Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా జరిగే ముఖ్యమైన తేదీలివే; సాంస్కృతిక ప్రాముఖ్యత, ఇతర వివరాలు..-maha kumbh mela 2025 know dates location historical significance and more ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా జరిగే ముఖ్యమైన తేదీలివే; సాంస్కృతిక ప్రాముఖ్యత, ఇతర వివరాలు..

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా జరిగే ముఖ్యమైన తేదీలివే; సాంస్కృతిక ప్రాముఖ్యత, ఇతర వివరాలు..

Sudarshan V HT Telugu
Nov 30, 2024 05:39 PM IST

Maha Kumbh Mela 2025: ప్రధాన హిందూ పండుగ అయిన మహా కుంభమేళా 2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్ రాజ్ లో జరుగుతుంది. భారతీయ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇది అతి పెద్దది. ప్రపంచంలోనే అత్యధిక మంది హాజరయ్యే కార్యక్రమం ఇది. కుంభమేళా సమయంలో పవిత్ర నదులలో పవిత్ర స్నానానికి మిలియన్ల మంది వస్తుంటారు.

 ప్రయాగ రాజ్ లో మహా కుంభమేళా
ప్రయాగ రాజ్ లో మహా కుంభమేళా (Nitin Sharma)

Maha Kumbh Mela 2025: ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవాల్లో ఒకటైన మహా కుంభమేళా 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరగనుంది. ఈ ప్రధాన హిందూ కార్యక్రమం సందర్భంగా లక్షలాది భక్తులు పవిత్ర గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేయడానికి వస్తుంటారు.

ప్రాముఖ్యత

కుంభమేళా భారతీయ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అతి పెద్దది. కుంభమేళా సందర్భంగా పవిత్ర నదుల్లో స్నానం చేయడం ముక్తి, మోక్ష మార్గమని చాలా మంది భక్తులు విశ్వసిస్తారు. కుంభమేళాలో పవిత్ర స్నానంతో మనస్సు, ఆత్మ శుద్ధి అవుతుందని నమ్ముతారు.

చారిత్రక ప్రాముఖ్యత

హిందూ పురాణాల ప్రకారం.. దేవతలు, రాక్షసులు క్షీర సాగర మథనం చేస్తున్నప్పుడు అమృతం వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని కుంభమేళాను జరుపుతారు. పురాణ కథ ప్రకారం, పాల సముద్రాన్ని మథిస్తున్న సమయంలో, అమృతం ఉన్న కుండ (కుంభం) వస్తుంది. ఆ అమృతాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం దేవతలు, రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగింది, ఫలితంగా, ఆ కుండలో నుంచి అమృతపు చుక్కలు భూమిపై నాలుగు ప్రదేశాలలో పడ్డాయి. ఆ ప్రదేశాలు ప్రయాగ్ రాజ్ (అలహాబాద్), హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. అందువల్ల ఈ నాలుగు ప్రదేశాలను పవిత్రంగా భావించి, ఆయా ప్రదేశాల్లో కుంభమేళా నిర్వహిస్తారు.

చెడుపై మంచి సాధించిన విజయం

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ పండుగ. పాపాలు తొలగిపోయి ఆధ్యాత్మిక పుణ్యం లభిస్తుందని నమ్మి భక్తులు ఈ ప్రాంతాల్లోని పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించే సమయం ఇది. మహా కుంభమేళాకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇవి..

మహా కుంభమేళా 2025

జనవరి 13, 2025: పౌష్ పూర్ణిమ

జనవరి 14, 2025: మకర సంక్రాంతి (మొదటి షాహి స్నాన్)

జనవరి 29, 2025: మౌని అమావాస్య (రెండవ షాహి స్నాన్)

ఫిబ్రవరి 3, 2025: బసంత్ పంచమి (మూడవ షాహి స్నాన్)

ఫిబ్రవరి 4, 2025: అచ్ల సప్తమి

ఫిబ్రవరి 12, 2025: మాఘి పౌర్ణమి

ఫిబ్రవరి 26, 2025: మహా శివరాత్రి

పవిత్ర స్నానాలే ముఖ్యం

కుంభమేళాలో అత్యంత ముఖ్యమైన అంశం నిర్దేశిత ప్రదేశాల్లో (ప్రయాగ్ రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని) పవిత్ర నదుల్లో స్నానం చేయడం. మేళా సమయంలో పవిత్ర జలాల్లో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, ఆధ్యాత్మిక పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. స్నాన తేదీలు షాహీ స్నాన్ (రాజ స్నానాలు) అని పిలువబడే శుభకరమైన జ్యోతిష సమయాల ద్వారా నిర్ణయించబడతాయి, వీటిని మిలియన్ల మంది ప్రజలు ఆచరిస్తారు.

సాంస్కృతిక కార్యక్రమాలు

కుంభమేళా సమయంలో నది ఒడ్డున భక్తులు వివిధ ప్రార్థనలు, ఆచారాలు, హవన్ (అగ్ని వేడుకలు) నిర్వహిస్తారు. పవిత్ర నదులను గౌరవించడానికి సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో హారతి (భక్తి గీతాలు) ఆలపిస్తారు. కుంభమేళాలో మతపరమైన ఆచారాలతో పాటు, సాంప్రదాయ సంగీతం, నృత్యం, నాటకంతో సహా సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయి. స్థానిక హస్తకళలు, ఆహారం, ధార్మిక సామగ్రిని విక్రయించే స్టాళ్లను ఏర్పాటు చేసి, భక్తి గీతాల శబ్దాలతో, ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమైన యాత్రికుల దృశ్యాలతో వాతావరణం మొత్తం ఉత్సాహభరితంగా ఉంటుంది.

Whats_app_banner