NNS 25th December Episode: మనోహరి అంతు చూశాకే వెళ్తానన్న ఆరు.. అమర్ కంటతడి.. కొత్త నాటకం మొదలుపెట్టిన మనోహరి-zee telugu serial nindu noorella saavasam today 25th december episode nns serial today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 25th December Episode: మనోహరి అంతు చూశాకే వెళ్తానన్న ఆరు.. అమర్ కంటతడి.. కొత్త నాటకం మొదలుపెట్టిన మనోహరి

NNS 25th December Episode: మనోహరి అంతు చూశాకే వెళ్తానన్న ఆరు.. అమర్ కంటతడి.. కొత్త నాటకం మొదలుపెట్టిన మనోహరి

Hari Prasad S HT Telugu
Dec 25, 2024 06:00 AM IST

NNS 25th December Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (డిసెంబర్ 25) ఎపిసోడ్లో మనోహరి అంతు చూశాకే తాను లోకం విడిచి వెళ్తానని ఆరు స్పష్టం చేస్తుంది. అటు ఆమె తమ చుట్టూనే ఉందని తెలుసుకొని అమర్ కుటుంబం బాధపడుతుంది.

మనోహరి అంతు చూశాకే వెళ్తానన్న ఆరు.. అమర్ కంటతడి.. కొత్త నాటకం మొదలుపెట్టిన మనోహరి
మనోహరి అంతు చూశాకే వెళ్తానన్న ఆరు.. అమర్ కంటతడి.. కొత్త నాటకం మొదలుపెట్టిన మనోహరి

NNS 25th December Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం బుధవారం (డిసెంబర్ 25) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అమర్‌ బాల్కనీలో నిల్చుని ఆరు గురించి ఆలోచిస్తుండగా మిస్సమ్మ వచ్చి పలకరిస్తుంది. నా ఆరు ఇక్కడే ఉందట మిస్సమ్మ.. పక్కనే ఉన్నా నేను చూడలేకపోతున్నాను అంటూ ఎమోషనల్‌ అవుతాడు.

yearly horoscope entry point

ఆరును తలచుకొని బాధపడిన అమర్ కుటుంబం

లోపల కూర్చున్న పిల్లలు కూడా ఏడుస్తుంటారు. అమ్మ ఇక్కడే ఉందంట. మనల్ని చూస్తూ ఉంటుంది. మనం గేమ్స్‌ ఆడినప్పుడు ఎంత సంతోషించిందో.. మనల్ని రౌడీలు కిడ్నాప్‌ చేసినప్పుడు అమ్మ ఎంత బాధపడిందో అనుకుంటూ ఏడుస్తుంటారు. ప్రాణం పోయాక కూడా పక్కనే ఉండి తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది చూశారా అండి నా కోడలిని అంటూ నిర్మల బాధపడుతుంది.

ఇన్ని రోజులు ఈ ఇంటికి వస్తున్న ప్రమాదాల నుంచి కాపాడింది ఆ దేవుడు అనుకున్నాను కానీ ఈ ఇంటి దేవత అని పసిగట్టలేకపోయాము మేడం అంటూ రాథోడ్‌ బాధపడుతుంటాడు. ఈ ఇంటికి వచ్చిన కష్టాలను చూసి పాపం పిచ్చి పిల్ల ఎంత కుమిలిపోయి ఉంటుందో అని శివరాం బాధపడతాడు.

అమర్ కంట కన్నీళ్లు

అమర్‌ ఏడుస్తుంటే.. ఏంటండీ చిన్నపిల్లాడిలా.. అన్ని తెలిసిన వారు అర్థం చేసుకుని ధైర్యంగా ఉండాల్సింది పోయి.. ఇలా అయిపోతున్నారు అంటూ ఓదారుస్తుంది మిస్సమ్మ. నాకు అర్థం కావడం లేదు మిస్సమ్మ ఆ దేవుడు నాకు ఆరును జీవిత కాలం దూరం చేసి నన్ను తనకు పక్కనే ఎందుకు పెట్టాడో నాకు అర్థం కావడం లేదు.. నేను తన కోసం ఏడ్చిన ప్రతిసారి తను నా పక్కనే ఉండి నా కన్నీళ్లను తుడవలేక ఎంత నరకం అనుభవించిందో ఏమిటో అంటూ అమర్‌ బాధపడతాడు.

దీంతో మరి మిమ్మల్ని ఇప్పుడు అక్క చూస్తే బాధపడకుండా ఉంటుందా చెప్పండి. వాళ్లు గుర్తుకు వచ్చినప్పుడు మన కంట్లో ఆనందం కనిపించాలి కానీ కన్నీళ్లు రాకూడదు అని మిస్సమ్మ చెప్తుంది. మీ నవ్వులో మీ జ్ఞాపకాల్లో అక్కను బతికించండి అని మనోధైర్యాన్ని ఇస్తుంది మిస్సమ్మ. స్వామిజీ చెప్పినట్టు అరుంధతి అస్థికలు సాంప్రదాయబద్దంగా నదిలో కలపాలండి అని నిర్మల.. శివరాంకు చెప్తుంది. దీంతో శివరాం సరేనని వెంటనే స్వామిజీని అడిగి మంచి రోజు చెప్పమని అడుగుతాను అని చెప్తాడు.

