TG January Holidays 2025 : విద్యార్థులకు సూపర్ న్యూస్.. జనవరిలో సెలవులే సెలవులు.. ఏకంగా 11 రోజులు!-11 days of holidays for telangana schools in january 2025 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tg January Holidays 2025 : విద్యార్థులకు సూపర్ న్యూస్.. జనవరిలో సెలవులే సెలవులు.. ఏకంగా 11 రోజులు!

TG January Holidays 2025 : విద్యార్థులకు సూపర్ న్యూస్.. జనవరిలో సెలవులే సెలవులు.. ఏకంగా 11 రోజులు!

Dec 24, 2024, 04:31 PM IST Basani Shiva Kumar
Dec 24, 2024, 04:31 PM , IST

  • TG January Holidays 2025 : కొత్త సంవత్సరం విద్యార్థులకు సెలవుల కానుక ఇస్తోంది. జనవరి మాసంలో ఏకంగా 11 రోజులు సెలవులు వచ్చాయి. ఇదే నెలలో సంక్రాంతి సెలవులు కూడా ఉన్నాయి. నెల మొత్తంలో 31 రోజులు ఉండగా.. అందులో 11 రోజులు సెలవులు రావడంతో.. విద్యార్ధులు ఎగిరి గంతేస్తున్నారు.

జనవరి (2025) నెలలో విద్యార్థులు పండగ చేసుకోవచ్చు. ఈ మాసంలో సంక్రాంతి సెలవులు రానున్నాయి. మొత్తం 31 రోజులు ఉండగా.. అందులో 11 రోజులు సెలవులు వచ్చాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు వివరాలు వెల్లడించారు.

(1 / 5)

జనవరి (2025) నెలలో విద్యార్థులు పండగ చేసుకోవచ్చు. ఈ మాసంలో సంక్రాంతి సెలవులు రానున్నాయి. మొత్తం 31 రోజులు ఉండగా.. అందులో 11 రోజులు సెలవులు వచ్చాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు వివరాలు వెల్లడించారు.(istockphoto)

జనవరి 1న కొత్త సంవత్సరం సందర్బంగా సెలవు ఇచ్చారు. ఆ తర్వాత 5వ తేదీ ఆదివారం వస్తుంది. శనివారం 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ 19, 26 తేదీల్లో ఆదివారాలు వచ్చాయి. దీంతో మొత్తం 11 రోజులు సెలవులు వచ్చినట్టు అయ్యింది. 

(2 / 5)

జనవరి 1న కొత్త సంవత్సరం సందర్బంగా సెలవు ఇచ్చారు. ఆ తర్వాత 5వ తేదీ ఆదివారం వస్తుంది. శనివారం 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ 19, 26 తేదీల్లో ఆదివారాలు వచ్చాయి. దీంతో మొత్తం 11 రోజులు సెలవులు వచ్చినట్టు అయ్యింది. (istockphoto)

2025 సంవత్సరంలో సాధారణ, ఐచ్ఛిక, వేతనంతో కూడిన సెలవులపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 27 రోజులను సాధారణ సెలవులుగా ప్రకటించింది. మరో 23 రోజులను ఐచ్ఛిక సెలవులుగా తెలంగాణ సర్కారు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవులు గాక 5 ఆప్షనల్ హాలిడేస్‌ను ఉన్నతాధికారుల అనుమతితో పొందవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.

(3 / 5)

2025 సంవత్సరంలో సాధారణ, ఐచ్ఛిక, వేతనంతో కూడిన సెలవులపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 27 రోజులను సాధారణ సెలవులుగా ప్రకటించింది. మరో 23 రోజులను ఐచ్ఛిక సెలవులుగా తెలంగాణ సర్కారు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవులు గాక 5 ఆప్షనల్ హాలిడేస్‌ను ఉన్నతాధికారుల అనుమతితో పొందవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.(istockphoto)

పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, విద్యాసంస్థలు, ప్రజాపనుల శాఖలకు విడిగా ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. సాధారణ సెలవు దినాలతో పాటు ఆది, రెండో శనివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయాలని సూచించింది. జనవరి మొదటి తేదీన సెలవు ఇస్తున్నందున ఫిబ్రవరి 8వ తేదీ రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటిస్తున్నట్లు వివరించింది. సెలవు దినాల్లో ఏమైనా మార్పులుంటే అధికారికంగా ప్రకటిస్తామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.

(4 / 5)

పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, విద్యాసంస్థలు, ప్రజాపనుల శాఖలకు విడిగా ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. సాధారణ సెలవు దినాలతో పాటు ఆది, రెండో శనివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయాలని సూచించింది. జనవరి మొదటి తేదీన సెలవు ఇస్తున్నందున ఫిబ్రవరి 8వ తేదీ రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటిస్తున్నట్లు వివరించింది. సెలవు దినాల్లో ఏమైనా మార్పులుంటే అధికారికంగా ప్రకటిస్తామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.(istockphoto)

2025 ఫిబ్రవరిలో 26వ తేదీన, మార్చిలో 14, 30, 31వ తేదీల్లో సెలవులు వచ్చాయి. విద్యార్థులకు బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. మొత్తం 27 రోజుల సెలవుల్లో.. 5 పండగలు ఆదివారం వచ్చాయి. జనవరి 26 ఆదివారం, మార్చి 30 ఉగాది ఆదివారం, ఏప్రిల్ 6 శ్రీరామనవమి ఆదివారం, జులై 6 మొహరం ఆదివారం, సెప్టెంబర్ 21 బతుకమ్మ పండగ మొదటి రోజు ఆదివారం వచ్చింది. ఈ పండగలు ఇతర వారాల్లో వస్తే.. సెలవుల సంఖ్య 32 రోజులు అయ్యేది.

(5 / 5)

2025 ఫిబ్రవరిలో 26వ తేదీన, మార్చిలో 14, 30, 31వ తేదీల్లో సెలవులు వచ్చాయి. విద్యార్థులకు బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. మొత్తం 27 రోజుల సెలవుల్లో.. 5 పండగలు ఆదివారం వచ్చాయి. జనవరి 26 ఆదివారం, మార్చి 30 ఉగాది ఆదివారం, ఏప్రిల్ 6 శ్రీరామనవమి ఆదివారం, జులై 6 మొహరం ఆదివారం, సెప్టెంబర్ 21 బతుకమ్మ పండగ మొదటి రోజు ఆదివారం వచ్చింది. ఈ పండగలు ఇతర వారాల్లో వస్తే.. సెలవుల సంఖ్య 32 రోజులు అయ్యేది.(istockphoto)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు