క్యాలీఫ్లవర్‌లో విటమిన్ సీ, బీ6, కే, ఫోలెట్, పొటాషిం, మాగనీస్, పాస్ఫర్, ఫైబర్ సహా మరిన్ని పోషకాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. అందుకే క్యాలిఫ్లవర్‌ను నిర్లక్ష్యం చేయకూడదు.
Photo: Pexels
క్యాలిఫ్లవర్‌ను రెగ్యులర్‌గా తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. వీటిలోని విటమిన్లు, మినరల్స్ లాభాలను చేకూరుస్తాయి. క్లాలీఫ్లవర్ వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏవంటే..
Photo: Pexels
క్యాలిఫ్లవర్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‍ను తగ్గించగలవు. రక్త ప్రసరణ మెరుగువుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యానికి మంచి జరుగుతుంది.
Photo: Pexels
జీర్ణక్రియను క్యాలిఫ్లవర్ మెరుగుపరుస్తుంది. దీంట్లో ఉండే ఫైబర్ ఇందుకు తోడ్పడుతుంది.
Photo: Pexels
శరీరంలోని వ్యర్థాలు సులువుగా బయటికి వెళ్లేందుకు క్యాలిఫ్లవర్ తోడ్పడుతుంది. ఇందులోని సల్ఫర్ నైట్రేట్లు, యాంటీఆక్సిడేట్లు, గ్లూకోసినోలేట్స్ దీనికి ఉపయోగపడుతుంది.
Photo: Pexels
క్యాలిఫ్లవర్‌లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు కూడా దీన్ని తినొచ్చు. వెయిట్ లాస్‍కు సహకరిస్తుంది.
Photo: Pexels
క్యాలిఫ్లవర్‌లో కోలిన్ మెండుగా ఉంటుంది. వ్యాధికారకాలపై శరీరం పోరాడేందుకు ఇది తోడ్పడుతుంది. అవయవాల పనితీరు మెరుగుపడేందుకు కూడా సహకరిస్తుంది.
Photo: Pexels
హైబీపీ లేదా అధిక రక్తపోటుకు చలికాలంలో చెక్ పెట్టడానికి లవంగాలను వివిధ రకాలుగా తీసుకోవచ్చు