బలహీనతను తగ్గించాలంటే కాల్షియం మెరుగ్గా అందాలి. పాలను తాగకపోతే ఆ ఆర్థరైటిస్ రోగులు ఇతర పదార్థాల ద్వారా కాల్షియాన్ని పొందాల్సిన అవసరం ఉంది. పాలకు ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటి ద్వారా కాల్షియాన్ని శరీరానికి అందించాలి.
కాల్షియం కోసం ఏం తినాలి?
కేవలం పాలల్లోనే కాదు టోఫు, బాదం, క్యారెట్, కాయధాన్యాలు, నువ్వులు, బ్రోకలీ, ఆకుకూరలు, సోయాబీన్స్, పాలకూర, బెండకాయ వంటివి తినడం అలవాటు చేసుకోవాలి. వీటిలో కూడా కాల్షియం అధికంగానే ఉంటుంది.
టాపిక్