మనోహరి కొత్త నాటకం

ఆ విషయం విన్న మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. చెల్లెలిని సాగనంపాలి అనుకుంటే అక్కను పంపించే అవకాశం వచ్చింది. దేవుడు నా కోసం ఇచ్చిన ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోకూడదు అంటూ రూంలోంచి బయటకు వచ్చి అందరినీ పిలిచి మనం తప్పు చేశాం.. ఆరు విషయంలో మనం ఎంత పెద్ద తప్పు చేశామో తలుచుకుంటేనే నా మీద నాకే కోపంగా ఉంది అంటూ నాటకం ఆడుతుంది.

కిటికీలోంచి చూస్తున్న ఆరు కోపంగా మనోహరిని తిడుతుంది. అక్క విషయంలో ఇంట్లో వాళ్లు తప్పు చేయడం ఏంటి మనోహరి గారు అని అడుగుతుంది మిస్సమ్మ. దీంతో ఆరు ఆస్థికలు నదిలో కలపకపోవడమే కదా మనం చేసిన తప్పు అమర్‌ అంటూ చెప్తుంది మనోహరి. దీంతో అమర్‌ కూడా ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆరు ఆస్థికలను నదిలో కలుపుదాం అని చెప్తాడు.

ఇంతలో మనోహరి నేను పంతులు గారితో మాట్లాడాను అమర్‌. ఎల్లుండి మంచి రోజట.. ఆరోజు నదిలో కలిపితే మంచిది అంటుంది. దీంతో నిర్మల ఎల్లుండా.. ఎల్లుండి పౌర్ణమి ఆరోజు కాకుండా పౌర్ణమి మరుసటి రోజు కలుపుదాం అని అప్పుడు ఆరుకు కూడా మంచిది అని చెప్పగానే అమర్‌ సరే అంటాడు. దీంతో మనోహరి ఎల్లుండి పౌర్ణమి అయితే రేపే నదిలో కలుపుదాం అని చెప్తుంది. మిస్సమ్మ మాత్రం పౌర్ణమి వెళ్లాకే అస్థికలు కలుపుదాం అంటుంది.

మను సంగతి చూశాకే వెళ్తానన్న ఆరు

అమ్మ చెప్పినట్టు పౌర్ణమి అయ్యాకే నదిలో కలుపుదాం అని చెప్పి అందుకు కావాల్సిన ఏర్పాట్లు చూడమని రాథోడ్‌కు చెప్పి వెళ్లిపోతాడు అమర్‌. గార్డెన్‌లో కూర్చున్న గుప్త.. ఆ మనోహరి చెప్పినట్టు రేపే అస్థికలు నదిలో కలిపి ఉంటే నాకు ఈ కాపలాదారు పని తప్పేది అని గుప్త అనుకుంటాడు. ఆరు వచ్చి బాధపడుతూ ఉంటే.. పాపం పౌర్ణమి తర్వాత బాలిక తన కుటుంబాన్ని వదిలి వెళ్లుటకు ఇష్టం లేకుండా ఏడుస్తుంది అని, తన కష్టం తీర్చలేను కానీ కన్నీళ్లు తుడిచెదను అని వెళ్లి ఓదార్చేదను అనుకుంటూ ఆరు దగ్గరకు వెళ్లి బాధపడకు బాలిక అంతా విధి.

ఇక జగన్నాథుడిపై భారం వేసి నువ్వు వెంటనే మా లోకమునకు వచ్చెదవు.. అనగానే అంతేనా గుప్త గారు నేను ఇక్కడే ఉండేందుకు నువ్వు ఏమీ చేయలేవా గుప్తగారు అంటూ బాధ పడుతున్నట్లు నటిస్తూ వెంటనే నేను అలా బాధగా అంటాను అనుకున్నావా..? విధి పేరుతో నన్ను నా కుటుంబానికి దూరం చేయాలనుకుంటారా..? మీరు వెళ్లిపోదాం అనగానే నేను ఏడుస్తూ కూర్చుంటాను అనుకుంటున్నారా..? ఇక ఆ రోజులు పోయాయి కదా..? నేనంటు వెళ్లడం జరిగితే అది మను సంగతి చూశాకే వెళ్తాను అంటుంది ఆరు.

రాథోడ్‌ ఏదో పిచ్చిగా ఆలోచిస్తుంటాడు. ఇలా కాదు అలా కాదు అంటూ ఒక్కడే తనలో తాను మాట్లాడుకుంటుంటే మిస్సమ్మ వస్తుంది. రాథోడ్‌ ఎందుకు అంత కంగారుపడుతున్నావు. బాధ్యతలు నీకు అప్పగించారు కానీ ఇంత చిన్న పనికి అంతగా ఆలోచించాలా అంటుంది. దీంతో రాథోడ్‌ నేను చెప్పానా.. అంటూ బాధపడతాడు. ఆరు అస్థికల్ని నదిలో కలిపేందుకు మనోహరి ప్లాన్.. అది​ చూశాకే వెళ్దామన్న ఆరు? తర్వాత ఏం జరిగిందనే విషయాలు తెలియాలంటే ఈరోజు డిసెంబర్​ 25న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner