Christmas Wishes Telugu: మీ ప్రియమైనవారితో ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు పంచుకోండి, ఇవి వారికెంతో నచ్చుతాయి
Christmas Wishes Telugu: క్రిస్మస్ ఎంతో ప్రత్యేకమైన పండుగ. ప్రపంచమంతా వెలుగులతో నింపే పండుగ ఇది. ఈ క్రిస్మస్ సందర్భంగా మీ ప్రియమైన వారికి అందమైన సందేశాలతో శుభాకాంక్షలు చెప్పండి.
క్రిస్మస్ శుభాకాంక్షలు (Pixabay)
ప్రతి ఏడాది జరిగే అతి పెద్ద పండుగలో క్రిస్మస్ ఒకటి. ప్రపంచమంతా విద్యుత్ దీపాలతో కళకళలాడేలా చేస్తుంది. క్రిస్మస్ క్రిస్మస్ ట్రీలు, విందులు, వినోదాలు, జింగిల్ బెల్స్, కరోల్స్ పాటలు క్రిస్మస్ నాడు ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తాయి. ఈ పండుగ మనకు దయను దాతృత్వాన్ని కూడా బోధిస్తుంది. మీ ప్రియమైన వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోమని సూచిస్తుంది. క్రిస్మస్ పండుగ రోజు మీ బంధువులను, స్నేహితులను మీరు విష్ చేయాలనుకుంటే అందమైన సందేశాలను ఇక్కడ ఇచ్చాము. ఈ శుభాకాంక్షలు వారికి మెసేజులు, వాట్సప్, సోషల్ మీడియా ద్వారా పంపించండి. వారి అభిమానాన్ని పొందండి.
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుగులో
1. ఈ క్రిస్మస్
మీ ఇంటికి ఆనందాన్ని,
వెచ్చదనాన్ని, ప్రేమని
తీసుకురావాలని కోరుకుంటూ
క్రిస్మస్ శుభాకాంక్షలు.
2. ఈ క్రిస్మస్
మీకు మర్చిపోవాలని జ్ఞాపకాలతో నిండాలని
ప్రేమను, నవ్వును జీవితంలో నింపాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
3. మీ జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా,
ఆనందంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
క్రిస్మస్ శుభాకాంక్షలు
4. ఈ క్రిస్మస్
మీ కలలను, కోరికలను
నిజం చేయాలని కోరుకుంటూ
క్రిస్మస్ శుభాకాంక్షలు
5. క్రిస్మస్ అనేది కుటుంబం, స్నేహితులతో కలిసి
ఆనందంగా గడిపే పండుగ.
ఈ పండుగ మీ హృదయాన్ని స్వచ్ఛంగా మార్చాలని
మీ ఇంటిని నవ్వులతో నింపాలని కోరుకుంటూ
మెర్రీ క్రిస్మస్
6. ఈ క్రిస్మస్ రోజూ మీకు దక్కే ఆనందం, స్ఫూర్తి
ఏడాది పొడవునా మీతోనే ఉండాలని కోరుకుంటూ
ఆ దేవుని ప్రేమ మిమ్మల్ని నిత్యం కాపాడాలని ఆశిస్తూ
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
7. ఈ క్రిస్మస్ మీకు ఎన్నో ఆశీర్వాదాలు,
ఆనందాలను ఇవ్వాలని
విజయవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని
మనస్పూర్తిగా కోరుకుంటున్నాను క్రిస్మస్ శుభాకాంక్షలు
8. క్రిస్మస్ పండుగ రోజు
అద్భుతమైన జ్ఞాపకాలను సమకూర్చుకోండి
రుచికరమైన ఆహారాన్ని తినండి
ప్రియమైన వారితో సంతోషంగా ఉండండి
జీవితాన్ని అందంగా మలుచుకోండి
హ్యాపీ క్రిస్మస్
9. ఈ సంతోషకరమైన రోజున
మీరు ఎంత ఆనందంగా ఉన్నారో
ఈ ప్రపంచాన్ని ఎంత ప్రకాశవంతంగా చూసుకున్నారో
ప్రతిరోజు అలాగే ఉండాలని కోరుకుంటూ
క్రిస్మస్ శుభాకాంక్షలు
10. క్రిస్మస్ రోజున ఆహ్లాదంగా గడపండి
మీ ప్రియమైనవారితో కలిసి నవ్వండి
కొత్త జ్ఞాపకాలను సృష్టించుకోండి
హ్యాపీ క్రిస్మస్
11. క్రిస్మస్ మీ హృదయానికి ఇంటికి,
శాంతిని, ఆనందాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా
కోరుకుంటూ హ్యాపీ క్రిస్మస్
12. ఈ క్రిస్మస్ మీ జీవితంలో కాంతిని నింపాలని
మీరు నిజమైన ప్రేమను పొందాలని
సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ
హ్యాపీ క్రిస్మస్
13. ప్రేమ అంతులేని ఆశీర్వాదాలతో
మీ జీవితం నిండి పోవాలని ఆశిస్తూ
మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు
టాపిక్