2025 Honda SP160 : 4.2 అంగుళాల స్క్రీన్, ఫోన్ ఛార్జింగ్, బ్లూటూత్ వంటి ఫీచర్లతో 2025 హోండా ఎస్పీ160 లాంచ్
2025 Honda SP160 : 2025 హోండా ఎస్‌పీ 160 బైక్ లాంచ్ అయింది. అద్భుతమైన ఫీచర్లతో దీనిని తీసుకొచ్చారు. అనేక అప్డేట్స్‌తో ఈ బైక్ వచ్చింది. అయితే కంపెనీ దాని ధరను కూడా పెంచింది.
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా తన పాపులర్ మోటార్ సైకిల్ 2025 హోండా ఎస్పీ160ను భారత విపణిలోకి విడుదల చేసింది. సింగిల్ డిస్క్ వేరియంట్ ధర రూ.1,21,951(ఎక్స్-షోరూమ్), డ్యూయల్ డిస్క్ వేరియంట్ ధర రూ.1,27,956 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ప్రస్తుతం ఈ బైక్ ధర రూ.3,000 నుంచి రూ.4,605 వరకు పెరిగింది. దీని స్పెషాలిటీ ఏంటో వివరంగా తెలుసుకుందాం.
2025 హోండా ఎస్పీ 160 ఫీచర్లు
2025 మోడల్‌లో మోటార్ సైకిల్ ఫ్రంట్ డిజైన్ మునుపటి కంటే పదునైన, మరింత ఆకర్షణీయంగా రూపొందించారు. కొత్త హెడ్ ల్యాంప్ విభాగం మరింత స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది. అయితే మిగతా బాడీవర్క్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. బైక్ వాలే నివేదిక ప్రకారం, ఈ మోటార్ సైకిల్ ఇప్పుడు నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. రేడియంట్ రెడ్ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ వంటి కలర్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి.
హోండా ఎస్‌పీ 160లో కొత్త ఫీచర్లను అమర్చారు. ఇందులో 4.2 అంగుళాల టీఎఫ్టీ స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ, హోండా రోడ్సింక్ యాప్ కనెక్టివిటీ ఉంటుంది. టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్, మ్యూజిక్ ప్లేబ్యాక్ వంటి ఫీచర్లను ఇందులో అందించనున్నారు. ఇది కాకుండా ఇది యూఎస్బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉంది. తద్వారా సుదూర ప్రయాణాలలో పరికరాన్ని ఛార్జ్ చేసే సమస్య ఉండదు.
హోండా ఎస్‌పీ 160.. 162.71 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. దీని పవర్ అవుట్ పుట్ గురించి చూస్తే.. ఇది 13 బీహెచ్‌పీ (మునుపటి కంటే 0.2 బిహెచ్‌పీ తక్కువ), 14.8 ఎన్ఎమ్ (మునుపటి కంటే కొంచెం ఎక్కువ) టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ధర ఎంతంటే
కొత్త ఓబీడీ2బీ నిబంధనలతో అప్ డేట్ చేసిన ఈ బైక్ ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. యూత్ కస్టమర్లు, టెక్నాలజీ అంటే ఇష్టపడేవారు దీని కొత్త అప్డేట్, స్టైలిష్ డిజైన్‌ను ఇష్టపడతారు. మీరు మోడ్రన్ ఫీచర్లు, గొప్ప మైలేజ్, గొప్ప లుక్స్‌తో కూడిన మోటార్ సైకిల్ కావాలనుకుంటే 2025 హోండా ఎస్‌పీ 160 మీకు బెటర్ ఆప్షన్. 2025 హోండా ఎస్పీ160 సింగిల్ డిస్క్ వేరియంట్ ధర రూ.1,21,951. అదే సమయంలో డ్యూయల్ డిస్క్ వేరియంట్ ధర రూ .1,27,956 వద్ద ఉంది. ఈ రెండు ధరలు ఎక్స్-షోరూమ్ అని గుర్తుపెట్టుకోండి.