Sandhya Theater Stampede Case : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. 18 మందిపై కేసు నమోదు.. లిస్టు ఇదే
Sandhya Theater Stampede Case : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ ఘటనపై సీరియస్ ఫోకస్ పెట్టిన పోలీసులు.. 18 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ పేర్లు ఉన్నాయి. ఈ పేర్ల లిస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.
పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా.. (డిసెంబర్ 4, 2024) బుధవారం రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చారు. ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అల్లు అర్జున్, థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజర్, తదితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
లిస్టు ఇదే..
ఏ-1 ఆగమతి పెదరామిరెడ్డి.. థియేటర్ ఓనర్
ఏ-2 ఆగమతి చిన్నరామి రెడ్డి.. థియేటర్ ఓనర్
ఏ-3 ఎం. సందీప్, భాగస్వామి
ఏ-4 సుమిత్, భాగస్వామి
ఏ-5 ఆగమతి వినయ్, భాగస్వామి
ఏ-6 అశుతోష్ రెడ్డి, భాగస్వామి
ఏ-7 రేణుకాదేవి, భాగస్వామి
ఏ-8 అరుణా రెడ్డి, భాగస్వామి
ఏ-9 నాగరాజు, మేనేజర్
ఏ-10 విజయచందర్, దిగువ బాల్కనీ ఇంఛార్జి
ఏ-11 అల్లు అర్జున్, పుష్ప హీరో
ఏ-12 సంతోష్, అల్లు అర్జున్ పీఏ
ఏ-13 శరత్‌బన్ని, అల్లు అర్జున్ మేనేజర్
ఏ-14 రమేష్, భద్రతా బృందం
ఏ-15 రాజు, భద్రతా బృందం
ఏ-16 వినయ్ కుమార్, అభిమానుల సంఘం
ఏ-17 ఫర్వాజ్, బాడీగార్డ్
ఏ-18 మైత్రీ మూవీస్ నిర్మాతలు
యాజమాన్యం నిర్లక్ష్యం..
ఈ ఘటనకు కారణం సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే అని పోలీసులు భావిస్తున్నారు. అల్లు అర్జున్ వస్తాడన్న సమాచారం పోలీసులకు ఇవ్వలేదు. అదే సమయంలో.. తొక్కిసలాట జరగకుండా చూడటంలో యాజమాన్యం విఫలమైంది. అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లేందుకు అనువుగా ఏర్పాట్లు చేయలేదు. దీంతో అతన్ని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. లోపల ఉన్నవారు కూడా బయటికొచ్చేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగి రేవతి చనిపోయింది.
విచారణకు బన్నీ..
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. సుమారు రెండన్నర గంటల పాటు బన్నీని పోలీసులు ప్రశ్నించారు. 20కి పైగా ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని సమాచారం. అల్లు అర్జున్ తరపు న్యాయవాది సమక్షంలో పోలీసులు ప్రశ్నలు అడిగారు. అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు.