OTT Top Web Series: 2024లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన టాప్-10 వెబ్ సిరీస్‍లు.. డిఫరెంట్ జానర్లలో.. మీరెన్ని చూశారు!-amazon prime video ott top 10 web series in 2024 panchayat season 3 to inspector rishi citadel honey bunny ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Top Web Series: 2024లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన టాప్-10 వెబ్ సిరీస్‍లు.. డిఫరెంట్ జానర్లలో.. మీరెన్ని చూశారు!

OTT Top Web Series: 2024లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన టాప్-10 వెబ్ సిరీస్‍లు.. డిఫరెంట్ జానర్లలో.. మీరెన్ని చూశారు!

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 24, 2024 04:21 PM IST

Prime Video OTT Top Web Series in 2024: అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ సంవత్సరం అనేక సిరీస్‍లు వచ్చాయి. విభిన్నమైన సిరీస్‍లు అడుగుపెట్టాయి. వాటిలో టాప్-10 ఏవో ఇక్కడ చూడండి.

OTT Top Web Series: 2024లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన టాప్-10 వెబ్ సిరీస్‍లు.. డిఫరెంట్ జానర్లలో.. మీరెన్ని చూశారు!
OTT Top Web Series: 2024లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన టాప్-10 వెబ్ సిరీస్‍లు.. డిఫరెంట్ జానర్లలో.. మీరెన్ని చూశారు!

ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ ఈ ఏడాది చాలా వెబ్ సిరీస్‍లను తీసుకొచ్చింది. రకరకాల జానర్లలో సిరీస్‍ను స్ట్రీమింగ్‍కు తెచ్చింది. క్రైమ్ థ్రిల్లర్స్, యాక్షన్, హారర్, కామెడీ, రొమాంటిక్ సహా చాలా రకాల సిరీస్‍లు ప్రోమ్ వీడియోలో వచ్చాయి. వీటిలో కొన్ని వెబ్ సిరీస్‍లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బాగా పాపులర్ అయ్యాయి. ఈ ఏడాది 2024లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన వెబ్ సిరీస్‍ల్లో టాప్-10 ఏవో ఇక్కడ చూడండి.

yearly horoscope entry point

ఇన్‍స్పెక్టర్ రిషి

ఇన్‍స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ ఈ ఏడాది మార్చిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍లో వీన్ చంద్ర, సునయన ఎల్లా, మాలిని జీవరత్నం, శ్రీకృష్ణ దయాల్ ప్రధాన పాత్రలు పోషించారు. అడవిలో వరుస హత్యలను విచారించడం చుట్టూ ఇన్‍స్పెక్టర్ రిషి సిరీస్ సాగుతుంది.

సిటాడెల్: హనీబన్నీ

సిటాడెల్ హనీబన్నీ వెబ్ సిరీస్ నవంబర్‌లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‍లో వరుణ్ ధావన్, సమమంత ప్రధాన పాత్రలు పోషించారు. అమెరికన్ సిరీస్ సిటాడెల్‍కు ఇండియన్ వెర్షన్‍గా ఈ సిటాడెట్: హనీబన్నీ రూపొందింది.

పంచాయత్ 3

పాపులర్ వెబ్ సిరీస్ పంచాయత్‍కు మూడో సీజన్ ఈ ఏడాది మేలో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఫులేరా గ్రామంలో రాజకీయాలు, స్థానిక పరిస్థితుల చుట్టూ ఈ సీజన్ సాగుంది. పంచాయత్ మూడో సీజన్‍లో జితేంద్ర కుమార్, రఘుబీర్ యాదవ్, నీనా గుప్తా ప్రధాన పాత్రల పోషించారు.

స్నేక్స్ అండ్ లాడర్స్

స్నేక్స్ అండ్ లాడర్స్ ఈ ఏడాది అక్టోబర్‌లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. సరదా కోసం అడవిలోకి వెళ్లిన పిల్లలకు అనూహ్య పరిస్థితులు, సవాళ్లు ఎదురవడం చుట్టూ ఈ సిరీస్ సాగుంది. ఈ సిరీస్‍లో నవీన్ చంద్ర, నందా, మనోజ్ భారతీరాజా, ముత్తుకుమార్ లీడ్ రోల్స్ చేశారు.

మీర్జాపూర్ 3

మీర్జాపూర్ 3వ సీజన్ ఈ ఏడాది జూలైలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చింది. మున్నా భయ్యాను గుడ్డు చంపిన తర్వాత ఆధిపత్యం కోసం జరిగే పోరాటం, కుట్రలు, కుతంత్రాల చుట్టూ ఈ సీజన్ సాగింది. ఈ సీజన్‍లో అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, విజయ్ వర్మ, శ్వేత త్రిపాఠి శర్మ ప్రధాన పాత్రలు పోషించారు.

కాల్ మీ బీ

కామెడీ డ్రామ్ సిరీస్ ‘కాల్ మీ బీ’లో అనన్య పాండే, గుర్ఫతే పిర్జాదా, వీర్ దాస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ ఈ ఏడాది సెప్టెంబర్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.

పౌచర్

పౌచర్ సిరీస్ ఫిబ్రవరిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అడవిలో ఏనుగుల వేటను అడ్డుకునేందుకు అటవీ శాఖ అధికారులు చేసిన కృషి ఆధారంగా ఈ సిరీస్ సాగుతుంది. నిమిష సంజయన్, రోషన్ మాథ్యూ, దివ్యేందు భట్టాచార్య లీడ్ రోల్స్ చేశారు.

ది ట్రైబ్

ది ట్రైబ్ సిరీస్ అక్టోబర్‌లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఐదుగురు భారత ఇన్‍ఫ్లెయెన్సర్స్.. లాస్ ఏంజిల్స్ వెళ్లి తమ కలను సాకారం నేరవేర్చుకునేందుకు చేసే ప్రయత్నాలతో ఈ సిరీస్ ఉంటుంది. ఈ సిరీస్‍లో అలనా పాండే, అలవియా జాఫెరీ, శృతి పోరే ప్రధాన పాత్రల్లో నటించారు.

బిగ్ గర్ల్స్ డోంట్ క్రై

కమింగ్ ఏజ్ డ్రామా సిరీస్ ‘బిగ్ గర్ల్స్ డోంట్ క్రై’ మార్చిలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఓ గ్రూప్ టీనేజ్ అమ్మాయిల సమస్యల చుట్టూ ఈ సిరీస్ స్టోరీ సాగుతుంది. ఈ సిరీస్‍లో పూజా భట్, ముకు చడ్డా, రైమా సేన్, జోయా హుసేన్ ప్రధాన పాత్రలు పోషించారు.

దిల్ దోస్తే డైలమా

‘దిల్ దోస్తే డైలమా’ వెబ్ సిరీస్ ఏప్రిల్‍లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. కెనడాలో ఉన్నట్టు నటిస్తున్న ఓ అమ్మాయి జీవితం గురించి పాఠాలు నేర్చుకోవడం చుట్టూ ఈ సిరీస్ ఉంటుంది. ఈ సిరీస్‍లో అక్షిత సూద్, అనీత్ లీడ్ రోల్స్ చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం