Maha Kumbh 2025: మహా కుంభంలో అఖారా అంటే ఏమిటో తెలుసా, దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోండి
మహాకుంభంలో అఖారా ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. అఖారా అనే పదం వింటే కొత్తగా ఉందా..? అఖారా అంటే సాధువులు, ఋషుల సమూహం. మహాకుంభంలో వివిధ అఖారాలకు చెందిన సాధువులు పవిత్ర నదిలో స్నానం చేస్తారు. ఈ అఖారాలను మత తత్వానికి, సాధనకు చిహ్నంగా పరిగణిస్తారు. శంకరాచార్యులు సాధువుల కోసం వీళ్ళను సృష్టించారట.
హిందూమతంలో మహా కుంభానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. 2025లో ఉత్తర్ ప్రదేశ్ లో ప్రయాగరాజ్ లోని మహాకుంభను నిర్వహిస్తున్నారు. మహాకుంభానికి మతపరమైన ప్రాముఖ్యత ఎంతో ఉంది. మహా కుంభంలో స్నానం చేయడం వలన పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. జనవరి 13 సోమవారం నుంచి మహా కుంభం మొదలవుతుంది.
బుధవారం ఫిబ్రవరి 26 మహాశివరాత్రితో ఇది ముగుస్తుంది. ఈ మహా కుంభానికి దేశం నలుమూలల నుంచి సాధువులు వస్తారు. వీరిలో అఖారాకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అఖారా అంటే ఏంటి..? అఖారాకు గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మహా కుంభలో అఖారా ప్రాధాన్యత:
మహాకుంభంలో అఖారా ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. అఖారా అనే పదం వింటే కొత్తగా ఉందా..? అఖారా అంటే సాధువులు, ఋషుల సమూహం. మహాకుంభంలో వివిధ అఖారాలకు చెందిన సాధువులు పవిత్ర నదిలో స్నానం చేస్తారు. ఈ అఖారాలను మత తత్వానికి, సాధనకు చిహ్నంగా పరిగణిస్తారు. శంకరాచార్యులు సాధువుల కోసం వీళ్ళను సృష్టించారట. వీళ్ళ లక్ష్యమేంటంటే హిందూ మతాన్ని రక్షించడం. ఈ సంస్థలను అఖారాలని అంటారు.
ఎన్ని సంస్థలు ఉన్నాయంటే?
దేశవ్యాప్తంగా 13 అఖారాల సంస్థలు ఉన్నాయట. ఉదాసీ, శైవ, వైష్ణవలకు చెందినవి ఇవి. శైవ శాఖలకు చెందిన సన్యాసులకు చెందినవి ఏడు, మూడు బైరాగి, వైష్ణవ శాఖకు చెందినవి. ఇంకో మూడు ఉదాసీ వర్గానికి చెందినవి.
మహాకుంభలో రాజ స్నానం ఎప్పుడు?
- మహాకుంభ సమయంలో పవిత్ర నదిలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. అందుకనే చాలా మంది కుంభమేళాకు వెళ్లారు. అలాంటప్పుడు షాహీ స్నానం కింది తేదీలతో నిర్వహించబడుతుంది.
2. జనవరి 14న మకర సంక్రాంతి నాడు మొదటి రాజా స్నానం జరుగుతుంది.
3. మౌని అమావాస్య జనవరి 29న ఇంకో రాజా స్నానం.
4. షాహి స్నానం వసంత పంచమి నాడు ఉంటుంది. ఫిబ్రవరి మూడున వసంత పంచమి వచ్చింది.
5. మాఘ పౌర్ణమ ఫిబ్రవరి 12 మరో రాజా స్నానం వచ్చింది.
6. చివర రాజు స్నానం మహాశివరాత్రి నాడు జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 26న వచ్చింది. మహా కుంభం మహాశివరాత్రితో ముగుస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం