OTT Action Movie: మరో ఓటీటీలోకి ప్రశాంత్ నీల్ స్టోరీ ఇచ్చిన మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..
Bagheera OTT Streaming: బఘీరా సినిమా మరో ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్టోరీ అందించారు. ఈ మూవీ మరో భాషలో ఇంకో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాలివే..
కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్ సినిమాలతో భారీ బ్లాక్‍బస్టర్లు కొట్టి పాన్ ఇండియా రేంజ్‍లో పాపులర్ అయ్యారు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇంతటి సక్సెస్‍ఫుల్ డైరెక్టర్.. బఘీర చిత్రానికి కథ అందించారు. దీంతో ఈ మూవీపై హైప్ విపరీతంగా వచ్చింది. అందులోని కేజీఎఫ్ మేకర్స్ హోంబాలే ఫిల్మ్స్ నిర్మించడంతో మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ సూపర్ హీరో యాక్షన్ మూవీకి సూరి దర్శకత్వం వహించగా.. శ్రీమురళి హీరోగా నటించారు.
బఘీర చిత్రం అక్టోబర్ 31న థియేటర్లో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. స్థాయిలో కలెక్షన్లు రాబట్టుకోలేకపోయింది. ఇప్పటికే నాలుగు భాషల్లో నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ మూవీ ఇప్పుడు మరో ఓటీటీలోకి హిందీలో అడుగుపెట్టింది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే..
బఘీర చిత్రం హిందీ వెర్షన్ నేడు (డిసెంబర్ 25) డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో నవంబర్‌లో కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఇప్పుడు హిందీలో డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో హిందీలో ఎంట్రీ ఇచ్చింది. ఇలా రెండు ఓటీటీల్లో బఘీర ఈ మూవీ అందుబాటులో ఉంది.
బఘీర చిత్రంలో శ్రీమురళికి జోడీగా రుక్మిణి వసంత్ నటించారు. పోలీస్ ఆఫీసర్‌గా ఉండే ప్రభాకర్ (శ్రీమురళి).. బఘీర అనే సూపర్ హీరో వేషం ఎందుకు వేసుకున్నాడు.. ఏం చేశాడనే విషయాల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి పవర్‌ఫుల్ స్టోరీ ఇచ్చారు. సూరి (సురేశ్ యల్లప్ప) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కథ కాస్త రొటీన్ అవడం, నరేషన్ అంత కొత్తగా లేకపోవడంతో ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది.
బఘీర చిత్రంలో అచ్యుత్ కుమార్, ప్రకాశ్ రాజ్, రామచంద్ర రాజు, రంగనాయన రఘు, అవినాశ్ ఎలండూర్ కీలకపాత్రలు పోషించారు. హోంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ప్రొడ్యూజ్ చేశారు. అజ్నీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి అర్జున్ శెట్టి సినిమాటోగ్రఫీ చేశారు.
బఘీర స్టోరీలైన్
సూపర్ హీరో అయి ప్రజలను కాపాడాలని చిన్నప్పటి నుంచి వేదాంత్ ప్రభాకర్ (శ్రీమురళి) కలలుకంటూ ఉంటాడు. అయితే తల్లిమాటకు కట్టుబడి పోలీస్ ఆఫీసర్ అవుతాడు. వేదాంత్ పోలీస్ అయ్యాక మంగళూరులో క్రైమ్ రేట్ తగ్గుతుంది. అయితే తాను అనుకున్నట్టుగా అవివీతిని, నేరాలను ఆపలేకపోతాడు. విసుగెత్తి మాస్క్ ధరించి బఘీర వేషం వేసుకుంటాడు. వేదాంత్… బఘీరాగా మారేందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఆ తర్వాత ఏం చేశాడు? ఏ నేరాలను అడ్డుకున్నాడు.. ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించాడు? అనే అంశాల చుట్టూ బఘీర మూవీ సాగుతుంది.
సంబంధిత కథనం