Mahakumbh 2025: నాగ సాధువులు ఎవరు, వారి జీవితం, లక్ష్యం గురించి తెలుసా? కుంభమేళాలో నాగ సాధువులు అసలు ఏం చేస్తారంటే..
Mahakumbh 2025: కుంభమేళను ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరుపుతూ ఉంటారు. ఈసారి కుంభమేళా 13 జనవరి 2025 తో మొదలవుతుంది. పాపాలు తొలగిపోతాయి. ఎంతో పుణ్యం వస్తుంది. కుంభమేళాలో నాగ సాధువుల్ని కూడా చూస్తూ ఉంటాము. అయితే నాగ సాధువులు జీవితం గురించి, వాళ్ళ జీవన విధానం గురించి కొన్ని విషయాలు చూసేద్దాం.
కుంభమేళకి ఎంత ప్రాముఖ్యత ఉన్న విషయం మనకు తెలుసు. దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది కుంభమేళకి వస్తూ ఉంటారు. అయితే, నాగ సాధువుల గురించి మీరు వినే ఉంటారు. అసలు నాగ సాధువులు ఎవరు? నాగ సాధువులకి సంబంధించి చాలా విషయాలు తెలుసుకోవాలి.
ఈరోజు నాగ సాధువుల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు, ఆసక్తికరమైన విషయాలు చూద్దాం. వీళ్ళు చూడడానికి చాలా విభిన్నంగా కనపడతారు. అలాగే వీళ్ళ జీవన విధానం, జీవితం కూడా విచిత్రంగా ఉంటుంది. మరి ఆ విషయాలని ఇప్పుడే తెలుసుకుందాం.
కుంభమేళను ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరుపుతూ ఉంటారు. ఈసారి కుంభమేళా 13 జనవరి 2025 తో మొదలవుతుంది. ఇక్కడ పవిత్ర నదిలో స్నానం చేసినట్లయితే, ఎంతో పుణ్యం వస్తుంది. పాపాలు తొలగిపోతాయి. ఎంతో పుణ్యం వస్తుంది. కుంభమేళాలో నాగ సాధువుల్ని కూడా చూస్తూ ఉంటాము. అయితే నాగ సాధువులు జీవితం గురించి, వాళ్ళ జీవన విధానం గురించి కొన్ని విషయాలు చూసేద్దాం.
నాగసాధువులు పద్ధతులు
ఒళ్లంతా బూడిదతో నాగసాధువులు విభిన్నంగా కనబడతారు. వాళ్ళని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అసలు నాగ సాధువులు ఎవరు? నాగ సాధువులు సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు. వీళ్లను అఖండా అని అంటారు. వీళ్ళు ఏ విధమైన దుస్తులు వేసుకోరు. నగ్నంగా ఉంటారు. బట్టలు లేకుండా ఉండడం వారు ప్రాపంచిక అనుబంధాలని జయించారని ప్రతీక. తపస్సు, ధ్యానం, మోక్షసాధనకు వారి జీవితాన్ని అంకితం చేస్తారు.
కుంభమేళలో కనిపించే నాగ సాధువులు
వీళ్ళు మతపరమైన సంస్థల్లో భాగమైన అకాడలో నివసిస్తున్నారని తెలుపుతారు. తపస్సు, ధ్యానానికి వారి జీవితం అంకితం చేయబడుతుంది. రోజంతా ధ్యానంలో గడుపుతారు. రోజూ ధ్యానం చేస్తూ ఉంటారు. నాగ సాధువులు భౌతిక వస్తువులను విడిచిపెట్టి సాధారణ జీవితాన్ని గడుపుతారు. కేవలం సహజమైన వస్తువుల్ని మాత్రమే వీళ్ళు ఉపయోగిస్తారు.
వారి లక్ష్యం ఏంటి?
వారు ఎప్పుడూ కూడా వారి సాధనలో మునిగిపోతారు. సామాజిక దూరాన్ని పాటిస్తారు. వారి యొక్క ఏకైక లక్ష్యం ఏంటంటే ఆత్మసాక్షాత్కారం, మోక్షాన్ని పొందడం.
కుంభమేళాలో నాగ సాధువు యొక్క ప్రాముఖ్యత
కుంభమేళలో నాగసాధువులు గంగా స్నానం చేయడానికి వస్తారు. అలాగే ధ్యానం కూడా చేస్తారు.
కుంభమేళాకు వచ్చి మతపరమైన విధులని నిర్వహిస్తారు, ప్రపంచంలోనే అతిపెద్ద జాతరలో నాగసాధువులు తపస్సు, ధ్యానం యొక్క విశిష్టతను ప్రదర్శిస్తారు.
గంగా, యమునా, సరస్వతి సంగమంలో స్నానం చేయడం ద్వారా నాగసాధువులు ధ్యానాన్ని మరింత శక్తివంతం చేస్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.