Electric Scooters : ఈ ఏడాది మార్కెట్‌లోకి వచ్చిన 3 సూపర్ డూపర్ ఎలక్ట్రిక్ స్కూటీలు.. వీటికి ఫ్యాన్స్ ఎక్కువే!
Electric Scooters In 2024 : 2024లో టాప్ కంపెనీల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్ అయ్యాయి. వీటి అమ్మకాలు కూడా ఎక్కువే ఉన్నాయి. ఈ లిస్టులో ఏథర్, బజాజ్, టీవీఎస్ కంపెనీల ఈవీలు ఉన్నాయి.
భారతీయ వినియోగదారులలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. వాస్తవానికి పెట్రోల్ కంటే ఎలక్ట్రిక్ ఆధారిత స్కూటర్లను చాలా మంది ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వీటి ద్వారా ఖర్చులు కూడా తక్కువ. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అనేక దిగ్గజ ఆటో కంపెనీలు తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత మార్కెట్లో విడుదల చేశాయి. 2024 సంవత్సరంలో లాంచ్ చేసిన 3 గొప్ప ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
బజాజ్ చేతక్
బజాజ్ ఇటీవల తన పాపులర్ స్కూటర్ చేతక్ 35 సిరీస్‌ను అప్‌డేట్ చేసింది. అప్ డేటెడ్ బజాజ్ చేతక్‌ను కంపెనీ కొద్దిపాటి డిజైన్ మార్పులతో కొత్త కలర్ ఆప్షన్‌లో లాంచ్ చేసింది. ఇది కాకుండా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, మ్యూజిక్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ నావిగేషన్‌ను సపోర్ట్ చేసే స్కూటర్‌లో టిఎఫ్టి స్క్రీన్లను కూడా వినియోగదారులు పొందుతారు. బజాజ్ చేతక్ తన కస్టమర్లకు 153 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది.
టీవీఎస్ ఐక్యూబ్
టీవీఎస్ ఐక్యూబ్ ఎల్లప్పుడూ భారతీయ వినియోగదారులలో ప్రజాదరణ పొందిన స్కూటర్. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2024 ప్రారంభంలో టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ వేరియంట్ 3.2 కిలోవాట్, 5.5 కిలోవాట్లతో సహా రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇది కాకుండా కంపెనీ 2.2 కిలోవాట్ల బ్యాటరీతో వేరియంట్‌ను కూడా విడుదల చేసింది.
ఏథర్ రిజ్టా
ఏథర్ ఎనర్జీ తన మోస్ట్ అవైటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రిజ్టాను 2024 సంవత్సరంలో భారత మార్కెట్లో విడుదల చేసింది. రిజ్టా భారతీయ వినియోగదారుల కోసం మొత్తం 2 వేరియంట్లలో లభిస్తుంది. రిజ్టాలో వినియోగదారులు నోటిఫికేషన్ అలర్ట్స్, లైవ్ లొకేషన్ షేరింగ్, గూగుల్ మ్యాప్స్‌ను సపోర్ట్ చేసే 7 అంగుళాల టిఎఫ్టీ స్క్రీన్‌ను పొందుతారు. ఈ స్కూటర్ 2.9 కిలోవాట్, 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇది వరుసగా 123 కిలోమీటర్లు, 160 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుంది.