Brahmamudi December 25th Episode: తాతయ్య బిల్ కోసం రాజ్ కష్టాలు- 10 లక్షలు వేస్ట్ చేసిన స్పప్న- కావ్యను నిలదీసిన ధాన్యం
Brahmamudi Serial December 25th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 25 ఎపిసోడ్‌లో చాలా టిఫిన్స్ ఆర్డర్ పెట్టుకుని ఊరిస్తూ తింటారు ధాన్యలక్ష్మీ, రుద్రాణి. దాంతో వారి కార్డ్స్ బ్లాక్ చేసి షాక్ ఇస్తుంది కావ్య. మరోవైపు సీతారామయ్య హాస్పిటల్ బిల్ కట్టేందుకు కావాల్సిన డబ్బు బ్యాంక్ అకౌంట్‌లో ఉండదు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య టిఫిన్‌కు ఒక్క ఇడ్లీ చేయడంపై ప్రకాశంకు చెప్పి ఫైర్ అవుతుంది. కోట్ల ఆస్తి పెట్టుకుని చిల్లరగా ఇంట్లో ఒక్క టిఫిన్ చేస్తాను, ఒక్క కర్రీ వండుతాను, అదే మీరందరూ తినాలి అని రూల్స్ మాట్లాడుతుంటే మీకు అవమానంగా అనిపించట్లేదా అని ధాన్యలక్ష్మీ అంటుంది.
తప్పు అస్సలు చేయవు కదా
కోట్ల ఆస్తి ఉంది కదా అని ఖర్చు చేయాలని లేదు కదా. కావ్య మాట్లాడింది దాంట్లో లాజిక్ ఉంది కాబట్టే ఊరుకున్నాను. నువ్ కూడా చిల్లర గొడవలు పడకుండా ఉండు అని ప్రకాశం వెళ్లిపోతాడు. నేను ఆర్డర్ పెట్టుకుని తింటాను. అది ఏం చేస్తుందో చూస్తా అని ధాన్యలక్ష్మీ అనుకుంటుంది. మరోవైపు అపర్ణతో నేను కఠినంగా వ్యవహరించడం మీకు కూడా తప్పు అనిపిస్తుందా అని అడుగుతుంది. నువ్ తప్పు అయితే అస్సలు చేయవు కదా. మనిషిని అర్థం చేసుకోలేకపోతే ఏ బంధానికి అర్థం ఉండదు. ఈ ఇంట్లో వచ్చిన సమస్య అదే అని అపర్ణ అంటుంది.
కానీ, ఒక్కటి నాకు అర్థం కావట్లేదు. ఆకలి అంటే ఆలోచించకుండా పెట్టే నువ్వు నీ సొంతింట్లోనే ఇలా చేస్తున్నావు అంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉందనుకుంటున్నాను. ఈ ఇంట్లో చాలా మందికి నువ్వంటే నచ్చకపోవచ్చు కావచ్చు. కానీ, నాకు నీమీద పూర్తి నమ్మకం ఉంది. ఇంటి విషయాల్లో నువ్ ఇంత కఠినంగా ఉన్నావంటే అది ఈ కుటుంబ గౌరవానికే సంబంధించిందని నాకు అర్థమైంది. అది చెప్పేది అయితే మాకు చెప్పేదానివి. అందుకే అడగలేదు అని అపర్ణ అంటుంది.
అవును, అత్తయ్య బలమైన కారణం ఉంది. ఇప్పుడు చెప్పలేను. సరైన టైమ్ వచ్చినప్పుడు చెబుతాను అని కావ్య వెళ్లిపోతుంది. మరోవైపు స్వప్న ఇడ్లీ తింటుంటుంది. కావ్య వస్తుంది. కావ్య రావడం చూసి కావాలనే చాలా రకాల టిఫిన్స్ తెచ్చుకుంది వినేలా మాట్లాడుతుంది రుద్రాణి. ఒక్కొక్కరికి ఒక్కో టిఫిన్ చెబుతూ ఉంటుంది. మిగిల్తే చెత్త బుట్ట ఉండనే ఉందికదా. దాని కడుపు నిండుతుంది అని రుద్రాణి అంటుంది.
