Allu Arjun : ముగిసిన అల్లు అర్జున్ విచారణ, మూడున్నర గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు-sandhya theatre stampede case chikkadpally police allu arjun investigation completed ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Allu Arjun : ముగిసిన అల్లు అర్జున్ విచారణ, మూడున్నర గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు

Allu Arjun : ముగిసిన అల్లు అర్జున్ విచారణ, మూడున్నర గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు

Bandaru Satyaprasad HT Telugu
Dec 24, 2024 04:04 PM IST

Allu Arjun : తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. సుమారు 3.30 గంటల పాటు అల్లు అర్జున్ ను పోలీసులు విచారించారు. విచారణ ముగిసిన అనంతరం అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్లిపోయారు.

ముగిసిన అల్లు అర్జున్ విచారణ, మూడున్నర గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు
ముగిసిన అల్లు అర్జున్ విచారణ, మూడున్నర గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు

Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ ముగిసింది. సుమారు 3.30 గంటల పాటు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను విచారించారు. తన తండ్రి అల్లు అర్జున్, న్యాయవాదితో కలిసి మంగళవారం ఉదయం 11.05 గంటలకు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. వీరిలో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు. ఏసీపీ రమేశ్, ఇన్ స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ అల్లు అర్జున్ ను విచారించారు. తొక్కిసలాట ఘటనపై ఇటీవల సీపీ సీవీ ఆనంద్ 10 నిమిషాల వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ఆధారంగా అల్లు అర్జున్ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం అల్లు అర్జున్ తన నివాసానికి వెళ్లిపోయారు.

yearly horoscope entry point

ఈ విచారణలో అల్లు అర్జున్ కు పోలీసులు పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. అవసరమైతే మరోసారి విచారణకు హాజరుకావాలని కోరినట్లు తెలుస్తోంది.

విచారణకు అందుబాటలో ఉండాలని పోలీసులు అల్లు అర్జున్ కు తెలిపారు. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని పోలీసులు కోర్టును కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

అల్లు అర్జున్ ను అడిగిన ప్రశ్నలు ఇవేనా?

1.పుష్ప -2 స్పెషల్ షో సదంర్భంగా సంధ్య థియేటర్‌కు రావడానికి ఎవరి అనుమతి తీసుకున్నారు?

2.పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు?

3.సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు సమాచారం ఇచ్చారా? లేదా?

4.తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్లో ఉన్నప్పుడు తెలిసిందా తెలియదా?

5.మీడియా ముందు.. మీకు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు?

6.రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా?

7.అనుమతి లేకుండా రోడ్ షో ఏవిధంగా నిర్వహించారు?

8.మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు సినిమా థియేటర్‌కు వచ్చారు?

9.మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు?

10.ఎంత మంది బౌన్సర్లను మీరు నియమించుకున్నారు?

11.ప్రేక్షకుల మీద, పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్ల వివరాలు చెప్పండి.. అని పోలీసులు ప్రశ్నలు అడిగినట్టు సమాచారం.

అల్లు అర్జున్ ను ఈ ప్రశ్నలు అడిగారని పలు మీడియా ఛానల్స్ ప్రసారం చేస్తున్నాయి.

ఈ నెల 4న పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్‌ వద్దకు అల్లు అర్జున్‌ కుటుంబంతో సహా వెళ్లారు. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ్‌ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైయ్యాడు. పోలీసులు అనుమతి నిరాకరించినా రోడ్ షో చేసుకుండా థియేటర్ కు వచ్చి ఒకరి మృతికి కారణమయ్యారనే అభియోగంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్‌ను ఏ11గా చేర్చారు. ఈ కేసులో అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు. ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం