Mohanlal: 40 ఏళ్లుగా ఇలాంటి సినిమా రాలేదు.. మొదటిసారి దర్శకత్వం, పుష్ప 2 నిర్మాతలపై సూపర్ స్టార్ మోహన్ లాల్ కామెంట్స్-malayalam superstar mohanlal comments on barroz 3d movie and pushpa 2 producers mythri movie distributors ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mohanlal: 40 ఏళ్లుగా ఇలాంటి సినిమా రాలేదు.. మొదటిసారి దర్శకత్వం, పుష్ప 2 నిర్మాతలపై సూపర్ స్టార్ మోహన్ లాల్ కామెంట్స్

Mohanlal: 40 ఏళ్లుగా ఇలాంటి సినిమా రాలేదు.. మొదటిసారి దర్శకత్వం, పుష్ప 2 నిర్మాతలపై సూపర్ స్టార్ మోహన్ లాల్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Dec 25, 2024 06:43 AM IST

Mohanlal Comments On Barroz And First Time Direction: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తొలిసారి దర్శకత్వం వహించిన మాలీవుడ్ ఫాంటసీ మూవీ బరోజ్ 3డీ. ఇవాళ (డిసెంబర్ 25) బరోజ్ త్రీడీ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమా విశేషాలను మోహన్ లాల్ పంచుకున్నారు.

40 ఏళ్లుగా ఇలాంటి సినిమా రాలేదు.. మొదటిసారి దర్శకత్వం, పుష్ప 2 నిర్మాతలపై సూపర్ స్టార్ మోహన్ లాల్ కామెంట్స్
40 ఏళ్లుగా ఇలాంటి సినిమా రాలేదు.. మొదటిసారి దర్శకత్వం, పుష్ప 2 నిర్మాతలపై సూపర్ స్టార్ మోహన్ లాల్ కామెంట్స్

Mohanlal Comments On Barroz Movie: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ టైటిల్ రోల్‌లో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన ఎపిక్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'బరోజ్ 3డీ'. ఈ సినిమాని ఆశీర్వాద్‌ సినిమాస్‌ పతాకంపై ఆంటోని పెరుంబవూర్‌ గ్రాండ్‌గా నిర్మించారు.

yearly horoscope entry point

ఇప్పటికే విడుదలైన బరోజ్ త్రీడీ ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్‌గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసి సినిమాపై అంచనాలు పెంచాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న పుష్ప 2 నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ బరోజ్ సినిమాను తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న బరోజ్ 3డీ మూవీ విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మోహన్ లాల్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

బరోజ్ జర్నీ ఎలా మొదలైయింది?

-బరోజ్ త్రీడీ ఫాంటసీ ఫిల్మ్. ఇప్పటివరకూ మలయాళం నుంచి మూడు త్రీడీ సినిమాలే వచ్చాయి. అయితే బరోజ్‌లో ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని చాలా యూనిక్‌గా సినిమాని రూపొందించాం. సినిమా అద్భుతంగా వచ్చింది. విజువల్ వండర్‌తో పాటు స్టొరీ టెల్లింగ్‌ని రీడిస్కవర్ చేసేలా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరికీ నచ్చేలా ఉంటుంది.

బరోజ్ కథకు స్ఫూర్తి ఉందా?

-గార్డియన్‌ ఆఫ్‌ డి గామాస్‌ ట్రెజర్‌ నవలను ఆధారంగా చేసుకొని ఒక ఇమాజనరీ అడ్వంచర్ కథని రూపొందించాం. వాస్కో డి గామాలో దాగి ఉన్న రహస్య నిధిని కాపాడుతూ వచ్చే బరోజ్‌, ఆ సంపదను దాని నిజమైన వారసుడికి అందించడానికి చేసే ప్రయత్నాలు చాలా అద్భుతంగా ఉంటాయి. స్టొరీ టెల్లింగ్ చాలా కొత్త ఉంటుంది. ప్రేక్షకులు ఓపెన్ మైండ్‌తో వచ్చి ఈ ఇమాజినరీ వరల్డ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను.

త్రీడీ సినిమా నిర్మించడంలో ఎదురుకున్న సవాళ్లు?

-త్రీడీ సినిమా చేయడం అంత ఈజీ కాదు. ప్రత్యేకమైన కెమరాలు అవసరం పడతాయి. అన్ని కెమరాల విజన్ పర్ఫెక్ట్‌గా సింక్ అవ్వాలి. ప్రేక్షకుడికి గొప్ప త్రీడీ అనుభూతి ఇవ్వడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.

తొలిసారి దర్శకత్వం వహించడం ఎలా అనిపించింది?

-ఈ సినిమాకి ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు పని చేశారు. హాలీవుడ్ పాపులర్ కంపోజర్ మార్క్ కిల్లియన్ బీజీఎమ్ ఇచ్చారు. ఆడియన్స్‌కి చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. 12 ఏళ్ల లిడియన్ నాదస్వరం ఈ సినిమాకి సాంగ్స్ కంపోజ్ చేయడం మరో విశేషం.

-టాప్ లెన్స్ మ్యాన్ సంతోష్ శివన్ కెమరా వర్క్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. విజువల్స్ ప్రేక్షకుడికి చాలా కొత్త అనుభూతిని పంచుతాయి. అలాగే గ్రాఫిక్స్ వర్క్ కూడా అద్భుతంగా ఉంటుంది. దీని కోసం యానిమేటెడ్ క్యారెక్టర్స్ కూడా క్రియేట్ చేశాం. చాలా మంది హాలీవుడ్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేశారు.

-పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా కేర్ తీసుకొని చేశాం. గత నలభై ఏళ్లుగా ఇలాంటి సినిమా రాలేదు. దర్శకుడిగా ఇది నాకు కొత్త అనుభూతి. దర్శకుడిగా తొలి సినిమానే త్రీడీలో చేయడం సవాలుగా అనిపించింది. టీమ్ అందరూ చాలా సపోర్ట్ చేశారు.

-మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆడియన్స్ థియేటర్స్‌లో ఓ న్యూ వరల్డ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారనే నమ్మకం ఉంది. తప్పకుండా సినిమా అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది.

Whats_app_banner