Christmas Gifts: క్రిస్మస్ రోజున వీటిని బహుమతిగా ఇచ్చారంటే.. ఎవ్వరైనా ఇంప్రెస్ అవాల్సిందే!
Christmas Gifts: క్రిస్మస్ పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కరూ ఆలోచించేది బహుమతుల గురించే. తమ ప్రియమైన వారికి ఎలాంటి బహుమతులు ఇస్తే బాగుంటుంది, ఏమిస్తే వారు చాలా సంతోషిస్తారు అని. మీరూ అలాంటి పరిస్థితిలోనే ఉంటే.. ఇక్కడ మీ కోసం కొన్ని గిఫ్ట్ ఐడియాస్ ఉన్నాయి. వీటిని ఇచ్చారంటే ఎవ్వరైనా ఇంప్రెస్ అవాల్సిందే.
ఇతర పండుగలతో పోల్చి చూస్తే క్రిస్మస్ పండుగలో బహుమతులకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఈ పండగ వచ్చిందంటే చాలా మంది బహుమతుల గురించే ఆలోచిస్తారు. ఈ పండక్కి నాకు ఎన్ని బహుమతులు వస్తాయి..? ఎవరెవరు ఎలాంటి గిఫ్ట్ లు ఇస్తారు అని ఆలోచించే వారు కొందరైతే.. తమ ప్రియమైన వారికి క్రిస్మస్ రోజున ఎలాంటి వస్తువులను ప్రెజెంట్ చేయాలి..? ఏమిస్తే వారు ఇంప్రెస్ అవుతారు.. వారికి సంతొషాన్నిచ్చే విషయాలేంటి అని ఆలోచించేవారు మరి కొందరు.
కొన్నిసార్లు మీ ప్రియమైనవారికి సరైన బహుమతి కనుగొనడం చాలా భారంగా మారుతుంది. మీరు కూడా అదే పరిస్థితిలో ఉంటే.. ఈ క్రిస్మస్ కు మీకు ఇష్టమైన వారికి ఏమివ్వాలో ఇంకా తేల్చుకోకపోతే మేము మీకు సహాయపడగలం. ఇక్కడ కొన్ని ఆలోచనాత్మకమైన, ప్రత్యేకమైన బహుమతుల జాబితాను మీ కోసం తీసుకొచ్చాము. వీటిలో ఏది ఇచ్చినా మీ ప్రియమైన వ్యక్తులు ఇంప్రెస్ అవడం ఖాయం. ఆలస్యం చేయకుండా అవేంటో చూసేద్దామా
1-ఇంట్లో తయారుచేసిన చాక్లెట్లు, కేకులు లేదా కుకీలు
పండుగ రోజుల్లో బయట విందులు, కొనుక్కొచ్చిన స్వీట్ల కన్ఎనా.. మీ ప్రియమైన వారికోసం మీరే రుచికరంగా చేసి పెడితే చాలా బాగుంటుంది. మీరు స్వయంగా కేకులు, కుకీస్ లేదా చాక్లెట్లు వంటివి తయారు చేసి వాటిని బహుమతిగా ఇచ్చారంటే వారు చాలా సంతోషిస్తారు. వారి కోసం మీరు పడ్డ శ్రమకు కచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. ఎక్కువ సమయం పట్టనివి ఈజీగా తయారు చేసుకునే మంచి కేకులు, కుకీల వంటకాలు యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి.
2-పర్సనలైజ్డ్ ఫోటో క్యాండిల్స్ / ఫోటో ఫ్రేమ్‌లు
ప్రతిసారీ మీ గురించి ఎవరికైనా గుర్తు చేయడానికి, వారిని ఇంప్రెస్ చేయడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే ఫోటో ఫ్రేమ్ లేదా ఫోటో క్యాండిల్. ఇవి వారికి వ్యక్తిగతంగా చాలా నచ్చుతాయి. మీతో వారి జ్ఞాపకాలను వారికి బహుమతిగా ఇవ్వడం వారికి చాలా సంతోషాన్నిస్తుంది. దీని కోసం మీకు తెలుపు కొవ్వొత్తు లేదా లేత రంగు కొవ్వొత్తులను తీసుకుని గాజు జార్లో, సాదా ప్రింటర్ కాగితంపై మీ ఫోటో ప్రింట్ చేయిస్తే చాలు. ఎక్కువ ఖర్చు లేకుండా చక్కటి బహమతిని ఇవ్వచ్చు.
3-మినీ పుస్తకం
పర్సనల్ గా హ్యాపీగా ఫీలయ్యేలా మీరు ఎవరికైనా బహుమతి ఇవ్వాలనుకుంటే.. మినీ బుక్ మీకు మంచి ఎంపిక. వారిపై మీ భావాలను ఒక కాగితంలో రాయడం, వారు మీకు ఎలా ముఖ్యమో తెలియజేస్తూ చిన్న చిన్న లేఖలుగా రాసి ఒక జార్ లేదా మినీ పుస్తకంలో ప్యాక్ చేసి ఇవ్వండి. ఇది వారికి ఖచ్చితంగా నచ్చుతుంది. దీనికి క్రియేటివ్ టచ్ ఇవ్వడానికి స్టిక్కర్లు, శీర్షికలు, పండుగ డిజైన్లతో అలంకరించండి.
4- హ్యాండ్ పెయింటెడ్ కాఫీ మగ్
మీ ప్రియమైన వ్యక్తి కోసం వారికి నచ్చే విధంగా సాదా తెలుపు సిరామిక్ కాఫీ మగ్ తీసుకురండి. యాక్రిలిక్ పెయింట్ సహాయంతో వారికి నచ్చే విధంగా డిజైన్ చేసి వారికి పండుగ రోజున బహుమతిగా ఇవ్వండి. వారు ఉదయం కాఫీ లేదా టీ సిప్ చేసినప్పుడల్లా, అది వారికి మిమ్మల్ని గుర్తు చేసేలా వ్యక్తిగత సందేశాన్ని రాయండి.
5-గిఫ్ట్ బాస్కెట్
మనస్సులో చాలా బహుమతులు ఉన్నాయి, కానీ ఒకదాన్ని కచ్చితంగా నిర్ణయించలేకపోతున్నా అనుకునే వారు చేయాల్సిన పనేంటంటే.. ఒక బుట్ట లేదా బకెట్ తీసుకొని, వ్యక్తి అభిరుచి, వ్యక్తిత్వాన్ని బట్టి వారికి నచ్చేవి, మీరు ఎంచుకున్నవి అన్నింటినీ దాంట్లో ప్యాక్ చేసి సర్‌ఫ్రైజ్ ప్యాక్ చేసి బహుమతిగా ఇవ్వండి.
6. చేతితో తయారుచేసిన ఆభరణాలు
పూసలు, తీగలు వంటి వాటితో మీరు స్వయంగా తయారు చేసిన ఆభరణాలు, కుట్టిన రుమాలు లేదా స్కార్ఫ్ లు వంటి వాటిని ప్రత్యేకంగా తయారు చేయండి. బ్రాస్‌లెట్‌లు, నెక్లెస్‌లు లేదా చెవిపోగులను డిజైన్ చేయండి. మీ ప్రియమైన వ్యక్తికి ఇష్టమైన రంగులు లేదా రాళ్లతో వాటిని వ్యక్తిగతీకరించండి.
సంబంధిత కథనం