Jasprit Bumrah: బుమ్రాపై ఆరోపణలు.. సీనియర్ కామెంటేటర్ అక్కసు.. ఎందుకు ప్రశ్నించడం లేదంటూ ట్వీట్
Jasprit Bumrah: భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రాపై మరోసారి ఆరోపణలు వచ్చాయి. అతడి బౌలింగ్ యాక్షన్‍ను ఎందుకు నిశితంగా పరిశీలించడం లేదంటూ ఆస్ట్రేలియాకు చెందిన ఓ కామెంటేటర్ అభిప్రాయపడ్డారు. ఇది సరికాదంటూ ట్వీట్ చేశారు.
భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ అన్ని ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేస్తూనే ఉన్నారు. వేగం, స్వింగ్, కచ్చితత్వంతో అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‍లో అత్యుతమ ఫాస్ట్ బౌలర్ అంటూ ప్రశంసలు పొందుతున్నాయి. బుమ్రా బౌలింగ్ యాక్షన్‍పై అప్పుడప్పుడూ ఆరోపణలు వినిపిస్తుంటాయి. తాజాగా అలాంటి ఆరోపణే మళ్లీ వచ్చింది. బుమ్రా బౌలింగ్ అనుమాస్పదంగా ఉందనేలా ఆస్ట్రేలియా సీనియర్ స్పోర్ట్స్ కామెంటేర్ ఇయాన్ మౌరిస్ అభిప్రాయపడ్డారు. మరిన్ని కామెంట్లతో ట్వీట్ చేశారు.ఆ వివరాలు ఇక్కడ చూడండి.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‍లో బుమ్రా అదరగొడుతున్నారు. మూడు టెస్టుల్లో 21 వికెట్లతో సత్తాచాటారు. బుమ్రా బౌలింగ్‍లో ఆడేందుకు ఆసీస్ ఆటగాళ్లు తంటాలు పడుతున్నారు. మూడో టెస్టులో తొమ్మిది వికెట్లను బుమ్రా దక్కించుకున్నాడు. ఈ తరుణంలో ఇయాన్ మౌరిన్ తాజాగా ఆరోపణలు చేశారు. బుమ్రాపై అక్కసు వెళ్లగక్కారు.
ఎందుకు ప్రశ్నించడం లేదు
బుమ్రా బౌలింగ్ తీరును విశ్లేషించాలని కామెంటేటర్ ఇయాన్ మౌరిస్ అన్నారు. “భారత పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా బంతి వేసే విధానాన్ని ఎవరు ఎందుకు ప్రశ్నించడం లేదు? ప్రస్తుత రోజుల్లో ఇది పొలిటికల్‍గా సరికాదు? అతడు బంతి త్రో చేస్తున్నాడని నేను అనడం లేదు. బంతి వదిలే సమయంలో అతడి పొజిషన్ గురించి విశ్లేషించాలని అంటున్నా” అని ట్వీట్ చేశారు. మైక్రోస్కోప్‍లో పరిశీలించినట్టు బుమ్రా బౌలింగ్‍ను విశ్లేషించాలని అభిప్రాయపడ్డారు.
అందుకు భయపడుతున్నారా..
జాత్యహంకార ఆరోపణలు వస్తాయని క్రికెట్ శక్తులు.. భారత పేసర్ బుమ్రా బౌలింగ్‍ను విశ్లేషించేందుకు భయపడుతున్నాయా అనేలా మౌరిస్ చెప్పారు. తన ఆరోపణపై మరింత వివరణ ఇచ్చారు. బుమ్రాను ఆరోపించినందుకు తనపై విమర్శల దాడి జరుగుతుందని భావించిన.. మౌరిస్ తాను రాసినది సరిగా చదవాలని పేర్కొన్నారు. బుమ్రా త్రో చేస్తున్నారని తాను అనడం లేదని, యాక్షన్‍ను విశ్లేషించాలని అంటున్నానంటూ మరో ట్వీట్‍లో పేర్కొన్నారు.
బుమ్రా యాక్షన్ సరైనదేనన్న చాపెల్
అయితే, బుమ్రా బౌలింగ్ యాక్షన్ సరిగా ఉందని గతంలో కొందరు మాజీ క్రికెటర్లు కూడా చెప్పారు. మాజీ ఆసీస్ స్టార్ గ్రెగ్ చాపెల్ ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. బుమ్రా బౌలింగ్‍పై వస్తున్న ప్రశ్నలను కొట్టి పారేశారు. బుమ్రా యాక్షన్ చాలా ప్రత్యేకమైనదని, ఈ విషయంలో అర్థంలేని అనుమానాలు వ్యక్తం చేయడం ఆపాలని చెప్పారు. అతడు చాంపియన్ పర్ఫార్ అంటూ ప్రశంసించారు.
ఇంగ్లండ్ మాజీ ప్లేయర్, బౌలింగ్ కోచ్‍గా పాపులర్ అయిన ఇయాన్ పోంట్ కూడా గతంలో బుమ్రాకు సపోర్ట్ చేశారు. బుమ్రా బౌలింగ్ యాక్షన్ సరైనదేనని, ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. ఐసీసీ నిబంధనలకు తగ్గట్టుగానే బుమ్రా బౌలింగ్ యాక్షన్ ఉందని విశ్లేషించారు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. మూడు టెస్టుల్లో ఇరు జట్లు చెరొకటి గెలిచారు. మూడోది డ్రా అయింది. అత్యంత కీలకమైన నాలుగో టెస్టు మెల్‍బోర్న్ వేదికగా డిసెంబర్ 26వ తేదీన జరగనుంది. ఈ మ్యాచ్‍లో గెలిచి సిరీస్‍లో ఆధిక్యంలోకి వెళ్లాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.