Orange peel Mask: నారింజ తొక్కలను పొడి చేసి ఇలా ఫేస్ మాస్క్ వేసుకుంటే మీ చర్మం పసుపు వర్ణంలో మెరిసిపోతుంది
Orange peel Mask: నారింజ పండు ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి శరీరానికి అందుతాయి. అలాగే నారింజ తొక్కలతో చర్మాన్ని మెరిపించుకోవచ్చు కూడా. నారింజ తొక్కల పొడితో ఫేస్ మాస్క్ ఎలా వేయాలో తెలుసుకోండి.
చలికాలంలో చర్మం త్వరగా పొడి బారిపోతుంది. చలిగాలి కారణంగా చర్మంలో తేమ తగ్గడం మొదలవుతుంది. దీనివల్ల చర్మం నిర్జీవంగా, గరుకుగా కనిపిస్తుంది. కాంతివిహీనంగా ఉంటుంది. మీరు కూడా చలికాలంలో పొడి, పేలవమైన చర్మంతో ఇబ్బంది పడుతుంటే ఈ చిన్న చిట్కా పాటించండి. ఆరెంజ్ పీల్ ఫేస్ ప్యాక్ ను ముఖానికి వేయడం వల్ల చర్మం మెరిసిపోవడం ఖాయం. బాలీవుడ్ నటి దియా మీర్జా కూడా ఈ ఫేస్ ప్యాక్ వేసుకునే మెరిసే చర్మాన్ని పొందుతుంది. ఈ ఆరెంజ్ పీల్ ఫేస్ ప్యాక్ ను ఇంట్లోనే సులభంగా తయారు చేసి ముఖానికి అప్లై చేయవచ్చు. ఆరెంజ్ పీల్ ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మంపై ఉన్న మరకలు, మచ్చలు కూడా తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. ఆరెంజ్ పీల్ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
ఆరెంజ్ పీల్ ఫేస్ ప్యాక్ ఎలా
ఈ హోంమేడ్ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి, మీకు ఆరెంజ్ తొక్కలు, టమోటా, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ అవసరం. ఆరెంజ్ పీల్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలంటే ముందుగా ఆరెంజ్ తొక్కను బాగా ఎండబెట్టి గ్రైండ్ చేసి దాని నుంచి పౌడర్ తయారు చేసుకోవాలి. లేదా పచ్చి తొక్కను కూడా రుబ్బి పేస్టులా చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో టొమాటో రసం, కొద్దిగా రోజ్ వాటర్ వేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ను మీ ముఖం, మెడపై పూర్తిగా అప్లై చేసి ఆరిపోయే వరకు పావుగంట సేపు ఉంచండి. పావు గంట తరువాత తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి రెండు సార్లు ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంలో డీప్ క్లెన్సింగ్, పిగ్మెంటేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు.
నారింజ తొక్క సహజ క్లెన్సర్ గా పనిచేస్తుంది. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మరకలు, మొటిమలు, పిగ్మెంటేషన్, ముడతలను రాకుండా అడ్డుకుంటుంది. ఇప్పటికే మీకు ఈ చర్మ సమస్యలు వస్తే వాటిని వదిలించుకోవడానికి ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అదే సమయంలో ఈ ప్యాక్ లో ఉపయోగించే టమోటా కూడా ముఖంలోని రంధ్రాలను తగ్గించడం ద్వారా పిగ్మెంటేషన్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.