Dry Fruit Cake: క్రిస్మీస్ రోజున డ్రైఫ్రూట్ కేక్‌తో మీ ప్రియమైన వారి నోరు తీపి చెయ్యండి.. తయారు చేయడం కూడా సులువే!
Dry Fruit Cake: క్రిస్మస్ పార్టీకి ఇంటికి వచ్చిన అతిథుల నోటిని తియ్యగా చేయడానికి ఈ డ్రై ఫ్రూట్ కేక్ తయారు చేయండి. ఈ క్రిస్మస్ కేక్ రెసిపీ తినడానికి చాలా రుచికరంగా ఉండటమే కాకుండా తయారు చేయడం కూడా చాలా సులభం. దాన్ని రుచి చూసిన వారెవ్వరైనా మళ్లీ మళ్లీ తినాలని అడుగుతారు.
డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగను ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకుంటారు. క్రిస్మస్ ను క్రైస్తవ మతస్థుల అతిపెద్ద పండుగగా భావిస్తారు. ప్రభువైన యేసు ఈ రోజున జన్మించాడని నమ్ముతారు. ఈ రోజున ఇంటిని దీపాలతో అలంకరించడం, చర్చికి వెళ్లడం, ఒకరికొకరు డిన్నర్ పార్టీ చేసుకోవడం ద్వారా ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. మీరు కూడా మీ ఇంట్లో క్రిస్మస్ రోజున డిన్నర్ పార్టీకి అతిథులను ఆహ్వానించినట్లయితేే వారికి రుచికరమైన తీపి వంటకాన్ని తయారు చేయాలనుకుంటే, ఈ డ్రై ఫ్రూట్ కేక్ రెసిపీ మీకు ఉపయోగపడతాయి. ఈ డ్రై ఫ్రూట్ కేక్ తయారు చేయడం చాలా సులభం మాత్రమే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
డ్రై ఫ్రూట్ కేక్ తయారీకి కావలసిన పదార్థాలు
- 1/2 కప్పు పెరుగు
- 1/4 కప్పు పాలు
- 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్
- 1/2 టీస్పూన్ బేకింగ్ సోడా
- 2 టేబుల్ స్పూన్ల పాల పొడి
- 4-5 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్
- 1 టీస్పూన్ వెనిల్లా ఎసెన్స్
- 2 టీస్పూన్ బాదం ముక్కలు
- 2 టీస్పూన్ల ఇతర డ్రై ఫ్రూట్స్
- 1/2 కప్పు నెయ్యి
- 1/2 కప్పు పంచదార పొడి
- 1 చిటికెడు ఉప్పు
డ్రైఫ్రూట్ తయారీ విధానం:
- డ్రై ఫ్రూట్ కేక్ తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో పిండి, బేకింగ్ పౌడర్, మిల్క్ పౌడర్, బేకింగ్ సోడా జల్లెడ పట్టండి.
- దీని తరువాత చిటికెడు ఉప్పు వేసి అన్నింటినీ బాగా కలపాలి.
- ఇప్పుడు మరో గిన్నెలో పెరుగు, పంచదార పొడి, నెయ్యి వేసి అన్నీ బాగా కలపాలి.
- ఇప్పుడు దాంట్లోకి ముందుగా తయారు చేసుకున్న పిండి మిశ్రమాన్ని కొద్దిగా వేసి కలపాలి.
- పిండిలో పాలు పోసి చిక్కటి పేస్టులా తయారు చేసుకోవాలి.
- ఇప్పుడు ఈ మిశ్రమానికి వెనీలా ఎసెన్స్ వేసి ముద్దలు లేకుండా బాగా కలపాలి.
- పేస్ట్ బాగా తయారైన తర్వాత అందులో సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ కలపాలి. డ్రై ఫ్రూట్స్ ముందుగానే నెయ్యిలో వేయించుకుంటే మరింత రుచికరంగా ఉంటాయి.
- ఇప్పుడు కేక్ ప్యాన్ తీసుకుని దాని అంతటా నెయ్యి పూసి ఉంచాలి.
- అందులో మనం తయారు చేసుకున్న కేక్ మిశ్రమాన్ని వేసి పైన బాదం ముక్కలు, ఇతర నచ్చిన డ్రైఫ్రూట్స్ వేసి స్ప్రెడ్ చేయాలి.
- ఇప్పుడు దీన్ని 180 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్రీహీట్ చేసిన ఓవెన్ లో కేక్ ప్యాన్ ను పెట్టి అరగంట పాటు బేక్ చేయాలి.
- నిర్ణీత సమయం తర్వాత కేక్ ను ఓవెన్ నుంచి తొలగించాలి.
- మీ టేస్టీ డ్రై ఫ్రూట్ కేక్ రెడీ. చల్లారిన తర్వాత తీసుకుని తినేయడమే.
సంబంధిత కథనం