AP Rains : బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం, రానున్న 3 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు-ap weather updates rain forecast in many districts next three days due to bob depression ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Rains : బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం, రానున్న 3 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు

AP Rains : బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం, రానున్న 3 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు

Dec 24, 2024, 06:34 PM IST Bandaru Satyaprasad
Dec 24, 2024, 06:34 PM , IST

AP Rains : దక్షిణకోస్తా-ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అల్పపీడనం పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందన్నారు.
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

దక్షిణకోస్తా-ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అల్పపీడనం పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందన్నారు.

(1 / 6)

అల్పపీడనం ప్రభావంతో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.  వర్షాల నేపథ్యంలో వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.   

(2 / 6)

అల్పపీడనం ప్రభావంతో రేపు(బుధవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. 

(3 / 6)

ఎల్లుండి(గురువారం) ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.  ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

(4 / 6)

 శుక్రవారం ప్రకాశం, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొనినచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  డిసెంబర్ 28న రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొన్నారు.  

(5 / 6)

అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మంగళవారం ఉదయం నుంచి పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు