B school exams : క్యాట్‌కి ఇవి ప్రత్యామ్నాయం.. ఈ పరీక్షలతో టాప్ బీ స్కూల్స్‌లో చదువుకోవచ్చు!
టాప్ బీ స్కూల్స్‌లో చదువుకోవాలన్న మీ కలలను క్యాట్ పరీక్షతో ఆపేయకండి! బీ స్కూల్స్‌లో చేరేందుకు దేశంలో మరికొన్ని పరీక్షలు కూడా ఉన్నాయి. వాటిలో మంచి స్కోర్ సాధిస్తే, బీ స్కూల్లో చేరవచ్చు. ఆ పరీక్షల వివరాలు..
భారతదేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ కోర్సులకు కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) అత్యంత ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షగా గుర్తింపు పొందింది. ఏటా లక్షలాది మంది అభ్యర్థులు పరీక్ష రాస్తుంటారు. కానీ కొద్ది శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఫలితంగా చాలా మంది ఆశావహులు తాము కోరుకున్న బిజినెస్ స్కూళ్లలో అడ్మిషన్ పొందే అవకాశం కోల్పోయినట్టు బాధపడుతుంటారు. నిరాశ చెందుతారు. అయితే క్యాట్‌కి కూడా ప్రత్యమ్నాయాలు ఉన్నాయని గుర్తించాలి. కింద పేర్కొన్న పరీక్షలు క్యాట్ పరీక్షకు ప్రత్యామ్నాయంగా, దేశవ్యాప్తంగా ఉన్న పలు టాప్ బిజినెస్ స్కూల్స్‌లో అడ్మిషన్ ప్రాసెస్‌కి అనుమతిస్తాయి. వీటిల్లో మంచి స్కోర్ సాధించి మీ కలలను నెరవేర్చుకోవచ్చు. విదేశీ విద్యాసంస్థలు సైతం వీటిల్లో కొన్నింటినీ స్వీకరిస్తాయి. ఆయా పరీక్షల వివరాలు..
జీమ్యాట్..
గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్) అనేది అభ్యర్థుల క్రిటికల్ థింకింగ్, క్వాంటిటేటివ్, వెర్బల్, అనలైటికల్ రైటింగ్ స్కిల్స్‌ని అంచనా వేసే ప్రామాణిక పరీక్ష. ప్రపంచవ్యాప్తంగా అనేక అగ్రశ్రేణి బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశానికి ఈ పరీక్ష కీలక ప్రమాణంగా ఉండటమే కాకుండా, గ్రాడ్యుయేషన్ తర్వాత స్కాలర్షిప్స్, మెరుగైన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది.
సీమ్యాట్..
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఆమోదం పొందిన సంస్థలు, విశ్వవిద్యాలయ విభాగాలు, అనుబంధ కళాశాలలు అందించే మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్ ). క్వాంటిటేటివ్ టెక్నిక్, లాజికల్ రీజనింగ్, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్‌నెస్‌లో అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో మూడు గంటల పరీక్షగా సీమ్యాట్ పరీక్షని నిర్వహిస్తుంది. దరఖాస్తు గడువు డిసెంబర్ 25తో ముగియనుందని గుర్తుపెట్టుకోవాలి.
ఎక్స్ఏటీ..
పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే మరో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ఎక్స్ఏటీ (జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్). ఎక్స్ఏటీ 2025 దరఖాస్తు విండో క్లోజ్ అయింది. ఈసారి 250కి పైగా సంస్థలు పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షను ఉపయోగించుకోనున్నాయి. పూర్తి జాబితా కోసం ఇక్కడ తనిఖీ చేయండి.
ఎన్‌ఎంఏటీ..
గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ (జీఎంఏసీ™) అనుబంధ సంస్థ అయిన గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ గ్లోబల్ కనెక్షన్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ (జీఎంజీసీ) నిర్వహించే పరీక్ష పేరు ఎన్‌మ్యాట్ నార్సీ మోంజీ మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీమ్యాట్). ఈ పరీక్ష రెండు విధానాల్లో అందుబాటులో ఉంది. టెస్ట్ సెంటర్ ఆధారిత పరీక్ష, ఆన్లైన్ పరీక్ష.
ఏఐఎంఏ మ్యాట్..
ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ నిర్వహించే ఏఐఎంఏ మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) ఎంబీఏ, అనుబంధ కోర్సుల్లో ప్రవేశానికి ప్రభుత్వం ఆమోదించిన జాతీయ స్థాయి పరీక్ష ఇది. ఈ పరీక్షలో భారతదేశం అంతటా 600 బీ-స్కూల్స్ భాగంగా ఉన్నాయి.
ఏఐఎంఏ మ్యాట్‌లో పాల్గొనే బి-స్కూల్స్ జాబితాని చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం