Marriage Tips: మీ దగ్గర ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకపోతే పెళ్లికి మీరు అర్హులు కానట్టే.. చేసుకోకండి!!
Marriage Tips:పెళ్లి అనగానే ఇంట్లో పెద్దవాళ్లు ఆస్తులు, కానుకలు వంటి విషయాల గురించి ఆలోచిస్తారు. మరి పెళ్లి చేసుకోబోయే వారు ఏం ఆలోచించాలి? పెళ్లికి మీరు అర్హులేనా? అవతలి వ్యక్తి మీకు సరిగ్గా సరిపోతారా లేదా అనే క్లారిటీ తెచ్చుకోవడం ఎలా? ఇవి తెలుసుకోవాలంటే మిమ్మల్నిమీరు ప్రశ్నించుకోవాలి? ఏమనంటే..
పెళ్లికి ముందు మనం చాలా అనుకుంటాం. పలువురితో చర్చించి చాలా విషయాలు తెలుసుకుంటాం కూడా. పెద్దలు అమ్మాయి లేదా అబ్బాయి బాగున్నారా, ఉద్యోగం చేస్తున్నారా, ఆస్త పాస్తులు ఏమాత్రం ఉన్నాయి అనే విషయాలను గురించి ఆలోచిస్తారు. కానీ నిజానికి బంధాన్ని నిలబెట్టేవి ఇవి మాత్రమేనా. పెళ్లి అనగానే మీరు ఏం ఆలోచిస్తారు. అందరిలాగేనే అమ్మాయి లేదా అబ్బాయి నచ్చాలి. పెళ్లి అలా చేయాలి, ఎంగేజ్ మెంట్ ఇలా చేయాలి అనుకుంటూ ప్లాన్ చేస్తూన్నారు అంతేకాదా..!
వాస్తవానికి పెళ్లి చేసుకోవాలని అనుకుంటే, ముందుగా చేయాల్సింది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం. పెళ్లికి మీరు రెడీగానే ఉన్నారా? మీరు వివాహం చేసుకునే అమ్మాయి లేదా అబ్బాయి మీకు సరిగ్గా సరిపోతారా? వారికి మీరు సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వగలరా అనే క్లారిటీ తెచ్చుకోవడానికి కచ్చితంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఈ 18 ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉండితీరాలి. లేదంటే మీరు పెళ్లికి రెడీగా లేనట్లే అని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు.
మిమ్మల్ని మీరు అడగాల్సిన 18 ప్రశ్నలు..
1. పెళ్లి చేసుకోవాలి అనుకునే వ్యక్తిని మీరు హృదయపూర్వకంగానే మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారా?
2. మీరు ఆ వ్యక్తి మాటలు విని, పూర్తిగా అర్థం చేసుకోగల్గుతున్నారా.?
3. ఆ వ్యక్తితో ఎక్కువ సమయం గడపడాన్ని మీరు ఇష్టంగానే ఫీలవుతారా.?
4. ఆ వ్యక్తి గురించి బాగానే తెలుసుకున్నారా, కొన్ని నెలలు లేదా కొన్ని వారాలైనా ఆ వ్యక్తి గురించి ఆలోచించారా.?
5. ఆ వ్యక్తి ముందు ఎటువంటి భయం లేకుండా మీకు నచ్చినట్లు వ్యవహరించగలరా.?
7. ఆ వ్యక్తితో మీరు గంటల తరబడి ఒకే విషయాన్ని ఎటువంటి భయం లేకుండా చర్చించగలరా.?
8. ఆ వ్యక్తితో మాట్లాడిన తర్వాత ఆందోళన లేదా ఒత్తిడి, సంతోషంగా లేదా ప్రశాంతమైన భావన కల్గుతుందా.?
9. మీరు పెట్టినంతగా శ్రమ, ప్రేమ అవతలి వ్యక్తి వైపు నుంచి కూడా వస్తుందా.?
10. మీరు ఆశించినట్లుగా అవతలి వ్యక్తి ప్రవర్తిస్తున్నారా.?
11. మీరు చెప్పిన ప్రతిదానికి నో చెప్తున్నారా.?
12. ఎమోషనల్ గా అవసరమైన క్షణాల్లో మీతో పాటే ఉంటున్నారా.. మెచ్యూర్ గా బిహేవ్ చేయగలరా.?
13. మిమ్మల్ని మీరు ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేస్తున్నారా, లేదంటే మీరు మారాల్సిందేనని పట్టుబడుతున్నారా.?
14. అపార్థాలను, వాదనలను, గొడవలను సమర్థవంతంగా హ్యాండిల్ చేసుకునే గుణం మీ ఇద్దరిలోనూ ఉందా.?
15. మీరు చేయాలనుకున్న పనులు, మీ ఆశయాలు, ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వారికి మొత్తం చెప్పగలిగారా.?
16. ఆ వ్యక్తి కోసం లేదా ఆమె కోసం బాగా ఆలోచిస్తున్నారా..?
17. మీకు నచ్చని చెడు అలవాట్లు వారిలో ఏమైనా ఉన్నాయా.?
18. మీ నైతికతకు అవరోధం కలిగించేలా ఆ వ్యక్తి వ్యవహరిస్తున్నారా.?
మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాసుకోండి. ఎందుకంటే, మీరు సమాజానికి అబద్ధం చెప్పగలరు. కానీ, మీకు మీరు చెప్పుకుంటే అది ఆత్మవంచన అవుతుంది. ఒకవేళ అలా చేసినా కూడా నష్టపోయేది మీరే. జీవితమంతా సర్దుకుపోతూ, రాజీపడి బతకాల్సి ఉంటుంది. పెళ్లికి ముందే ఇవి మీకు తెలిసి ఉంటే, ఎందుకైనా మంచిది ఒకసారి మీకు కాబోయే పార్టనర్ తో ఈ విషయాలు చెక్ చేసుకోండి. పెళ్లి గురించి సరైన నిర్ణయం తీసుకోండి.
సంబంధిత కథనం
టాపిక్