Andhra Pradesh News Live December 25, 2024: Vaikunta Dwara Darshan Tokens : జనవరి 9న వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్ల జారీ- తిరుపతి, తిరుమలలో 91 కౌంటర్లు ఏర్పాటు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 25 Dec 202404:50 PM IST
Tirumala Vaikunta Dwara Darshan Tokens : తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. జనవరి 10, 11, 12 తేదీలకు.. జనవరి 9న టోకెన్లు జారీ చేయనున్నారు. తదుపరి రోజులకు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు.
Wed, 25 Dec 202401:41 PM IST
CM Chandrababu : దిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు...ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టి కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.
Wed, 25 Dec 202412:48 PM IST
AP TG Sensational Crimes : తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది నేరాలు పెరిగాయని పోలీసుల నివేదికలు చెబుతున్నాయి. ఏపీ, తెలంగాణ 2024లో జరిగిన పలు సంచలన ఘటనలు ఒకసారి పరిశీలిద్దాం.
Wed, 25 Dec 202411:24 AM IST
- Koil Tirumanjanam at Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. జనవరి 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ తేదీన బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
Wed, 25 Dec 202411:16 AM IST
Guntur Ration Dealer Jobs : గుంటూరు జిల్లాలో 152 రేషన్ డీలర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో, తహశీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి.
Wed, 25 Dec 202411:05 AM IST
Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు అలర్ట్... సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో అభివృద్ధి పనుల కారణంగా పది రైళ్లు రద్దు అయ్యాయి. విశాఖపట్నం మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Wed, 25 Dec 202407:59 AM IST
- Vizag Steel Plant: వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు తొలి అడుగు పడింది. స్టీల్‌ప్లాంట్ నిర్వహణలో ఉన్న ఫైర్‌స్టేషన్ ప్రైవేటీకరణకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం సిద్ధపడింది. అందులో భాగంగానే ఫైర్‌స్టేషన్ నిర్వహణకు ప్రైవేట్ వ్యక్తుల నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తోంది.
Wed, 25 Dec 202407:17 AM IST
- Nandhyala Suicides: నంద్యాలలో కుమారుడు చేసిన పనితో దంపతుల ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలిచి వేసింది. నంద్యాల పట్టణంలో చిరు వ్యాపారం చేసుకునే దంపతుల కుమారుడు హిజ్రాను పెళ్లాడుతానని పంతం పట్టడంతో పురుగుమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Wed, 25 Dec 202405:32 AM IST
- శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశాలోని బిరజాదేవి అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. క్షతగాత్రులను శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Wed, 25 Dec 202403:54 AM IST
- Nellore Cheating: నెల్లూరు జిల్లాలో పెళ్లిపేరుతో యువతిని మోసం చేసి డబ్బుతో ఉడాయించిన ఘటన చోటు చేసుకుంది. భార్యతో విడాకులు తీసుకున్నానని, పెళ్లి చేసుకుంటానని మహిళలను నమ్మించి ఒక వ్యక్తి సహజీవనం చేశాడు. ఆమె వద్దనున్న మూడు లక్షల రూపాయిలు తీసుకుని ఖర్చు చేసి అనంతరం పరారయ్యాడు.
Wed, 25 Dec 202402:50 AM IST
- SSC,Inter Tatkal Fee: ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజులు చెల్లించని విద్యార్థులకు అయా బోర్డులు మరో అవకాశం కల్పించాయి. విద్యార్థులు తత్కాల్ పద్ధతిలో ఫీజులు చెల్లించేందుకు షెడ్యుల్ ప్రకటించారు.
Wed, 25 Dec 202412:30 AM IST
- Co Working Space: ఆంధ్రప్రదేశ్‌లో 2025 డిసెంబర్ నాటికి లక్షన్నర అడుగుల కో వర్కింగ్ స్పేస్ అందుబాటులోకి తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కో వర్కింగ్ స్పేస్, నైబర్ హుడ్ వర్కింగ్ స్థలాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు.
Wed, 25 Dec 202412:00 AM IST
- Agrigold Deposits: ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది డిపాజిటర్లను నిలువునా ముంచి అగ్రిగోల్డ్ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయడానికి సత్వర చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వ్యవహారంపై వివిధ శాఖలతో సమీక్షించారు.
Wed, 25 Dec 202411:30 PM IST
- IRCTC Mahakumbh Gram: మహాకుంభమేళాకు దేశవిదేశాల నుంచి తరలి వచ్చే భక్తుల కోసం ఐఆర్‌సిటీసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రైళ్లలో కుంభమేళాకు చేరుకునే వారి కోసం అన్ని హంగులతో ఐఆర్‌సీటీసీ టెంట్ సిటీని సిద్ధం చేసింది. కుంభమేళాకు వెళ్లాలనుకునే వారు ఆన్‌లైన్‌లో ఈ సదుపాయాలను బుక్ చేసుకోవచ్చు.