Karthika Deepam December 25th episode: ఇల్లు ఎలా గడవాలి అంటూ కార్తీక్ ఎమోషనల్.. కాపాడిన దీప.. శ్రీధర్‌పై స్వప్న ఫైర్
Karthika Deepam Today Episode December 25: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దశరథ్ పెట్టిన కండీషన్లపై కాంచన కోప్పడుతుంది. ఇంటిని నడిపేందుకు డబ్బు లేదని కార్తీక్ బాధపడుతుంటే.. తాను దాచిన డబ్బును దీప ఇస్తుంది. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 25) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. గతంలో తనను అవమానించిందుకు సారీ చెప్పాలని, మీతో ఉండనివ్వాలని దశరథ్ కండీషన్లు పెడతాడు. అలా అయితే కార్తీక్ బిజినెస్ పెట్టేందుకు డబ్బు ఇస్తానంటాడు. డబ్బు సంచి ఇలా ఇవ్వాలని అనసూయతో కాంచన అంటుంది. నాకు తెలుసు కాంచన ఒప్పుకుంటావని, డబ్బుకు ఎవరైనా తలవంచాల్సిందేనని పొగరుగా అంటాడు శ్రీధర్. ప్రాణమైనా వదులుకుంటాను కానీ ఇచ్చిన మాట వెనక్కి తీసుకోను అంటూ భర్త శ్రీధర్‌కు గట్టి షాక్ ఇస్తుంది కాంచన. కండీషన్లకు ససేమిరా అంటుంది.
ధైర్యానికి తోడుగా నిజాయితీ
కండీషన్లను నిరాకరించి శ్రీధర్‌కు గట్టిగా బుద్ధి చెబుతుంది కాంచన. కార్తీక్, దీప తమకు తోడుగా ఉన్నారని అంటుంది. “మేం వదులుకుంది ఆస్తులనే. ధైర్యాన్ని కాదు. అదిగో వాడే నా ధైర్యం (కార్తీక్‍ను చూపిస్తూ). ఆ ధైర్యానికి తోడుగా ఓ నిజాయితీ ఉంది. అదే నా కోడలు దీప. డబ్బుతో కొనలేని రెండు శిఖరాలను పెట్టుకొని నేను దేనికి భయపడతా అనుకున్నారు” అని కాంచన అంటుంది. వచ్చిన దారిలోనే వెళ్లండి అని శ్రీధర్, కావేరికి చెబుతుంది కాంచన. శ్రీధర్ వెటకారంగా మాట్లాడితే.. కార్తీక్ అడ్డుకుంటారు. చీపురు కట్ట అవసరం లేదు.. మేం వెళతాం అని శ్రీధర్ వెళ్లిపోతాడు. ఇవన్నీ మనసులో పెట్టుకోవద్దని దీపకు కాంచన చెబుతుంది. దీంతో అత్త అంటే నీలా ఉండాలని కాంచన గురించి మనసులో అనుకుంటుంది అనసూయ.
సుమిత్ర బాధ.. తినకుండా..
డైనింగ్ టేబుల్ వద్ద కూడా కార్తీక్, కాంచన గురించి తలచుకొని సుమిత్ర బాధపడుతుంది. ఇంటి ఆడపడుచు కష్టాల్లో ఉంటే ముద్దు నోట్లోకి ఎలా వెళుతోందండి అని భర్త దశరథ్‍తో సుమిత్ర అంటుంది. దీంతో శివన్నారాయణ తినడం ఆపేస్తాడు. కట్టుబట్టలతో వెళ్లిన కార్తీక్ వాళ్లు తిన్నారో లేదో ఎక్కడున్నారో అని బాధపడుతుంది. ఏడుస్తూ ప్లేట్‍లో చేయి కడిగేసి వెళ్లిపోతుంది. దశరథ్ కూడా వెళ్లిపోతాడు. దీంతో శివన్నారాయణ కూడా తనకు ఇక చాలని లేచి వెళ్లిపోతాడు.
వంటలక్క ఉందిగా..
పారిజాతం మాత్రం తింటూనే ఉంటుంది. ఇలా ఎన్నాళ్లు తినకుండా ఉంటారని అంటుంది. బావ వెళ్లిపోయినందికి బాధగా ఉందని, దీప కోసం అందనీ వదులుకోవడాన్ని తట్టుకోలేకపోతున్నాని గ్రానీ అని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. నాలుగు రోజుల్లో తిరిగి వస్తారని, అన్నీ వదులుకొని బతకడం కష్టమే అని పారిజాతం చెబుతుంది. భోజనం చేసి ఉంటారా అని జ్యోత్స్న అంటుంది. “ఉందిగా వంటలక్క. ఏదో ఒకటి చేసి.. కట్టెల పొయ్యి మీద అయినా వంట చేసి పెడుతుంది. నాకు తెలిసి ఒక పొగ గొట్టం తీసుకొని ఉఫ్.. ఉఫ్పు అని ఊదుతూ ఉంటుంది” అని పారిజాతం అంటుంది.
