జ్యోతీష్య శాస్త్రంలో సూర్యుడిని గ్రహాలకు రాజు అంటారు. సూర్యుడు 2025 కొత్త సంవత్సరం ప్రారంభంలో మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం మేషం నుండి మీన రాశి వారిపై ప్రభావం చూపుతుంది. మకర రాశి 2025 జనవరి 14న ఉదయం 09:03 గంటలకు, సూర్యుడు ఫిబ్రవరి 12, 2025 రాత్రి 10:03 గంటలకు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు.
సూర్యుడు మకర రాశిలో సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక పురోగతితో పాటు వ్యాపార ప్రయోజనాలు లభిస్తాయి. సూర్యుని సంచారం ఏ రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకోండి.
మేష రాశి వారికి సూర్యుని సంచారం శుభదాయకం. ఈ కాలంలో ఆర్థిక పురోగతి, వ్యాపార విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని శుభవార్తలు అందుకుంటారు. జీవితంలో సానుకూల మార్పుల సంకేతాలు ఉన్నాయి.
వృషభ రాశి వారికి సూర్య సంచారం మేలు చేస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పెట్టుబడిపై మంచి రాబడి పొందొచ్చు.
మకర రాశి వారికి ఇది చాలా మంచి సమయం. నూతన సంవత్సరంలో ఆర్థిక పురోగతిని పొందవచ్చు. ఆరోగ్య సంబంధ సమస్యలు సమసిపోతాయి. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. వ్యాపారంలో విస్తరణ సాధ్యమవుతుంది.
సూర్యుని మకర సంచారం సింహ రాశి వారికి మంచి రోజులను సృష్టిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనుల్లో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. వ్యాపారంలో లాభాలు పొందవచ్చు. ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది.
వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసివస్తుంది. అదృష్టవశాత్తూ ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చు. గౌరవం పెరుగుతుంది. మీ మాటతీరుతో ప్రజలను ఆకట్టుకోగలుగుతారు. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందవచ్చు.
సంబంధిత కథనం