TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్డేట్ - టోల్ ఫ్రీ నెంబర్, వెబ్‌సైట్ వచ్చేస్తోంది! ఇవిగో వివరాలు
- TG Indiramma Housing Scheme Updates : తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. అయితే స్కీమ్ కు సంబంధించి మరో కీలకమైన అప్డేట్ వచ్చేసింది. కొత్త ఏడాదిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం షురూ కానుంది. అంతేకాకుండా… ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ తో పాటు ప్రత్యేక వెబ్‌సైట్ ను అందుబాటులోకి రానుంది.
- TG Indiramma Housing Scheme Updates : తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. అయితే స్కీమ్ కు సంబంధించి మరో కీలకమైన అప్డేట్ వచ్చేసింది. కొత్త ఏడాదిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం షురూ కానుంది. అంతేకాకుండా… ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ తో పాటు ప్రత్యేక వెబ్‌సైట్ ను అందుబాటులోకి రానుంది.
(1 / 9)
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను తీసుకుంది. అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రత్యేకంగా సర్వేను నిర్వహిస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ నడుస్తోంది. ఈ నెలఖారు నాటికి సర్వే పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది.
(2 / 9)
ఓవైపు సర్వే ప్రక్రియ నడుస్తుండగా… మరోవైపు సాధ్యమైనంత త్వరగా లబ్ధిదారులను గుర్తించేందుకు సర్కార్ సిద్ధమైంది. సర్వే పూర్తి అయిన వెంటనే… ఇందిరమ్మ ఇళ్ల కమిటీల సాయంతో అర్హులైన వారిని గుర్తించనుంది.
(3 / 9)
తాజాగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై సమీక్షించారు. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. సర్వే పూర్తి, ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ముఖ్యమైన విషయాలను వెల్లడించారు.
(4 / 9)
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గాను ప్రత్యేక విధివిధానాలు ప్రకటించనున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. వారంరోజులు లోగా ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
(5 / 9)
ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ను తీసుకురానున్నారు. అంతేకాకుండా… టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. రాష్ట్రంలోని ఏ మారుమూల తండా, లేదా గ్రామం నుంచైనా ఫిర్యాదు చేస్తే తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
(6 / 9)
ఫిర్యాదుదారునికి తిరిగి వివరాలు కూడా అందిస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. గ్రామాల వారీగా ఇందిరమ్మ కమిటీలు లబ్దిదారులను ఎంపికచేస్తాయన్నారు.
(7 / 9)
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకుగాను రాష్ట్రంలోని 33 జిల్లాలకు 33 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్ధాయి కలిగిన ప్రాజెక్ట్ డైరెక్టర్లను నియమించారు. వీరంతా కూడా స్కీమ్ అమలును పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తారు.
(8 / 9)
డిసెంబర్ 23తేదీ నాటికి సుమారు 32 లక్షల దరఖాస్తులను పరిశీలించినట్లు మంత్రి పొంగులేటి వివరించారు. రోజుకు నాలుగున్నర నుంచి ఐదున్నర లక్షల దరఖాస్తులను పరిశీలిస్తున్నామన్నారు.
ఇతర గ్యాలరీలు