ఎమోషనల్ అయిన కార్తీక్
కట్టెల పొయ్యిపై వంట చేస్తూ పొగతో ఇబ్బంది పడుతున్న దీపను చూసి కార్తీక్ బాధపడతాడు. తాను సరిగా చూసుకోలేకపోతున్నానని సారీ చెబుతాడు. ఇప్పుడు తాను పడుతున్న కష్టం.. ఒకప్పటి తన జీవితం అని దీప సర్దిచెబుతుంది. తనకు ఇవన్నీ అలవాటే అని, ఇది తనకు కష్టం కాదని అంటుంది. మీరు పడుతున్నది కష్టమని, మిమ్మల్ని నేనెప్పుడూ చూడలేదని దీప అంటుంది. రెండు రోజులో పోతే అన్నీ సర్దుకుంటాయని చెబుతుంది.
ఇల్లు ఎలా గడవాలి
ఎలా సర్దుకుంటాయని కార్తీక్ అంటాడు. “ఇంట్లో సరుకులు లేవు. వేసుకునేందుకు బట్టలు లేవు. శౌర్యకు మందులు తీసుకోవాలి. కొనేందుకు డబ్బులు లేవు. ఎవరినీ అడగలేను. ఎవరైనా ఇస్తే తీసుకోలేను. నేను జాబ్ చేసుకొని అడ్వాన్స్ తీసుకునేందుకైనా కొంత టైమ్ పడుతుంది కదా. ఆలోపైనా ఇల్లు ఎలా గడవాలి” అని దీపతో చెప్పి కార్తీక్ బాధపడతాడు. నా గురించి కాదు.. మీ గురించే బాధ అని అంటాడు.
దీప దాచిన డబ్బు కాపాడింది
ఇప్పటికిప్పుడు ఈ బాధలన్నీ పోయాయంటే మీరు నవ్వుతారు కదా అని దీప అంటుంది. డబ్బు కాసే చెట్టు ఏమైనా ఉందా అని కార్తీక్ అంటే. ఉంది అని దీప అంటుంది. దీంతో ఉందా అని ఆశ్చర్యపోతాడు కార్తీక్. ఇంతలో ఓ స్టీల్ డబ్బా పట్టుకొని దీప వస్తుంది. తనకు ఇవ్వాల్సిన డబ్బును ఆ డబ్బాలో వేయాలని, రూ.80వేలు అయ్యాక తీసుకుంటానని గతంలో దీపతో కార్తీక్ చెప్పి ఉంటాడు. దీంతో దీప దాంట్లో డబ్బు వేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ డబ్బాలోని డబ్బును దీప బయటికి తీస్తుంది. “మీకు నేను ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఈ డబ్బాలో వేయమన్నారు. ఇప్పటికి నేను రూ.36,450 పోగు వేశాను. పెళ్లి అయిన తర్వాత హోటల్ పని మానేశాను కదా. వెళ్లి ఉంటే ఇంకో రూ.15వేలు పోగేసేదాన్ని. అలా అయినా మీ బాకీ తీరదనుకో” అని దీప అంటుంది. అలాగైనా మీ బాకీ తీరని, ముందుకు ఈ డబ్బును ఇంటికి వాడుకుందామని చెబుతుంది.
దీంతో దీపకు థ్యాంక్స్ చెబుతాడు కార్తీక్. ఆ డబ్బు తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయంటూ ఎమోషనల్ అవుతాడు. సొంత ఖర్చులు పెట్టుకోకుండా డబ్బు దాస్తుంటే తాను చాదస్తం అనుకున్నానని, నీ పొదుపే ఇప్పుడు సాయంగా నిలబడిందని కార్తీక్ అంటాడు. సరుకులు, దుస్తులు తీసుకురావాలని దీప అంటుంది. ఎండిపోతున్న పొలంలో వర్షం పడితే ఆ రైతు ఎంత ఆనందపడతాడో.. ఈ డబ్బును చూసి తనకు అంత ఆనందంగా ఉందని అంటాడు. నెల వరకు ఖర్చులకు ఇబ్బంది లేదని, ఆలోగా తాను ఉద్యోగం చూసుకుంటానంటాడు. వ్యాపారం చేస్తానన్నారు కదా అని దీప అంటే.. ముందు ఇల్లు గడిచేందుకు ఉద్యోగం చేస్తానంటాడు. తాను ఏదీ మర్చిపోలేదని, సంవత్సరం లోగా అనుకున్నది సాధిస్తానని చెబుతాడు. నువ్వు ఇలా ధైర్యమిస్తూ ఉంటే ఎందుకు సాధించను అని అంటాడు. వంట అవగానే వచ్చి వడ్డిస్తానని దీప అంటుంది. మళ్లీ థ్యాంక్స్ చెబుతాడు కార్తీక్. మిమ్మల్ని గెలిపించడం నా బాధ్యత అని, ఆ గెలుపే మీ కుటుంబాలను ఒక్కటి చేయాలని అనుకుంటుంది.
