జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసే విద్యార్థుల కోసం ఈ లిస్ట్.. ఐఐటీల్లో టాప్ 10 కోర్సులు!
IIT Top Courses : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భారతదేశంలోని టాప్ ఇంజనీరింగ్ విద్యను అందిస్తుంది. 23 శాఖలతో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఐఐటీలు ఉన్నాయి. జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో క్వాలిఫై అయితే ఐఐటీల్లో ప్రవేశం పొందవచ్చు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భారతదేశంలోని టాప్. 23 శాఖలతో దేశవ్యాప్తంగా ఐఐటీలు ఉన్నాయి. ఇందులో సీటు సాధించేందుకు విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసి మార్కుల ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశం పొందుతారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ లో మంచి కటాఫ్ మార్కులు సాధించిన విద్యార్థులు తమకు నచ్చిన ఐఐటీ కోసంచ చూస్తారు. ఐఐటీ ఒకే రకమైన బీటెక్ కోర్సును మాత్రమే అందించడం లేదు. చాలా రకాల కోర్సులను అందిస్తున్నాయి. విద్యార్థులు ఉత్తమ కోర్సును ఎంచుకోవడం చాలా కష్టమవుతుంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ లో ఉత్తీర్ణత సాధించి కౌన్సెలింగ్‌తో ముందుకు వచ్చే విద్యార్థులకు డిమాండ్ ఉన్న కోర్సుల వైపు చూస్తారు. ఐఐటీలో ఉత్తమ కోర్సులు కొన్ని ఉన్నాయి. అవేంటో చూడండి.
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్
- ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
- సివిల్ ఇంజినీరింగ్
- మెకానికల్ ఇంజినీరింగ్
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రానిక్ అండ్ కంప్యూటింగ్
- మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్
- ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
- కెమికల్ ఇంజినీరింగ్
జేఈఈ మెయిన్స్‌లో టాప్ 2.5 లక్షల ర్యాంకులు సాధించిన అభ్యర్థులు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయగలరు. జేఈఈ అడ్వాన్స్‌డ్ లో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులకు దేశంలోని టాప్ ఐఐటీల్లో బీటెక్ కోర్సులో ప్రవేశం లభిస్తుంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మెకానికల్, సివిల్, ఈసీఈ, ఎలక్ట్రికల్ వంటి పలు బీటెక్ కోర్సులను ఐఐటీలు అందిస్తున్నాయి.
వీటన్నింటిలో ఐఐటీ బాంబే బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్సు అత్యంత ప్రజాదరణ పొందినది. జేఈఈ అడ్వాన్స్‌డ్ టాపర్లకు మొదటి ఛాయిస్‌గా ఇదే ఎక్కువగా ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023లో టాపర్లుగా నిలిచిన 10 మంది ఐఐటీ బాంబేలోని పొవాయ్ క్యాంపస్‌ను ఎంచుకోగా, 2021, 2022 సంవత్సరాల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్ టాప్ 10లో 9 మంది విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నారు. ఈ ఏడాది టాప్ 100 మంది విద్యార్థుల్లో 89 మంది ఐఐటీ బాంబే కంప్యూటర్ సైన్స్ కోర్సును తమ మొదటి ఎంపికగా ఎంచుకున్నారు. కానీ వారిలో 67 మంది మాత్రమే కటాఫ్‌కు చేరుకోగా, మిగిలిన వారు రెండో ఆప్షన్ ను ఎంచుకోవాల్సి వచ్చింది.