Bed Time Bad Habits: బెడ్‍పై ఇలాంటి అలవాట్లు వద్దు.. బంధంపై ప్రభావం పడుతుంది!
Bed Time Bad Habits: నిద్రించే సమయంలో బెడ్‍పై చేసే కొన్ని పనులు బంధాలపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే రాత్రి కొన్ని అలవాట్లు ఉండకూడదు. అవేవో ఇక్కడ చూడండి.
ఒక్కోసారి చిన్నచిన్న విషయాలే దంపతుల మధ్య బంధాలను దెబ్బ తీస్తుంటాయి. కొన్ని అలవాట్లు క్రమంగా ప్రభావం చూపిస్తుంటాయి. ముఖ్యంగా నిద్రించే సమయంలో దంపతుల్లో బెడ్‍పై ఒకరు చేసే పనులు మరొకరికి నచ్చకపోవచ్చు. మీరు వాటిని పెద్ద విషయాలుగా అనుకోకపోయినా మీ భాగస్వామికి ఇబ్బందిగా ఉండొచ్చు. దంపతులకు బెడ్‍రూమ్‍లో గడిపే సమయం చాలా విలువైనది. బెడ్‍టైమ్‍లో కొన్ని అలవాట్లు రిలేషన్‍పై దుష్ప్రభావాన్ని చూపొచ్చు. అలా నిద్రించే సమయంలో బెడ్‍పై దంపతులు చేయకూడని అలావాట్లు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
మాట్లాడకుండా.. పట్టించుకోకుండా..
బెడ్‍పై మీ భాగస్వామి ఏదైనా మాట్లాడితే తప్పనిసరిగా పట్టించుకోవాలి. పట్టించుకోనట్టుగా, సరిగా పలకపోతే నొచ్చుకుంటారు. డల్‍గా కూడా ఉండకూడదు. చాలా మంది ప్రశాంతంగా తమ పార్ట్‌నర్‌తో పడకపైనే మాట్లాడాలనుకుంటారు. రోజంతా బిజీగా ఉండటంతో ఇదే సరైన టైమ్ అనుకుంటారు. అయితే, ఒకరు మాట్లాడి మరొకరి పట్టించుకుండా ఉంటే బంధం దెబ్బతింటుంది. ఈ అలవాటు ఎక్కువ రోజులు కొనసాగితే విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.
నెగెటివ్ మాటలు వద్దు
బెడ్‍పై దంపతులు మాట్లాడుకోవడం ముఖ్యం. కానీ నెగెటివ్ పాయింట్స్ ఎప్పుడూ నిద్రించే సమయంలో చర్చించుకోకూడదు. మీ గురించైనా, మీ కుటుంబం గురించైనా సీరియస్ విషయాలను బెడ్‍పై ముచ్చటించుకోకూడదు. ఇలాంటి నెగెటివ్ మాటలు చెప్పుకుంటే ప్రశాంతత కోల్పోయి సరిగా నిద్రపట్టదు. ఇద్దరే ఉంటారు కాబట్టి మాటామాట పెరిగి గొడవలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఏ విభేదాలు ఉన్నా బెడ్ మీదకు రాక ముందే మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. నిద్రించే ముందు సరదాగా, సంతోషకరమైన పాజిటివ్ మాటలు చెప్పుకోవాలి.
షెడ్యుల్ విషయంలో జాగ్రత్త
కొందరు భార్యభర్తలు.. వారి పనుల వల్లనో ఇతర కారణాల వల్లనో వేర్వేరు సమయాల్లో నిద్రించాల్సి వస్తుంది. ఇలాంటి వారు నిద్రస్తున్న తమ భాగస్వామికి ఆటంకం కలగకుండా చూసుకోవాలి. అలాగే వీలైతే ఒకే టైమ్‍లో నిద్రించేలా ఎవరో ఒకరు షెడ్యూల్ మార్చుకుంటే మేలు.
ఇలాంటివి పక్కన పెట్టండి
బెడ్‍పై ఎక్కాక మొబైళ్లు, ల్యాప్‍టాప్‍లు వాడే అలవాటు వద్దే వద్దు. ఇలా చేస్తే ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యంగా ఉన్నారని భావించుకుంటారు. అందుకే బెడ్‍పై ఒకరిపై ఒకరు పూర్తిగా దృష్టి సారించుకోవాలి. నిద్రకు ముందు సమయాన్ని ప్రశాంతంగా గడపాలి. పూర్తిగా నిద్రించే వరకు కూడా టీవీ చూడకూడదు. కాసేపటి ముందే ఆఫ్ చేసేయాలి.
శృంగార విషయంలో..
భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే శృంగారం కూడా ముఖ్యమే. అందుకే వీలైనప్పుడల్లా శృంగారం చేసుకోవాలి. అది కూడా ఇద్దరికీ అంగీకారమైనప్పుడే చేసుకోవడం మంచిది. మీ భాగస్వామిని ఈ విషయంపై అడిగి.. ఓకే అంటేనే శృంగారానికి దిగాలి. సాధారంగా అయితే బెడ్‍పై తరచూ కౌగిలింతలు, ముద్దులు లాంటివి చూసుకుంటే ఎఫెక్షన్ బలపడుతుంది. శృంగారం విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం
జీవిత భాగస్వాముల్లో ఒకరు వ్యక్తిగత శుభ్రత పాటించకపోతే.. ఇది మరొకరికి చాలా ఇబ్బందిగా మారుతుంది. బెడ్‍పై ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సమస్యగా ఉన్నా ఈ విషయం చెప్పేందుకు చాలా మంది జంకుతుంటారు. ఇది ఎక్కువ కాలం కొనసాగితే బంధంపై ప్రభావం పడుతుంది. అందుకే వ్యక్తిగత శుభ్రత పాటించడం చాలా ముఖ్యం.
టాపిక్