Telangana News Live December 25, 2024: CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ, చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చ
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 25 Dec 202404:09 PM IST
Tollywood Stars Meets CM Revanth Reddy : టాలీవుడ్ సినీ ప్రముఖులు రేపు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ సమావేశం జరగనుంది.
Wed, 25 Dec 202403:05 PM IST
Jani Master Case : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో నార్సింగి పోలీసులు రిమాండ్ రిపోర్టు దాఖలు చేశారు. లేడీ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగిక దాడి నిజమేనని నిర్థారించారు. ఈవెంట్ల పేరుతో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగికంగా వేధించినట్లు పోలీసులు నిర్థారించారు.
Wed, 25 Dec 202412:08 PM IST
- IRCTC Hyderabad Shirdi Tour 2025 : న్యూ ఇయర్ వేళ షిర్డీ సాయి దర్శనం కోసం టూర్ ప్యాకేజీ వచ్చేసింది. హైదరాబాద్ నుంచి IRCTC టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. జనవరి 01, 2025వ తేదీన ట్రైన్ జర్నీ ద్వారా షిర్డీకి వెళ్తారు. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి…..
Wed, 25 Dec 202410:37 AM IST
AP TG Weather Updates : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన చేసింది వాతావరణ శాఖ.
Wed, 25 Dec 202410:13 AM IST
- తెలంగాణ గ్రూప్స్ పరీక్షలకు భారీగా దరఖాస్తులు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే పరీక్షల సమయానికి మాత్రం హాజరవుతున్న అభ్యర్థుల సంఖ్య సగానికి పైగా తగ్గిపోతుంది. ఇటీవలే జరిగిన గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలే ఇందుకు ఉదాహరణగా నిలిచాయి.
Wed, 25 Dec 202409:39 AM IST
Compensation For Revathi Family : సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి పుష్ప టీమ్ రూ.2 కోట్లు పరిహారం ప్రకటించింది. హీరో అల్లు అర్జున్ రూ.కోటి, సుకుమార్ రూ.50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ రూ.50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
Wed, 25 Dec 202408:11 AM IST
- Hyd Police Warning: పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వ్యవహారం, తదనంతర పరిణామాలపై సోషల్ మీడియా పోస్టులపై హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. తొక్కిసలాట గురించి తప్పుడు పోస్టులు పెడితే వారిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
Wed, 25 Dec 202406:47 AM IST
- Sandhya Theater stampede incident : సంథ్య థియేటర్ ఘటనకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టులు చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు.
Wed, 25 Dec 202404:37 AM IST
- Telugu States Weather Updates : ఏపీ, తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Wed, 25 Dec 202401:21 AM IST
- Bandi Sanjay: కాంట్రాక్టర్ లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్లు సిండికేట్ అయితే క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో వేయక తప్పదని హెచ్చరించారు. జనవరి 5లోగా పని చేయని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.