Netflix Top 7 Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది రిలీజైన టాప్ 7 వెబ్ సిరీస్ ఇవే.. ఈ లాస్ట్ వీకెండ్ బింజ్ వాచ్ చేయండి-netflix top 7 web series 2024 ic 814 mamla legal hai 3 body problem killer soup the great indian kapil show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Top 7 Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది రిలీజైన టాప్ 7 వెబ్ సిరీస్ ఇవే.. ఈ లాస్ట్ వీకెండ్ బింజ్ వాచ్ చేయండి

Netflix Top 7 Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది రిలీజైన టాప్ 7 వెబ్ సిరీస్ ఇవే.. ఈ లాస్ట్ వీకెండ్ బింజ్ వాచ్ చేయండి

Hari Prasad S HT Telugu

Netflix Top 7 Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో 2024లోనూ కొన్ని మంచి వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇంగ్లిష్, హిందీ భాషల్లో వచ్చిన ఈ సిరీస్ లలో టాప్ 7 ఏవో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ఇప్పటి వరకూ మీరు చూసి ఉండకపోతే.. ఈ ఏడాది చివరి వీకెండ్ లో బింజ్ వాచ్ చేసేయండి.

నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది రిలీజైన టాప్ 7 వెబ్ సిరీస్ ఇవే.. ఈ లాస్ట్ వీకెండ్ బింజ్ వాచ్ చేయండి (Screengrab from YouTube/Netflix India)

Netflix Top 7 Web Series: ఇండియాలోని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో నెట్‌ఫ్లిక్స్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఎన్నో క్వాలిటీ మూవీస్, వెబ్ సిరీస్ ఈ ఓటీటీ నుంచి వస్తుంటాయి. అలా 2024లోనూ ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయి. అయితే వాటిలో కచ్చితంగా చూడాల్సిన 7 వెబ్ సిరీస్ ఉన్నాయి. మరి అవి ఏంటి? వాటిలో మీరు ఎన్ని చూశారు? ఒకవేళ చూడకపోతే ఎప్పుడు చూడాలన్నది ప్లాన్ చేసుకోండి.

నెట్‌ఫ్లిక్స్ టాప్ 7 వెబ్ సిరీస్ ఇవే

ఐసీ 814: ది కాందహార్ హైజాక్

ఐసీ 814: ది కాందహార్ హైజాక్ ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ లో ఒకటి. 1999లో ఖాట్మాండు నుంచి ఢిల్లీ రావాల్సిన విమానం హైజాక్ కు గురైన విషయం తెలిసిందే. అప్పుడు జరిగిన ఆ వారం రోజుల ఉత్కంఠను ఈ వెబ్ సిరీస్ లో కళ్లకు కట్టినట్లు చూపించారు. విజయ్ వర్మ, నసీరుద్దీన్ షాలాంటి వాళ్లు నటించిన ఈ సిరీస్ కు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

మామ్లా లీగల్ హై

విలక్షణ నటుడు రవి కిషన్ నటించిన వెబ్ సిరీస్ మామ్లా లీగల్ హై. ఈ కామెడీ డ్రామా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రెండో సీజన్ కు కూడా సిద్ధమైన ఈ సిరీస్ లో ఢిల్లీలోని పట్పర్‌గంజ్ డిస్ట్రిక్ట్ కోర్టు చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఓ కన్నింగ్ లాయర్ గా రవి కిషన్ నటించాడు.

త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్

త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ ఓ బోల్డ్ కాన్సెప్ట్ తో వచ్చిన వెబ్ సిరీస్. సీఏ చేసినా తన కుటుంబాన్ని పోషించుకోలేని ఓ వ్యక్తి.. సెక్స్ వర్కర్ గా మారి ఎలా కోట్లు సంపాదించాడో ఈ సిరీస్ లో చూడొచ్చు. అయితే అతని ఆ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీసిందన్నది ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు. మానవ్ కౌల్, తిలోత్తమ షోమ్ లాంటి వాళ్లు ఇందులో నటించారు.

కిల్లర్ సూప్

కిల్లర్ సూప్ కూడా ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. మనోజ్ బాజ్‌పాయి, కొంకనాసేన్ శర్మ నటించిన ఈ వెబ్ సిరీస్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో మనోజ్ డ్యుయర్ రోల్లో నటించాడు. తన భర్తను హత్య చేసిన లవర్ నే భర్తగా చూపించడానికి అతని ముఖాన్ని యాసిడ్ తో కాల్చిన స్వాతి అనే మహిళ చుట్టూ తిరిగే స్టోరీ ఇది.

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో

ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ గా ఉండే సెలబ్రిటీ టాక్ షో ఇది. ఈ ఏడాది సరికొత్తగా నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. స్ట్రీమింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ సిరీస్ లలో ఉంటూ వస్తోంది.

ది ఇంద్రాణీ ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్

2012లో జరిగిన షీనా బోరా హత్య కేసు, అందులో ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జీ అరెస్ట్, తెర వెనుక జరిగిన ఘటనల ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ ఇది. ఓ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కు ఏమాత్రం తీసిపోకుండా ఈ డాక్యుమెంటరీ ప్రేక్షకులను అలరించింది.

3 బాడీ ప్రాబ్లమ్

3 బాడీ ప్రాబ్లమ్ ఓ ఇంగ్లిష్ వెబ్ సిరీస్. 1960ల్లో చైనాలో ఓ మహిళ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం మానవాళికి ఎలాంటి ముప్పు తీసుకు వచ్చింది? దానిని ఎదుర్కోవడానికి సైంటిస్టులు, డిటెక్టివ్ సంయుక్తంగా ఏం చేశారన్నది ఈ వెబ్ సిరీస్ స్టోరీ.