Manu Bhaker: మను బాకర్‌ను క్రికెటర్‌ను చేయాల్సింది.. అప్పుడు అవార్డులన్నీ ఆమెకే వచ్చేవి: ఖేల్ రత్న వివాదంపై మను తండ్రి-olympics medalist manu bhaker and her father upset with khel ratna list snub ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Manu Bhaker: మను బాకర్‌ను క్రికెటర్‌ను చేయాల్సింది.. అప్పుడు అవార్డులన్నీ ఆమెకే వచ్చేవి: ఖేల్ రత్న వివాదంపై మను తండ్రి

Manu Bhaker: మను బాకర్‌ను క్రికెటర్‌ను చేయాల్సింది.. అప్పుడు అవార్డులన్నీ ఆమెకే వచ్చేవి: ఖేల్ రత్న వివాదంపై మను తండ్రి

Hari Prasad S HT Telugu
Dec 24, 2024 03:42 PM IST

Manu Bhaker: ఒలింపిక్స్ మెడలిస్ట్ మను బాకర్ పేరు అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న జాబితాలో లేకపోవడంపై ఆమెతోపాటు ఆమె తండ్రి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమెను షూటర్ కాకుండా క్రికెటర్ ను చేయాల్సిందని మను తండ్రి రామ్ కిషన్ అనడం గమనార్హం.

మను బాకర్‌ను క్రికెటర్‌ను చేయాల్సింది.. అప్పుడు అవార్డులన్నీ ఆమెకే వచ్చేవి: ఖేల్ రత్న వివాదంపై మను తండ్రి
మను బాకర్‌ను క్రికెటర్‌ను చేయాల్సింది.. అప్పుడు అవార్డులన్నీ ఆమెకే వచ్చేవి: ఖేల్ రత్న వివాదంపై మను తండ్రి (PTI)

Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్ లో రెండు బ్రాంజ్ మెడల్స్ గెలిచి చరిత్ర సృష్టించిన షూటర్ మను బాకర్ పేరును కేంద్ర ఖేల్ రత్న అవార్డు కోసం పరిశీలించలేదన్న వివాదంపై ఆమె తండ్రి రామ్ కిషన్ స్పందించారు. మను బాకర్ ను క్రికెటర్ ను చేసి ఉంటే అవార్డులు దక్కేవేమో అని ఆయన అనడం గమనార్హం. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన ఆయన.. మనును షూటర్ ను చేసినందుకు తాను చింతిస్తున్నానని అన్నారు. ఈ అవార్డు అందుకోవడానికి ఆమె ఇంకా ఏం చేయాల్సి ఉండేదని ఆయన ప్రశ్నించారు.

yearly horoscope entry point

మనుని క్రికెటర్ చేయాల్సింది

మను బాకర్ పేరు ఖేల్ రత్న అవార్డు కోసం రూపొందించిన జాబితాలో లేదన్న వార్తల నేపథ్యంలో ఆమె తండ్రి రామ్ కిషన్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. "ఆమెను షూటింగ్ కు ప్రోత్సహించినందుకు చింతిస్తున్నాను. ఆమెను క్రికెటర్ చేయాల్సింది.

అప్పుడు అన్ని అవార్డులు, ప్రశంసలు ఆమెకు దక్కేవి. ఒకేసారి ఆమె రెండు ఒలింపిక్స్ మెడల్స్ గెలిచింది. ఇప్పటి వరకూ ఎవరూ ఆ పని చేయలేదు. ఈ దేశం కోసం ఆమె ఇంకా ఏం చేయాలి? ప్రభుత్వం ఆమె కృషిని గుర్తించాలి" అని రామ్ కిషన్ అన్నారు.

మను చాలా బాధ పడుతోంది

మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న.. దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం. ఈ ఏడాది కోసం షార్ట్ లిస్ట్ అయిన వాళ్లలో మను బాకర్ పేరు లేదని వార్తలు రావడం సంచలనం రేపింది. 12 మంది సభ్యులతో కూడిన నేషనల్ స్పోర్ట్స్ డే కమిటీ ఆమె పేరును ప్రతిపాదించలేదని సమాచారం. అయితే మను బాకర్ ఈ అవార్డు కోసం అసలు దరఖాస్తు చేసుకోలేదని క్రీడా మంత్రిత్వ శాఖ చెబుతోంది. కానీ ఆమె దరఖాస్తు చేసుకున్నా కమిటీ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని తండ్రి రామ్ కిషన్ చెప్పారు.

"తాను పోర్టల్లో అప్లై చేశానని మను చెప్పింది. ఒకవేళ అదే నిజమైతే కమిటీ ఆమె పేరును పరిశీలించి ఉంటుంది. పరిస్థితి ఏదైనా సరే ఇప్పుడు క్రీడా శాఖను ఫెడరేషన్ కలిసి ఆమె పేరును చేర్చాలే చేయాలి" అని రామ్ కిషన్ అన్నట్లు తెలిసింది. ఈ విషయంలో మను చాలా బాధపడుతోందని ఆయన అన్నారు.

"నేను మనుతో మాట్లాడాను. ఇది విని ఆమె చాలా బాధపడుతోంది. అసలు నేను ఒలింపిక్స్ కు వెళ్లాల్సింది కాదు.. దేశం కోసం మెడల్స్ తీసుకురావాల్సింది కాదు.. అసలు స్పోర్ట్స్ పర్సనే కాకండా ఉంటే బాగుండేదని ఆమె నాతో అన్నది" అని రామ్ కిషన్ వెల్లడించారు. ఖేల్ రత్న అవార్డు నామినీల్లో ఇండియన్ హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ లతోపాటు మరికొందరు ఉన్నారు.

Whats_app_banner