Kaatteri Review: కట్టేరి రివ్యూ.. మనిషి రుచి మరిగిన రాక్షసి, బంగారం ఇచ్చే బావి.. ఓటీటీ హారర్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?-kaatteri review telugu varalaxmi sarathkumar netflix ott horror comedy thriller movie katteri explained in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kaatteri Review: కట్టేరి రివ్యూ.. మనిషి రుచి మరిగిన రాక్షసి, బంగారం ఇచ్చే బావి.. ఓటీటీ హారర్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Kaatteri Review: కట్టేరి రివ్యూ.. మనిషి రుచి మరిగిన రాక్షసి, బంగారం ఇచ్చే బావి.. ఓటీటీ హారర్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
Dec 25, 2024 05:30 AM IST

Kaatteri Movie Review In Telugu: మనిషికి రుచి మరిగిన రాక్షసి బావిలో ఉండి లెక్కలేనంత బంగారం ఇచ్చే కథతో తెరకెక్కిన తమిళ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ కట్టేరి. తెలుగులో షైతాన్ టైటిల్‌తో నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా ఎలా ఉందో నేటి కట్టేరి రివ్యూలో తెలుసుకుందాం.

కట్టేరి రివ్యూ.. మనిషి రుచి మరిగిన రాక్షసి, బంగారం ఇచ్చే బావి.. ఓటీటీ హారర్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
కట్టేరి రివ్యూ.. మనిషి రుచి మరిగిన రాక్షసి, బంగారం ఇచ్చే బావి.. ఓటీటీ హారర్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Kaatteri Movie Review Telugu: ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు అలరిస్తూ ఉంటాయి. అయితే, ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడే జోనర్ హారర్ థ్రిల్లర్స్. వీటికి కామెడీని జోడించి మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో వచ్చే సినిమాలు అంటే మరింత ఆసక్తిగా చూసి ఎంజాయ్ చేస్తుంటారు.

yearly horoscope entry point

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో

అలా మనిషి రుచి మరిగిన ఓ రాక్షసి బావిలో ఉంటూ లెక్కలేనంత బంగారాన్ని ఇస్తుంది. ఇలాంటి యూనిక్ పాయింట్‌తో వచ్చిన తమిళ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ కట్టేరి. 2022లో వచ్చిన ఈ సినిమా తెలుగులో షైతాన్ టైటిల్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

వైరల్ అయిన హారర్ సీన్స్

దీకయ్ దర్శకత్వం వహించిన కట్టేరి మూవీలో వైభవ్, సోనమ్ బజ్వా, ఆత్మిక, వరలక్ష్మీ శరత్ కుమార్, మనాలి, కరుణాకరన్, రవి మరియ, జాన్ విజయ్, పొన్నాంబలమ్, మైమ్ గోపీ, యోగి బాబు నటించారు. అయితే, ఎప్పుడో వచ్చిన ఈ సినిమాలోని సీన్స్ ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అయ్యాయి. దాంతో మూవీ సజెషన్ కింద ఎలా ఉందో కట్టేరి రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

ఓ సైకలాజికల్ డాక్టర్‌ కామిని (ఆత్మిక)ని నిమ్మకాయల మణి (యోగిబాబు) కోసమని నాయినా గ్యాంగ్ పట్టుకెళ్తుంది. అదే గ్యాంగ్‌కు చెందిన కిరణ్ (వైభవ్), తన లవర్ శ్వేత (సోనమ్ బజ్వా)ను పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు కిరణ్ ఫ్రెండ్స్ ముగ్గురు కామిని గురించి చెబుతారు. అది విన్న శ్వేత నాయినా నుంచి కామినిని మనమే కిడ్నాప్ చేసి తన నాన్నకు ఇంకా ఎక్కువ డబ్బు అడగొచ్చు కదా అని ఐడియా ఇస్తుంది. దాంతో అలాగే నాయినా గ్యాంగ్ నుంచి కామినిని కిడ్నాప్ చేస్తారు కిరణ్ అండ్ ఫ్రెండ్స్.

