(1 / 5)
బరువు తగ్గేందుకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాటిల్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చాలా కీలకంగా భావిస్తుంటారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని చాలా రకాలుగా చేయవచ్చు. అయితే 16/8 రూల్ ఫాలో అయ్యి, రోజుకు 16 గంటలు ఫాస్టింగ్ చేస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.
(2 / 5)
బరువు తగ్గేందుకు ఒక సింపుల్ ఈక్వేషన్ ఉంది. రోజులో శరీరానికి కావాల్సిన దానికన్నా తక్కువ కేలరీలు తీసుకోవాలి. దీని వల్ల బరువు తగ్గుతారు.
(3 / 5)
పురుషులకు రోజుకు 2,200 కేలరీలు- మహిళలకు రోజుకు 2,000 కేలరీల ఎనర్జీ అవసరం ఉంటుంది. వీటి కన్నా ఎక్కువ తిని వ్యాయామాలు చేయకపోతే బరువు పెరుగుతారు. అలా కాకుండా తక్కువ తింటే, కేలరీ డెఫిసిట్ కారణంగా మన వెయిట్‌లాస్ జర్నీ ప్రారంభమవుతుంది.
(4 / 5)
అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో ఏం జరుగుతుంది? శరీరానికి కావాల్సిన ఎనర్జీ దొరకకపోవడంతో కొవ్వుపై ఆధారపడాల్సి ఉంటుంది. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. తద్వారా బరువు తగ్గడం మొదలుపెడతారు.
(5 / 5)
అయితే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో డైట్ అనేది చాలా కీలకం. 8 గంటల విండోలో పోషకాలు, ప్రోటీన్‌తో కూడిన ఆహారం తీసుకోవడం ముఖ్యం. అప్పుడే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. కొంతకాలం సరైన డైట్ పాటించి- ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే ఎఫెక్టివ్ ఫలితాలు ఉంటాయి.
ఇతర గ్యాలరీలు