Telangana News Live December 24, 2024: Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై బిగ్ అప్డేట్- తొలిదశలో వీరికి కేటాయింపు, రేషన్ కార్డు లేకపోయినా
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 24 Dec 202402:51 PM IST
Indiramma Housing Scheme : సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తొలివిడతలో దివ్యాంగులు, వితంతవులకు అవకాశం కల్పిస్తామన్నారు. నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మిస్తామన్నారు.
Tue, 24 Dec 202412:51 PM IST
- Sandhya Theater Stampede Case : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ ఘటనపై సీరియస్ ఫోకస్ పెట్టిన పోలీసులు.. 18 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ పేర్లు ఉన్నాయి. ఈ పేర్ల లిస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.
Tue, 24 Dec 202410:34 AM IST
Allu Arjun : తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. సుమారు 3.30 గంటల పాటు అల్లు అర్జున్ ను పోలీసులు విచారించారు. విచారణ ముగిసిన అనంతరం అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్లిపోయారు.
Tue, 24 Dec 202410:12 AM IST
- Allu Arjun : పుష్ప 2 సినిమా ద్వారా అల్లు అర్జున్ ఎంత ఫేమస్ అయ్యారో తెలియదు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసుతో మాత్రం నేతల నోళ్లలో నానుతున్నారు. ముఖ్యంగా బన్నీ టాక్ ఆఫ్ ది తెలంగాణ పాలిటిక్స్‌గా మారారు. అధికార కాంగ్రెస్ ఓ స్టాండ్ తీసుకుంటే.. బీఆర్ఎస్, బీజేపీ బన్నీకి సపోర్ట్‌గా నిలుస్తున్నాయి.
Tue, 24 Dec 202409:51 AM IST
Congress Mlc Complaint On Allu Arjun : సినీ హీరో అల్లు అర్జున్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలో ఓ సన్నివేశం పోలీసులను కించపరిచేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Tue, 24 Dec 202409:21 AM IST
TG Govt Landless Poor Scheme : తెలంగాణ ప్రభుత్వం భూమి నిరుపేదలకు ఏటా రెండు విడతల్లో రూ.12 వేల ఆర్థిక సాయం ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ నెల 28న తొలి విడతలో రూ.6 వేలు అకౌంట్లలో జమ చేయనున్నారు. ఈ పథకానికి ఉపాధి హామీ జాబ్ కార్డును ప్రాతిపదికంగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Tue, 24 Dec 202408:28 AM IST
Tollywood Shifting : తెలంగాణలో ఇటీవల పరిస్థితులతో టాలీవుడ్ ఏపీకి తరలిపోతుందనే చర్చ మొదలైంది. టాలీవుడ్ తరలిపోయేంతగా ఏపీలో మౌలిక సదుపాయాలు ఉన్నాయా? వాస్తవ పరిస్థితులు ఏంటో చూద్దాం.
Tue, 24 Dec 202407:22 AM IST
- Questions to Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది.. అల్లు అర్జున్‌కు ఏం తెలుసు అని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఏసీపీ స్థాయి అధికారి బన్నీ స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విచారణపై ఉత్కంఠ నెలకొంది.
Tue, 24 Dec 202405:46 AM IST
- Allu Arjun : అల్లు అర్జున్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నేతలకు స్పష్టమైన సూచనలు చేసింది. ఇకపై ఎవరూ అల్లు అర్జున్ అంశంపై స్పందిచవద్దని ఆదేశించింది. అవసరమైనప్పుడు పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి మాట్లాడతారని స్పష్టం చేసింది. అటు బన్నీని ఇవాళ పోలీసులు ప్రశ్నించనున్నారు.
Tue, 24 Dec 202404:47 AM IST
- Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై రేవంత్ సర్కారు స్పెషల్ ఫోకస్ పెట్టింది. 33 జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించాలని నిర్ణయించింది. ఈ పథకానికి సంబంధించిన పురోగతిపై మంత్రి పొంగులేటి ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. సర్వే జరుగుతున్న తీరును తెలుసుకోనున్నారు.
Tue, 24 Dec 202401:34 AM IST
- Jagityal Murder: తన్నేందుకు వెళ్ళి తన్నించుకున్నట్టైంది... జగిత్యాల జిల్లాలో జరిగిన హత్యా ఘటన. హత్యకు ముంబై గ్యాంగ్ స్టర్ సుపారీ తీసుకుని చివరకు అతనే హత్యకు గురయ్యాడు. నామరూపాలు లేకుండా బూడిద కుప్ప అయ్యాడు.