Tea: మీరు ఈ కెఫీన్ లేని టీతో రోజును ప్రారంభించండి, చలికాలంలో గొంతు నొప్పి జలుబు రమ్మన్నారావు
Tea: టీ, కాఫీలు ఆరోగ్యానికి మంచిదే, కానీ అందులో ఉండే కెఫీన్ మాత్రం ఎక్కువైతే ఆరోగ్యానికి చెడు చేస్తుంది. అందుకే ఇక్కడ ఇచ్చిన కెఫిన్ లేని టీ తాగేందుకు ప్రయత్నించండి.
చలికాలంలో రోజును ప్రారంభించాలంటే వేడి వేడి టీ లేదా కాఫీయే మంచి ఎంపిక అని భావిస్తారు ఎంతోమంది. అందుకే ఈ రెండిట్లో ఏదో ఒకటి తాగాకే పనులు మొదలుపెడతారు. టీలోను, కాఫీలోను కూడా కెఫీన్ నిండిపోయి ఉంటుంది. కెఫీన్ నిండిన టీ, కాఫీలను తాగే బదులు కెఫీన్ లేని టీని తయారుచేసుకొని తాగితే ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా చలికాలంలో కెఫీన్ లేని టీ తాగడం వల్ల గొంతు నొప్పి, ముక్కుదిబ్బడ వంటివి రాకుండా ఉంటాయి. అలాగే రక్తప్రసరణ కూడా పెంచుతాయి. మేము ఇక్కడ కెఫీన్ రహిత పుదీనా టీ రెసిపీ ఇచ్చాము. దీన్ని తాగడం ద్వారా మీరు చలికాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చు.
చలికాలం వచ్చిందంటే వాతావరణంలో మార్పులు ఎక్కువైపోతాయి. గొంతు నొప్పి, దగ్గు, జలుబు వేధిస్తూ ఉంటాయి. వేడివేడి టీ తాగితే ఎంతో హాయిగా అనిపిస్తుంది. అయితే కెఫీన్ ఉన్న టీ, కాఫీలను అధికంగా తాగడం మిగతా శరీర అవయవాలకు మంచిది కాదు. కాబట్టి హెర్బల్ టీ అయిన పుదీనా టీ చేసుకోవడానికి ప్రయత్నించండి. చలికాలంలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటాయి. అంటే ఈ పుదీనా టీ ఎంతో ఉపయోగపడుతుంది. గొంతు నొప్పికి కూడా ఉపశమనం కలిగిస్తుంది. పుదీనా ఆకులలో ఉండే మెంథాల్, మెంథోన్, లీమోనన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి నొప్పి నివారణిలుగా పని చేస్తాయి. ముక్కు దిబ్బడ కట్టకుండా చూస్తాయి. గొంతు నొప్పితో పాటు తలనొప్పి కూడా తగ్గిస్తాయి.
నిపుణులు చెబుతున్న ప్రకారం మెంతి ఆకుల టీ తాగడం వల్ల రక్త ప్రవాహం శరీరానికి ఎక్కువగా జరుగుతుంది. పుదీనా టీలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు, అలెర్జీల నుంచి మనల్ని కాపాడతాయి. అధ్యయనాల ప్రకారం పుదీనాలో ఉండే మెంథాల్ మన ముక్కు రంధ్రాలలో గాలి ప్రవాహం సరిగా జరిగేలా చూస్తుంది. శ్వాస కూడా సరిగా ఆడేలా జాగ్రత్తపడుతుంది.
పుదీనాలో రోజ్‌మేరీ ఆకులను కూడా వేసి కలుపుకొని టీ చేస్తే మరిన్ని ప్రయోజనాలు దక్కుతాయి. రోజ్‌మేరీ, పుదీనా రెండింట్లో కూడా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఈ రెండూ కూడా బ్యాక్టీరియా సంక్రమణలను సమర్థవంతంగా అడ్డుకుంటాయి.
పుదీనా టీ రెసిపీ
స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని వేసి మరిగించండి. అందులోనే పుదీనా ఆకులను వేసి ఐదు నిమిషాలు మరిగించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఈ నీటిని వడకట్టి తాగేందుకు ప్రయత్నించండి. మీకు పుల్లగా కావాలనిపిస్తే నిమ్మరసం కలుపుకోండి. లేదా తియ్యగా కావాలనిపిస్తే తేనె కలుపుకోండి. ఈ రెండూ కూడా ఆరోగ్యానికి మేలు చేసేదే. ఈ పుదీనా టీని ప్రతి రోజు తాగడం తాగితే మీకు ఎలాంటి రోగాలు దరి చేరవు. చలికాలం అనారోగ్యం పాడిన పడకుండా ఉండవచ్చు.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
టాపిక్