కావాలనే ఊరిస్తూ తింటూ
రుద్రాణి, ధాన్యలక్ష్మీ కావాలని ఊరిస్తూ తింటుంటే స్వప్న నవ్వుతుంది. ఆకలితో తింటున్నట్లు లేదు. కావ్యమీద కడుపుమంటతో తింటున్నట్టుంది. రాహుల్ నెమ్మదిగా తిను. వారం రోజుల నుంచి తిననట్లు అంత ఆత్రంగా తింటావేంటీ అని స్వప్న అంటుంది. ఆ చెత్త ఇడ్లీ ఏం తింటావ్ కానీ, నీకు నచ్చింది తిను అని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. వద్దు ఆంటీ. కడుపుతో ఉన్నాను కదా. అడ్డమైన గడ్డి తినొద్దని డాక్టర్ గడ్డి పెట్టిందని స్వప్న పంచ్ ఇస్తుంది.
ఎవరికైనా తినాలనిపిస్తే తినొచ్చు. చాలా ఉంది అని కావ్యను ఇన్‌డైరెక్ట్‌గా అంటుంది ధాన్యలక్ష్మీ. అవసరానికి మించి ఉంది విషంతో సమానం. జాగ్రత్త. స్టెల్లా ఫుడ్ తిని రాహుల్ ఏమయ్యాడో గుర్తు చేసుకోండి. నా మీద పంతంతో మీ కడుపును ఎందుకు ఇబ్బంది పెడతారు. తర్వాత బాధపడాల్సింది మీరే అని కావ్య అంటుంది. కుళ్లుతో చెబుతుంది. లైట్ తీసుకో అని ధాన్యలక్ష్మీ అంటుంది. రాహుల్ కావాలనే మరోటి తింటాడు.
వీళ్లను ఎంత కంట్రోల్ చేద్దామంటే అంతకంత రెచ్చిపోతున్నారు. ఆర్డర్ పెట్టి డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. ఇవాళ తాతయ్య హాస్పిటల్ బిల్ కట్టడానికి చెక్ ఇవ్వాలని ఆయన చెప్పారే. రెడీ అయ్యారో లేదో అని కావ్య వెళ్లిపోతుంది. మరోవైపు సీతారామయ్యను చూస్తూ ఇందిరాదేవి బాధపడుతుంది. నువ్ వెళ్లిపోతే వాళ్ల మధ్యలో దిక్కులేని పక్షిలా మిగిలిపోతా. నాకోసం అయినా తిరిగి రా అని ఇందిరాదేవి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
తాతయ్య బిల్ కట్టమంటూ
ఇంతలో రాజ్, కావ్య వస్తారు. కావ్య నచ్చజెబుతుంది. ఇలా బాధపడతారనే ఇంట్లో ఉండమన్నాం అని కావ్య అంటుంది. సంతోషంలో ఉన్నప్పుడు ఆయనతో ఉండి ఇప్పుడు లేకుండా ఎలా ఉండను. జీవితాంతం ఆయనతో ఉంటాను అని మాటిచ్చాను అని ఇందిరాదేవి అంటుంది. కల్యాణ్ వస్తే సీతారామయ్య బిల్ ఐదు లక్షలు కట్టమని చెక్ ఇస్తాడు. దాంతో కల్యాణ్ వెళ్లిపోతాడు. మరోవైపు వంట ఏం చేశావని శాంతను అడుగుతుంది రుద్రాణి.
తోటకూర పప్పు, మజ్జిగ అని శాంత చెబుతుంది. గేదేలు, గొర్రెలు తినేది కాకుండా ఇంకా ఏదైనా చేయలేదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. చికెన్, మటన్, ఫ్రాన్స్ వంటివి అని రుద్రాణి చెబుతుంది. కావ్య అమ్మ గారు అని శాంత అంటుంటే ఇక ఆపేయ్. ఈ దరిద్రాన్ని వినే ఓపిక లేదని ధాన్యలక్ష్మీ, తినే ఇంట్రెస్ట్ లేదని రుద్రాణి అంటారు. అలా అయితే అన్నం వేస్ట్ అయిపోతుంది కదా. ఒక్క మెతుకు కూడా వేస్ట్ కాకూడదు అని మేడమ్ చెప్పారు అని శాంత అంటుంది.
