SSC,Inter Tatkal Fee: ఏపీలో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు తత్కాల్ స్కీమ్, ఫీజు చెల్లింపుకు మరో ఛాన్స్
SSC,Inter Tatkal Fee: ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజులు చెల్లించని విద్యార్థులకు అయా బోర్డులు మరో అవకాశం కల్పించాయి. విద్యార్థులు తత్కాల్ పద్ధతిలో ఫీజులు చెల్లించేందుకు షెడ్యుల్ ప్రకటించారు.
SSC,Inter Tatkal Fee: ఆంధ్రప్రదేశ్‌లో గడువులోగా ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లించని విద్యార్థుల కోసం తత్కాల్ స్కీమ్‌ను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ఫస్టియర్,సెకండియర్ జనరల్, వొకేషనల్ విద్యార్థులు, రెగ్యులర్, ప్రైవేట్ విభాగాల్లో పరీక్ష ఫీజులను ఇప్పటి వరకు చెల్లించకపోతే వారికి మరో అవకాశం కల్పించారు.
తత్కాల్ స్కీమ్‌లో ఇంటర్ పరీక్షల ఫీజుల చెల్లింపుకు షెడ్యుల్‌ను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. తత్కాల్ పద్ధతిలో ఫీజుల చెల్లింపుకు డిసెంబర్ 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రూ.3వేల అపరాధ రుసుముతో తత్కాల్ ఫీజుల్ని చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికాశుక్లా తెలిపారు. ఇంటర్ కాలేజీల ప్రిన్సిపల్స్ ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తత్కాల్ ఫీజు గడువు పొడిగింపు ఉండదని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు.
పదో తరగతి విద్యార్థులకు..
పదో తరగతి పరీక్షల ఫీజుల చెల్లింపులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం మరో అవకాశం ఇచ్చింది. తత్కాల్ విధానంలో ఈ నెల 27 నుంచి జనవరి 10 వరకు విద్యార్థులకు పదో తరగతి పరీక్ష ఫీజులు చెల్లించవచ్చని తెలిపింది. తత్కాల్లో ఫీజులు చెల్లించే వారు నిర్ణీత ఫీజుతో పాటు రూ .వెయ్యి ఫైన్ చెల్లించాలని స్పష్టం చేసింది గతంలో ఫీజులు చెల్లించనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె.శ్రీనివాసులురెడ్డి తెలిపారు.