ట్విస్టులు

అప్పుడు నిమ్మకాయల మణి గురించి కామినిని కిరణ్ అడిగితే.. పీనుగులపాడు గ్రామంలో నిధి ఉందని, దానికోసం వెళ్లాడని చెబుతుంది. దాంతో వారంతా ఆ ఊరుకు వెళ్తారు. పీనుగులపాడు గ్రామంలోకి వెళ్లిన కిరణ్, తన ఫ్రెండ్స్‌కు ఎదురైన సంఘటనలు ఏంటీ? ఆ ఊరు నుంచి ఎందుకు బయటపడలేకపోయారు? ఆ ఊరు వారంతా ఎందుకు దెయ్యాల్లా మారిపోయారు? మత్తమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్), మోహిని (మనాలి) కథ ఏంటీ? ఊరులో నిధి ఎక్కడ ఉంది? అనే ఆసక్తికర విశేషాల సముహారమే కట్టేరి.

విశ్లేషణ:

కట్టేరి అంటే తెలుగులో రక్త పిశాచి అనే అర్థం వస్తుంది. కానీ, ఈ సినిమాను తెలుగులో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో షైతాన్ టైటిల్‌తో రిలీజ్ చేశారు. సినిమా విషయానికొస్తే హారర్ కామెడీ జోనర్‌ సినిమాలను పర్ఫెక్ట్ కథనం, మంచి ఫన్ ట్రాక్, హారర్ ఎలిమెంట్స్ ఉంటే బాగా క్లిక్ అవుతాయి. అయితే, ఆ విషయంలో కట్టేరి పూర్తిగా సఫలం కాలేదనే చెప్పాలి.

బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న కట్టేరి మూవీ కథ మాత్రం చాలా యూనిక్‌గా ఉంటుంది. అయితే, సినిమాను ప్రజంట్ చేసే క్రమంలో చాలా వరకు లాజిక్స్ మర్చిపోయారు. చాలా వరకు సినిమా ఎంగేజింగ్‌గా అనిపించినా క్లైమాక్స్‌లో అయినా కొన్నింటికి లాజికల్‌గా ఆన్సర్ ఇచ్చుంటే బాగుండేది. ఇక కామెడీ కాస్తా అడల్ట్ రేటేడ్‌గా ఉంటుంది. కొన్ని చోట్ల అంత ఫన్ క్రియేట్ చేయదు. హీరో భార్యతో ఫ్రెండ్స్ ప్రవర్తించే తీరుతో జెనరేట్ చేసిన కామెడీ చెత్తగా ఉంది.

ఇంట్రెస్టింగ్‌గా మత్తమ్మ కథ

హారర్ ఎలిమెంట్స్ పర్వాలేదు. క్లైమాక్స్‌లో రివీల్ చేసే స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అక్కా చెల్లెల్లు మత్తమ్మ, మోహినికి సంబంధించిన పార్ట్ చాలా వరకు ఎంగేజ్ చేస్తుంది. చివరి అరగంట బాగుంటుంది. అయితే, మంచి క్రైమ్ సీన్‌తో (అది కూడా 2002లో వచ్చిన హాలీవుడ్ హారర్ మూవీ ఘోస్ట్ షిప్ నుంచి కాపీ కొట్టిందే) సినిమా ప్రారంభం అయి అక్కడక్కడ హారర్, కామెడీ సీన్స్‌తో బాగానే సాగుతుంది. నేపథ్య సంగీతం ఓకే. రెండు చోట్ల గ్లామర్ సీన్స్ ఆటవిడుపుగా ఉంటాయి.

క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ గెస్ చేయొచ్చు. అయితే, మెయిన్ సీన్స్‌కు కన్విన్స్ అయ్యేలా లాజికల్ ఆన్సర్ ఇచ్చుంటే సినిమా హిట్ అయ్యేదేమో. సినిమాలోని అన్ని పాత్రలు బాగా చేశాయి. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే సినిమాను మరి తీసిపారేయకుండా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ కట్టేరిని ఓసారి చూడొచ్చు.

Whats_app_banner