మరి ఇంత చాదస్తం ఏంటో అని ధాన్యలక్ష్మీ అంటే.. చాదస్తం కాదు కుళ్లు. అది బయటకెళ్లి నచ్చనివి తింటుంది. అందుకే ఇంట్లో ఒక కర్రీ అని పాస్ చేస్తుంది. మనకు నచ్చింది ఆర్డర్ పెట్టుకుందామని రుద్రాణి అంటుంది. బెడ్ రూమ్‌లో తమకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకునేందుకు క్రెడిట్ కార్డ్స్ వాడుతారు. కానీ, అవి డీక్లైన్ అయి ఉంటాయి. ఇద్దరి కార్డ్స్ బ్లాక్ అవ్వడంతో షాక్ అవుతారు. ఆ మామిడి పింద మొహంది కావాలనే కార్డ్స్ బ్లాక్ చేసిందని రుద్రాణి అంటుంది.
ఒక్కో కర్రీ వండుతుంది
ఉదయం టిఫిన్ ఆర్డర్ పెట్టుకున్న ఎఫెక్టే ఇది. కుళ్లుబోతు మొహంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇలా మనం అనుకుంటే సరిపోదు. మా అన్నయ్య నెత్తినపెట్టుకున్నాడు. పదా అడుగుదాం అని వెళ్లి సుభాష్‌కు వెళ్లి చెబుతారు రుద్రాణి, ధాన్యలక్ష్మీ. ఏం చేసిందని సుభాష్ అంటాడు. రోజు చాలా చేస్తుంది. ఒక్క కర్రీ వండుతుంది. ఆర్డర్ పెట్టుకుంటే కార్డ్స్ బ్లాక్ చేసింది. కావాలనే కావ్య బ్లాక్ చేసింది. కావాలంటే నువ్వే అడుగు అని రుద్రాణి అంటుంది.
దాంతో బ్యాంక్‌కు కాల్ చేసి సుభాష్ అడుగుతాడు. కార్డ్స్‌ను బ్లాక్ చేయమని కావ్య మేడమ్ ఆఫీస్ నుంచి మెయిల్ చేశారు అని బ్యాంక్ వాళ్లు చెప్పడంతో సుభాష్ షాక్ అవుతాడు. దాంతో రుద్రాణి రెచ్చిపోయి మాటలు అంటుంది. తను చెప్పింది వినాలి, తినాలి. లేదంటే ఇలా బ్లాక్ చేసి మమ్మల్ని పస్తులు ఉండేలా చేస్తుంది. ఇదే ఆవిడకు ఉన్న బలమైన కారణం అని ధాన్యలక్ష్మీ అంటుంది. జరిగింది చిన్న విషయం ఎందుకు గొడవ చేస్తారు అని సుభాష్ అంటాడు.
కావ్య ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో నేను కనుక్కుంటాను. అంతవరకు ఆగండి అని సుభాష్ వెళ్లిపోతాడు. వీళ్లు చూసి చూడనట్లు వదిలేస్తారేమో. నేను ఊరుకోను. రాని కడిగేస్తాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. మరోవైపు కావ్య, రాజ్ కారులో వెళ్తుంటే రాజ్‌కు బ్యాంక్ నుంచి కాల్ వస్తుంది. హాస్పిటల్ బిల్ క్లియర్ చేయమని ఐదు లక్షల చెక్ వచ్చింది. కానీ, బ్యాలెన్స్ జీరో అని చూపిస్తుందని చెబుతాడు. దాంతో ఇద్దరు షాక్ అవుతారు.