కార్తీక్‍ను పెళ్లి చేసుకుంటే దీపకు న్యాయం జరుగుతుందని సంతోషిస్తే.. మళ్లీ ఇలా అందరూ కష్టాల్లో పడతారని ఊహించలేదని అనుకుంటూ దాసు మనసులోనే బాధపడతాడు. దీపే అసలైన వారసురాలని తన నోటితో చెప్పనని జ్యోత్స్నకు మాటిచ్చానని అనుకుంటాడు. ఒకవేళ నీ మనవరాలు దీపే అని శివన్నారాయణకు చెప్పినా ఆదిరిస్తాడా అని అనుకుంటాడు.
శ్రీధర్‌పై స్వప్న ఫైర్
శ్రీధర్‌కు స్వప్న ఫోన్ చేస్తుంది. కాల్ ఎత్తాలని శ్రీధర్‌కు కావేరి రెబుతుంది. వీళ్ల అన్నయ్య రోడ్డు పడేసరికి దారికి వచ్చినట్టు ఉందని, ఎవరైనా నా దారికి రావాల్సిందేనని అంటాడు శ్రీధర్. కాల్ లిఫ్ట్ చేస్తాడు. “డాడీ.. కొంచెమైనా బుద్ధి ఉందా” అని కోప్పడుతుంది స్వప్న. లేదని చెప్పండి అని కావేరి అంటుంది. అదే ఉంటే రెండు పెళ్లిళ్లు ఎలా చేసుకుంటానని శ్రీధర్ అంటాడు. “కష్టాల్లో ఉన్న కొడుకు ఇంటికి వెళ్లి ప్రపంచంలో బుద్ధి ఉన్న ఏ తండ్రైనా బేరాలు మాట్లాడతాడా. డబ్బులు కావాలంటే ఏవో కండీషన్లు పెట్టావంట కదా. అవకాశం దొరికింది కదా” అని తండ్రి శ్రీధర్‌పై స్వప్న ఫైర్ అవుతుంది. ఈగో సాటిసిఫై చేసుకునేందుకే వెళ్లానని శ్రీధర్ అంటాడు. అందరికీ ఈగో ఉందనేలా మాట్లాడతాడు. నీకు కిలోల్లో ఈగో ఉందని స్వప్న వెటకారం చేస్తుంది. మా అన్నయ్య కార్తీక్ జోలికి రావొద్దని, అన్నింటికీ కౌంటర్ ఉంటుందని వార్నింగ్ ఇస్తుంది స్వప్న. నాన్నతో అలానా మాట్లాడేదని దాసు అంటాడు. ఆ మనిషి చేసిన పని అలాంటిదని స్వప్న చెబుతుంది. జరిగిన విషయాన్ని మామ దాసుకు వివరిస్తుంది. మీరు చేసింది తప్పే అని శ్రీధర్‌తో కావేరి అంటుంది. నిన్ను ప్రేమించి కూడా తప్పు చేశానని శ్రీధర్ అంటాడు. ఇలా అంటే కట్టుబట్టలతో బయటికి పంపిస్తానంటుంది కావేరి.
ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి
భోజనం చేసేందుకు కింద చాప వేస్తాడు కార్తీక్. తినేందుకు అందరినీ పిలుస్తాడు. చాప వేశావేంటి నాన్న అని శౌర్య అడుగుతుంది. తనకు ఆకలిగా లేదని కాంచన.. అంటే నాన్న గురించి ఆలోచిస్తాన్నావా అమ్మా అని కార్తీక్ అంటాడు. “చాప వేశారేంటి.. మనం డైనింగ్ టేబుల్ మీద కదా తినేది” అని శౌర్య మళ్లీ అడుగుతుంది. దీంతో ఈ ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదని కార్తీక్ అంటాడు. “ఏమీ లేనప్పుడు ఈ ఇంట్లో మనం ఎందుకు ఉండాలి. మన ఇంటికి వెళ్లిపోవచ్చు కదా” అని శౌర్య ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (డిసెంబర్ 25) ఎపిసోడ్ ముగిసింది.
సంబంధిత కథనం