Christmas Wishes: మీ బంధువులకు, స్నేహితులకు ఈ క్రిస్మస్ సందేశాలతో తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి-wish your relatives and friends with these christmas messages and wishes in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Christmas Wishes: మీ బంధువులకు, స్నేహితులకు ఈ క్రిస్మస్ సందేశాలతో తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి

Christmas Wishes: మీ బంధువులకు, స్నేహితులకు ఈ క్రిస్మస్ సందేశాలతో తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి

Haritha Chappa HT Telugu
Dec 24, 2024 03:00 PM IST

Christmas Wishes: యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా డిసెంబర్ 25న క్రిస్మస్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. ఈ ప్రత్యేక సందర్భంలో, మీరు మీ స్నేహితులను, బంధువులను ఈ క్రిస్ మస్ శుభాకాంక్షలతో విష్ చేయండి.

క్రిస్మస్ విషెస్
క్రిస్మస్ విషెస్

క్రిస్మస్ పండుగ వచ్చిందంటే ప్రపంచమంతా సందడిగా మారిపోతుంది. డిసెంబర్ 25న క్రిస్మస్ డేను అంగరంగా వైభవంగా నిర్వహించుకుంటారు. నిజానికి ఇది క్రైస్తవ మతానికి సంబంధించిన పండుగే అయినా అందరూ దీన్ని వైభవంగా చేసుకుంటారు. ఈ రోజున అన్ని మతాల వారు తమ క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతారు. ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున మీ ప్రియమైనవారిని విష్ చేయడానికి ఇక్కడ కొన్ని క్రిస్మస్ శుభాకాంక్షలు ఇచ్చాము. వీటిలో మీకు నచ్చిన విషెస్ ఎంపిక చేసుకుని స్నేహితులకు పంపించండి.

yearly horoscope entry point

క్రిస్మస్ శుభాకాంక్షలు

  1. మీ కోరిక ఏదీ అసంపూర్ణంగా మిగిలిపోకూడదు,

ఏ కల నెరవేరకుండా ఆగిపోకూడదు,

ఈ క్రిస్మస్ మీకు చాలా ఆనందాన్ని ఇవ్వాలని,

మీ హృదయంలోని ప్రతి కల నెరవేరాలని కోరుకుంటూ

మీకు మీ కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు

2. క్రిస్మస్ వేళ మీ జీవితంలో వెలుగు రావాలి,

దేవుడు మీ పట్ల దయ చూపాలి,

మిమ్మల్ని ఎల్లవేళలా ఆ జీసెస్ కాపాడాలని కోరుకుంటూ

మెర్రీ క్రిస్మస్

3. క్రిస్మస్ అంటే ప్రేమ,

క్రిస్మస్ అంటే ఆనందం

క్రిస్మస్ అంటే ఉత్సాహం

క్రిస్మస్ కొత్త ఉత్సాహం

మెర్రీ క్రిస్మస్

మీ కుటుంబసభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

4. మెరిసే నక్షత్రాలతో

ఆకాశంలో నీలి మేఘాలతో

క్రిస్మస్ ను వేడుకగా నిర్వహించుకోండి.

హ్యాపీ క్రిస్మస్

5. ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రేమ నిండాలని,

ప్రతిరోజూ సంతోషాల పండుగను తీసుకురావాలని,

మీరు అన్ని బాధలను మరచిపోవాలని కోరుకుంటూ

మనమందరం క్రిస్మస్ కు స్వాగతం పలుకుదాం.

హ్యాపీ క్రిస్మస్ టు ఆల్

6. ఏంజెల్ వచ్చి మీ ఆశలన్నీ నెరవేర్చాలని,

పవిత్రమైన క్రిస్మస్ రోజున,

మీరు ఆనందంతో బహుమతులు పొందాలని కోరుకుంటున్నాను.

నేను క్రిస్మస్ రోజున గ్రీటింగ్ కార్డు లేదా పువ్వులను పంపడం లేదు,

నా హృదయపూర్వకమైన ఈ మెసేజును పంపుతున్నాను

మెర్రీ క్రిస్మస్ మై డియర్.

7. ఈ క్రిస్మస్...

మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని

మీ ఇంట ఆనందపు కాంతులు

వెదజల్లాలని కోరుకుంటూ

మీకు మీ కుటుంబ సభ్యులకు

క్రిస్మస్ శుభాకాంక్షలు

8. మీ కలలు ఏమైనప్పటికీ

కోరికలు ఏమైనా..

ఈ క్రిస్మస్ సందర్భంగా వాటిని నిజం చేసుకోవాలని కోరుకుంటూ

మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

9. క్రిస్మస్‌కు శాంతా తాత వస్తాడు

మనకు నచ్చే గిఫ్టులు తెస్తాడు

శాంతి, స్నేహానికి ప్రతీక అతడు

అందరిలో ఆనందం నింపుతాడు

మంచి మనసుతో మెప్పిస్తాడు

మీకు మీ కుటుంబసభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

10. ప్రతి ఇల్లు, ప్రతి గుండె

ఆనందంతో నిండాలని

ఆ జీసెస్ కరుణా కటాక్షములు

మీకు పై కురవాలని ఆశిస్తూ

మీకు మీ కుటుంబసభ్యులకు

క్రిస్మస్ శుభాకాంక్షలు

11. ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం

ప్రతి జీవితానికి కావాలని పర్వదినం

మనమంతా ఆ దేవుడి బిడ్డలం

ప్రపంచ శాంతికి కలిసుండాలి మనమందరం

మీకు మీ కుటుంబసభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

Whats_app_banner

సంబంధిత కథనం