ఇంకా పది లక్షలు ఏమైనట్టు
కాసేపట్టలో అకౌంట్‌లో అమౌంట్ పడుతుంది. ముందు అది క్లియర్ చేయండి అని రాజ్ చెబుతాడు. కంపెనీ వాళ్లు 25 లక్షలు డ్రా చేశారా అని మేనేజర్‌కు కాల్ చేస్తే.. 20 లక్షలు వాడుకోమన్నారు కదా. కానీ, 15 లక్షలే ఉన్నాయి అని చెబుతాడు. సరే మిగతా అమౌంట్ నేను రెడీ చేస్తాను అని రాజ్ అంటాడు. ఇంకా 10 లక్షలు ఏమైనట్టు అని రాజ్ అంటాడు. వచ్చేటప్పుడు మా అక్కకు ఖాళీ చెక్ ఇచ్చి వచ్చాను కదా. అది గనుక డ్రా చేసుకుందంటారా అని కావ్య అంటుంది.
మా పిన్ని, అత్త అయితే ఆస్తిలో హక్కుందని చేస్తారు. కానీ, స్వప్న ఎందుకు అలా చేస్తుందని రాజ్ అంటాడు. ఉండండి మా అక్కకు ఫోన్ చేస్తాను అని కాల్ చేస్తుంది కావ్య. స్వప్న లిఫ్ట్ చేయదు. ఇప్పటికిప్పుడు పది లక్షలు అంటే ఎలా తీసుకొస్తాం అని రాజ్ అంటాడు. మరోవైపు ఆకలితో అలమటిస్తుంటారు ధాన్యలక్ష్మీ, రుద్రాణి. ఇంకాసేపు తినకుండా ఉంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోయి ఇక్కడ కళ్లు తేలేసేలా ఉన్నాయి అని ధాన్యలక్ష్మీ అనుకుంటే ఇక నావల్ల కాదు అని రుద్రాణి అనుకుంటుంది.
ఇద్దరు ఒకేసారి ఆకలేస్తుందా అని అంటారు. పదా పెట్టిన గడ్డి తినేసి, ఇచ్చిన కుడితి తాగేద్దాం అని ధాన్యలక్ష్మీ అంటుంది. కావ్య వచ్చాకా మొత్తం కక్కేద్దాం అని రుద్రాణి అంటే.. ఇలా కాంప్రమైజ్ అవ్వడం నాకు నచ్చట్లేదు అని ధాన్యలక్ష్మీ అంటారు. వెళ్లి శాంతను వడ్డించమంటారు. మీరు వద్దన్నారు. మిగిలిపోతే పాడవుతుందని, అన్నం కూరలు వృథా చేయడం ఎందుకు అని ఇప్పుడే ముష్టి వాళ్లకు వేశాను అని శాంత చెబుతుంది. దాంతో ఇద్దరూ షాక్ అవుతారు.
నువ్వే చెక్ ఇచ్చావ్ కదా
మీరు వెళ్లారు కదా. ఇక రారని అనుకున్నాను అని శాంత అంటుంది. తర్వాత కావ్య వస్తే కార్డ్స్‌ను బ్లాక్ చేశావా అని ధాన్యలక్ష్మీ అడిగితే.. చేశాను. అనవసరమైన ఖర్చులు పెట్టకూడని అని కావ్య చెబుతుంది. మీ అక్కకు మాత్రం గోల్డ్ నెక్లెస్ కొనియొచ్చా అని ధాన్యలక్ష్మీ నిలదీస్తుంది. దాంతో షాక్ అయిన కావ్య ఈ నెక్లెస్ కొనడానికి నీకు డబ్బు ఎక్కడిది అని స్వప్నను నిలదీస్తుంది. నువ్వే కదా చెక్ ఇచ్చావ్ అని స్వప్న అంటుంది.
ఇంటి అవసరాలకు అని ఖాళీ చెక్ ఇస్తే స్వప్న 10 లక్షలతో నెక్లెస్ కొన్నట్లుగా తెలుస్తోంది. దాంతో కావ్య, స్వప్న మధ్య గొడవ జరిగే అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తోంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
టాపిక్